కొత్త Amaze ఎఫెక్ట్.. ఆగస్ట్ నెల భారీగా పెరిగిన Honda కార్ సేల్స్!

జపనీస్ కార్ బ్రాండ్ Honda Cars India Limited (హెచ్‌సిఐఎల్), ఆగస్టు 2021 నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. ఆగస్టు 2021 నెలలో Honda దేశీయ మార్కెట్‌లో 11,177 యూనిట్ల ప్యాసింజర్ కార్లను విక్రయించి, 49 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ మొత్తం విక్రయాలు 7,509 యూనిట్లుగా ఉన్నాయి.

కొత్త Amaze ఎఫెక్ట్.. ఆగస్ట్ నెల భారీగా పెరిగిన Honda కార్ సేల్స్!

నెలవారీగా (MoM) ప్రాతిపదికన చూస్తే కంపెనీ అమ్మకాలు 85 శాతం పెరిగాయి. జూలై 2021 నెలలో హోండా అమ్మకాలు 6,055 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ సమయంలో కంపెనీ ఎగుమతులు కూడా ప్రోత్సాహకర వృద్ధిని కనబరిచాయి. గత నెలలో Honda మొత్తం 2,262 యూనిట్లను ఎగుమతి చేసింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 450 యూనిట్లుగా ఉన్నాయి.

కొత్త Amaze ఎఫెక్ట్.. ఆగస్ట్ నెల భారీగా పెరిగిన Honda కార్ సేల్స్!

తాజాగా Honda మార్కెట్లోకి విడుదల చేసిన 2021 Honda Amaze ఫేస్‌లిఫ్ట్ వలన గత నెలలో కంపెనీ అమ్మకాలు జోరందుకున్నాయి. కేవలం రూ. 6.32 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే కంపెనీ కొత్త 2021 Amaze ఫేస్‌లిఫ్ట్ మోడల్ ను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ లో డిజైన్ మరియు ఫీచర్ల పరంగా స్వల్ప అప్‌డేట్‌లు ఉన్నాయి.

కొత్త Amaze ఎఫెక్ట్.. ఆగస్ట్ నెల భారీగా పెరిగిన Honda కార్ సేల్స్!

ఆసక్తిగల కస్టమర్లు రూ. 21,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించడం ద్వారా కొత్త 2021 Honda Amaze ను ఆన్‌లైన్ లో కానీ లేదా డీలర్‌షిప్ లో కానీ బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం Honda పోర్ట్‌ఫోలియోలో Amaze కాంపాక్ట్ సెడాన్, 4th Gen City సెడాన్, 5th Gen City సెడాన్, WR-V క్రాసోవర్ మరియు Jazz ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడళ్లు ఉన్నాయి.

కొత్త Amaze ఎఫెక్ట్.. ఆగస్ట్ నెల భారీగా పెరిగిన Honda కార్ సేల్స్!

భారతదేశంలో ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని Honda తమ కార్లపై ఆకర్షణీయమైన ఫైనాన్స్ పథకాలను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా, Honda దేశంలోనే మూడవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన కెనరా బ్యాంక్ (Canara Bank) తో కలిసి తమ వినియోగదారుల కోసం అనేక ఆకర్షణీయమైన మరియు సరసమైన ఫైనాన్స్ పథకాలను ప్రారంభించింది.

కొత్త Amaze ఎఫెక్ట్.. ఆగస్ట్ నెల భారీగా పెరిగిన Honda కార్ సేల్స్!

ఈ భాగస్వామ్యం కింద, Honda Amaze, City, Jazz మరియు WR-V కస్టమర్‌లు కెనరా బ్యాంక్ నుండి సులభమైన ఫైనాన్సింగ్ ఆప్షన్లు మరియు ఇబ్బంది లేని కార్ లోన్ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ పండుగ సీజన్‌లో షాపింగ్‌ను మరింత ఆకర్షణీయంగా చేయడానికి, కంపెనీ వివిధ ఫైనాన్సింగ్ స్కీమ్‌లు మరియు రివార్డులను ప్రవేశపెట్టింది.

