కొత్త 2021 హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

జపనీస్ కార్ బ్రాండ్ హోండా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న కాంపాక్ట్ సెడాన్ 'అమేజ్'లో కంపెనీ కొత్తగా 2021 మోడల్‌ను ప్రవేశపెట్టింది. మార్కెట్లో ఈ కొత్త 2021 హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ప్రారంభ ధర రూ.6.32 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

కొత్త 2021 హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

మునుపటి మోడల్‌తో పోలిస్తే, ఈ కొత్త మోడల్‌లో పలు కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి. హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ మొత్తం మూడు ట్రిమ్ (ఈ, ఎస్, విఎక్స్)లలో ఐదు వేరియంట్లలో లభిస్తుంది. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

Variants Petrol Diesel
E MT ₹6.32 lakh ₹8.66 lakh
S MT ₹7.16 lakh ₹9.26 lakh
S CVT ₹8.06 lakh NA
VX MT ₹8.22 lakh ₹10.25 lakh
VX CVT ₹9.05 lakh ₹11.15 lakh
కొత్త 2021 హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త హోండా అమేజ్‌లోని 'ఈ' ట్రిమ్‌లో ఎలాంటి మార్పులు లేవు, ఇది పాత ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. కాగా, అమేజ్ ఎస్ ట్రిమ్‌లో బ్లూటూత్ మరియు ఎల్ఈఢి డేటైమ్ రన్నింగ్ లైట్స్ వంటి ఫీచర్లను జోడించారు. కాగా, ఇందులోని విఎక్స్ ట్రిమ్‌లో మాత్రం అనేక కొత్త ఫీచర్లు, డిజైన్ అప్‌డేట్స్ చేసింది.

కొత్త 2021 హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

అప్‌డేటెడ్ 2021 హోండా అమేజ్ ఇప్పుడు మెటోరాయిడ్ గ్రే, ప్లాటినం పెరల్ వైట్, లూనార్ సిల్వర్, గోల్డెన్ బ్రౌన్ మరియు రేడియంట్ రెడ్ అనే ఐదు కలర్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. డిజైన్ పరంగా కొత్త 2021 అమేజ్‌కు మరియు పాత అమేజ్‌కు పెద్ద వ్యత్యాసాలేవీ కనిపించవు.

కొత్త 2021 హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఈ కాంపాక్ట్-సెడాన్ యొక్క పాత మోడల్‌లో కంపెనీ స్వల్ప మార్పులు చేర్పులు చేసి, అమేజ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌గా ఈ కారును విడుదల చేసింది. ఇందులోని మార్పులలో సవరించిన ఫ్రంట్ బంపర్, కొత్త ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు,ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు ఫాగ్ లైట్లు, క్రోమ్ ఫ్రంట్ గ్రిల్ వంటి మార్పులను ముందు వైపు గమనించవచ్చు.

కొత్త 2021 హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఇక సైడ్ మరియు రియర్ డిజైన్‌ను గమనిస్తే, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, కొత్త 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్ (ఈ కొత్త అల్లాయ్ వీల్స్ నాల్గవ తరం హోండా సిటీ సెడాన్‌లో కూడా కనిపిస్తాయి) మరియు వెనుక వైపు C-ఆకారపు ఎల్ఈడి టెయిల్ ల్యాంప్‌లు మొదలైనవి ఉన్నాయి. కాగా, ఈ ఫేస్‌లిఫ్టెడ్ అమేజ్ కారు యొక్క మొత్తం డిజైన్ సిల్హౌట్ మరియు కొలతలలో ఎలాంటి మార్పు ఉండదు.

కొత్త 2021 హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లోని ఇంటీరియర్స్ మరియు ఫీచర్లను కూడా కంపెనీ స్వల్పంగా అప్‌గ్రేడ్ చేసింది. కొత్త హోండా అమేజ్ ఇంటీరియర్‌లు ఇప్పుడు కొత్త సీట్ అప్‌హోలెస్ట్రీని కలిగి ఉంటాయి. ఇది మునుపటి కన్నా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కారు లోపల స్వచ్ఛమైన గాలి కోసం కంపెనీ అప్‌గ్రేడ్ క్యాబిన్ ఫిల్టర్‌ను కూడా జోడించింది.

కొత్త 2021 హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

ఈ కారులో చేసిన ఇతర అప్‌గ్రేడ్‌లను పరిశీలిస్తే, ఇందులోని డాష్‌బోర్డ్‌లో శాటిన్ సిల్వర్ యాక్సెంట్స్ కనిపిస్తాయి. ఇవి కారు క్యాబిన్ ఫీల్‌ను మెరుగుపరుస్తాయి. ఇంకా ఇందులో క్లైమేట్ కంట్రోల్, హోండా స్మార్ట్ కీ పుష్-బటన్ స్టార్ట్, 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు వాయిస్ కమాండ్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

కొత్త 2021 హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

సేఫ్టీ పరంగా చూసుకుంటే, 2021 హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో గైడ్‌లైన్స్‌తో కూడిన మల్టీ వ్యూ రియర్ పార్కింగ్ కెమెరాను కొత్తగా అందిస్తున్నారు. కాగా, ఇదివరకటి అమేజ్‌లో అందించిన డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ మరియు సీట్-బెల్ట్ రిమైండర్ మొదలైన వాటిని ఈ కొత్త అమేజ్‌లోనూ కొనసాగించారు.

కొత్త 2021 హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త 2021 హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ఇంజన్ పరంగా కూడా ఎలాంటి మార్పులు లేవు. ఇదివరటి మోడల్‌లో ఉపయోగించిన అవే బిఎస్6 పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లను ఈ కొత్త అమేజ్‌లోనూ ఉపయోగించారు. హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో లభిస్తుంది. అవి: 1.5 లీటర్ ఐ-డిటెక్ డీజిల్ ఇంజన్ మరియు 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. ఈ రెండు ఇంజన్‌లు వేరియంట్‌ని బట్టి 5-స్పీడ్ మాన్యువల్ లేదా సివిటి ఆటోమేటిక్‌తో గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటాయి.

కొత్త 2021 హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

పవర్, టార్క్ గణంకాల విషయానికి వస్తే, ఈ కారులోని 1.5 లీటర్ ఐ-డిటెక్ డీజిల్ ఇంజన్ మాన్యువల్ గరిష్టంగా 3600 ఆర్‌పిఎమ్ వద్ద 98 బిహెచ్‌పి శక్తిని మరియు 1750 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని ఆటోమేటిక్ వేరియంట్ 3600 ఆర్‌పిఎమ్ వద్ద 78 బిహెచ్‌పి శక్తిని మరియు 1750 ఆర్‌పిఎమ్ వద్ద 160 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

కొత్త 2021 హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు

పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, కొత్త హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో 1.2 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 6000 ఆర్‌పిఎమ్ వద్ద 88 బిహెచ్‌పి శక్తిని మరియు 4800 ఆర్‌పిఎమ్ వద్ద 110 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా మాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

కొత్త 2021 హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కొనుగోలుపై కంపెనీ 3 సంవత్సరాలు లేదా అపరిమిత కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda amaze facelift launched in india price specs features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X