కస్టమర్ల ఇంటి వద్దకే డీజిల్ డెలివరీ; ఐడియా బాగుంది కదూ..!

డోర్ స్టెప్ డెలివరీ, ఇప్పుడు భారతదేశంలో ఇదే ట్రెండింగ్. వంటల్లో ఉపయోగించుకునే ఉప్పు, పప్పూ నుండి మొదలుకొని అనేక వస్తువులు మరియు అనేక రకాల సేవలు నేరుగా కస్టమర్ల ఇంటి వద్దకే వచ్చి తలుపులు తడుతున్న సంగతి మనందరికీ తెలిసినదే.

ప్రత్యేకించి కరోనా మహమ్మారి నేపథ్యం తర్వాత, ఈ డోర్ స్టెప్ సేవల వినియోగం మరింత పెరిగిపోయింది. ఇటీవలి కాలంలో ఆటోమొబైల్ కంపెనీలు కొత్త కార్లను కస్టమర్ల ఇంటికే డెలివరీ చేయటం ప్రారంభించాయి. అలాగే, కొన్ని కార్ సర్వీస్ కంపెనీలు కస్టమర్ ఇంటి వద్దకే వచ్చి వాహనాలను సర్వీస్ చేయటం ప్రారంభించాయి.

ఇంటి వద్దకే డీజిల్; ఐడియా అదుర్స్..

ఇలా, దేశంలో డోర్ స్టెప్ డెలివరీ సేవలు గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా, గో ఫ్యూయల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్ట్-అప్ వెంచర్, ఇప్పుడు కస్టమర్ల ఇంటి వద్దకే హై-స్పీడ్ డీజిల్ (హెచ్ఎస్‌డి)ను సరఫరా చేసేందుకు ముందుకొచ్చింది.

గత సంవత్సరం జూలై నెలలో, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎమ్‌సిలు) ఇంధన పారిశ్రామికవేత్తల కోసం డోర్‌స్టెప్ హెచ్ఎస్‌డిని అందించడానికి ఆసక్తిని వ్యక్తం చేశాయి. ఇప్పుడది కార్యరూపం దాల్చింది.

ప్రస్తుతానికి ఈ స్టార్టప్ హై-స్పీడ్ డీజిల్ (హెచ్ఎస్‌డి)ను మాత్రమే సరఫరా చేస్తుంది. ఈ ఇంధనాన్ని జనరేటర్లు, పరిశ్రమలు మరియు వ్యవసాయ సంబంధిత పరికరాల్లో ఉపయోగిస్తారు.

ఇలాంటి వినియోగదారుల నుండి డిమాండ్ పెరగుతున్న నేపథ్యంలో, వారికే నేరుగా డీజిల్‌ను సరఫరా చేసేలా ఈ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేశారు. పెట్రోల్ రిటైల్ అవుట్లెట్లు పరిమిత స్థాయిలో ఉండటం, రవాణా సమయంలో సురక్షితమైన పద్ధతులు పాటించని కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ గో ఫ్యూయెల్ ఎంతో సురక్షితంగా నేరుగా కస్టమర్ కోరిన ప్రదేశానికే డీజిల్‌ను డెలివరీ చేస్తుంది.

దేశంలో డిజిటల్ ఆధారిత కొనుగోళ్లు పెరగడంతో, కాంటాక్ట్‌లెస్ లావాదేవీలను అందించడానికి ఇదొక చక్కటి మార్గంగా చెప్పుకోవచ్చు. దేశంలోని మూడు ప్రధాన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుండి గో ఫ్యూయల్ సరఫరా లైసెన్సులను పొందింది.

ఇంటి వద్దకే డీజిల్; ఐడియా అదుర్స్..

దీంతో ఇది భారతదేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వేతర మద్దతుగల చమురు పంపిణీ సంస్థగా నిలిచింది. రవాణా మరియు సరఫరా సమయంలో ఇంధనం యొక్క మంచి భద్రత కోసం అందుబాటులో ఉన్న సరికొత్త వ్యవస్థలను ఉపయోగించి వారు తమ సొంత మొబైల్ యాప్ మరియు సాంకేతిక పరిష్కారాలను అందిస్తున్నారు.

ఉదాహరణకు, ఐఓటీ కనెక్టివిటీతో ఐ-లాక్ మెకానిజం కస్టమర్ ఆర్డర్ మీద ఓటిపి-ఆధారిత సరఫరాను నిర్ధారిస్తుంది, తద్వారా ఎటువంటి అపరాధాలనైనా నివారించే అవకాశం ఉంటుంది. గో ఫ్యూయెల్ ముందుగా తమ వ్యాపారాన్ని చెన్నై నగరంలో ప్రారంభిస్తుంది. రాబోయే 18 నెలల్లో దేశవ్యాప్తంగా పంపిణీ నెట్‌వర్క్‌ను రూపొందించాలని కంపెనీ యోచిస్తోంది.

పరిశ్రమలు, పెద్ద అపార్ట్‌మెంట్ కాంప్లెక్సులు, ఆస్పత్రులు, మాల్స్, బ్యాంకులు మరియు గిడ్డంగులు వంటి బల్క్ డీజిల్ వినియోగదారుల నుండి ప్రారంభ డిమాండ్ ఈ కంపెనీ ఆశిస్తోంది. సంస్థ తన తదుపరి ప్రణాళికలో భాగంగా మన దేశంలోని మారుమూల మరియు గ్రామీణ ప్రాంతాల్లో తమ సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇంటి వద్దకే డీజిల్; ఐడియా అదుర్స్..

ఈ సంస్థలో 100 కోట్ల రూపాయల నిధులను వెచ్చించేందుకు మిడిల్ ఈస్ట్‌కి చెందిన ఓ పెట్టుబడిదారుడు ఆసక్తి చూపినట్లు సమాచారం. వచ్చే 2022 నాటికి 1000 స్మార్ట్ ట్రక్కుల దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని గోఫ్యూయెల్ ప్లాన్ చేస్తోంది.

ఈ నెట్‌వర్క్ తొలుత వాణిజ్య విభాగానికి అవసరమయ్యే హై-స్పీడ్ డీజిల్ డిమాండ్‌ను తీర్చడమే కాకుండా, రానున్న రోజుల్లో ట్రక్కులు మరియు ప్రయాణీకుల వాహనాలకు కావల్సిన రెగ్యులర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంధనాన్ని కూడా సరఫరా చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

నిజానికి ఇదొక అద్భుతమైన ఆలోచన. రెగ్యులర్ వాహనాలకు కూడా ఈ డోర్ స్టెప్ డెలివరీని ఆఫర్ చేయగలిగినట్లయితే, భవిష్యత్తులో మార్గ మధ్యంలో ఇంధనం అయిపోయినా, సమీపంలో ఎలాంటి ఫ్యూయెల్ స్టేషన్ లేకపోయినా గో ఫ్యూయెల్ ద్వారా సులువుగా ఇంధనం పొందే అవకాశం ఏర్పడుతుంది.

Most Read Articles

English summary
Get High-Speed Diesel Delivered At Your Doorstep With GoFuel. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X