కొత్త Amaze ఎఫెక్ట్.. ఆగస్ట్ నెల భారీగా పెరిగిన Honda కార్ సేల్స్!

Honda Cars India సెమీ అర్బన్ మరియు గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి దేశవ్యాప్తంగా ఈ ప్రణాళికలను అందించడానికి అనేక ఇతర బ్యాంకులతో కూడా భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. Honda కార్లపై అందిస్తున్న ప్రత్యేక ఫైనాన్సింగ్ స్కీమ్ లలో ఆకర్షణీయమైన వడ్డీ రేటు, మహిళా కొనుగోలుదారులకు రాయితీ వడ్డీ రేటు, కనీస ప్రాసెసింగ్ ఫీజు, కారు మొత్తం విలువలో 90 శాతం వరకు రుణం, 84 నెలల గరిష్ట రీపేమెంట్ వ్యవధి మొదలైనవి ఉన్నాయి.

కొత్త Amaze ఎఫెక్ట్.. ఆగస్ట్ నెల భారీగా పెరిగిన Honda కార్ సేల్స్!

Hyundai Creta కి పోటీగా వస్తున్న Honda ఎస్‌యూవీ

ఇటీవలే Amaze కాంపాక్ట్ సెడాన్ యొక్క ఫేస్‌లిఫ్ట్ వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసిన Honda, త్వరలోనే ఓ కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీని విడుదల చేయబోతున్నట్లు ధృవీకరించింది. ఇది ఈ విభాగంలో ఆదిపత్యం చలాయిస్తున్న Hyundai Creta కి గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.

కొత్త Amaze ఎఫెక్ట్.. ఆగస్ట్ నెల భారీగా పెరిగిన Honda కార్ సేల్స్!

ప్రస్తుతం, భారత ఆటోమొబైల్ మార్కెట్లోని మిడ్ సైజ్ ఎస్‌యూవీ విభాగం వైపు చాలా మంది కస్టమర్లు ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో, ఈ విభాగంలోని డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు Honda కూడా ఓ కొత్త మిడ్ సైజ్ ఎస్‌యూవీని తయారు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. కంపెనీ అంతర్గతంగా దీనిని 31XA అనే కోడ్‌నేమ్ తో అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.

కొత్త Amaze ఎఫెక్ట్.. ఆగస్ట్ నెల భారీగా పెరిగిన Honda కార్ సేల్స్!

ఈ కొత్త మిడ్ సైజ్ ఎస్‌యూవీని కంపెనీ ప్రస్తుతం విక్రయిస్తున్న మిడ్ సైజ్ సెడాన్ Honda City ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడుతుందని భావిస్తున్నారు. ఈ విషయం గురించి Honda Cars India Limited సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) Rajesh Goel గతంలో మాట్లాడుతూ, ఇది (కొత్తగా రాబోయే ఎస్‌యూవీ) ఇండియా స్పెసిఫిక్ మోడల్ గా ఉంటుందని అన్నారు.

కొత్త Amaze ఎఫెక్ట్.. ఆగస్ట్ నెల భారీగా పెరిగిన Honda కార్ సేల్స్!

కొత్త 2021 Amaze కోసం అఫీషియల్ యాక్ససరీస్

ఇదిలా ఉంటే, Honda ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త 2021 Amaze కాంపాక్ట్ సెడాన్ కోసం కంపెనీ అధికారిక యాక్ససరీల వివరాలను వెల్లడి చేసింది. ఆగస్ట్ 18న కంపెనీ తమ కొత్త 2021 Honda Amaze ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో దీని ధరలు రూ. 6.32 లక్షల నుండి రూ. 11.15 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

కొత్త Amaze ఎఫెక్ట్.. ఆగస్ట్ నెల భారీగా పెరిగిన Honda కార్ సేల్స్!

కొత్త 2021 Honda Amaze కారు ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ భాగాలకు అదనపు ఫీచర్లను జోడించాలని చూసుకునే వారి కోసం ఈ యాక్ససరీలు ఉపయోగపడుతాయి. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda august car sales registers 11177 units details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X