Honda Cars కొనాలనుకునే కస్టమర్లకు Canara Bank నుండి అట్రాక్టివ్ లోన్స్..

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ Honda Cars India Limited (హెచ్‌సిఐఎల్), తమ వినియోగదారులకు ఉత్తమమైన ఫైనాన్సింగ్ సదుపాయాన్ని కల్పించేందుకు గాను, దేశంలోనే మూడవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన Canara Bank తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది.

Honda Cars కొనాలనుకునే కస్టమర్లకు Canara Bank నుండి అట్రాక్టివ్ లోన్స్..

ఈ బ్యాంకు సహకారంతో తమ వినియోగదారుల కోసం కంపెనీ అనేక ఆకర్షణీయమైన మరియు సరసమైన ఫైనాన్స్ పథకాలను ప్రారంభించింది. ఈ భాగస్వామ్యం కింద, Honda Amaze, City, Jazz మరియు WR-V కస్టమర్ లు Canara Bank నుండి సులభమైన ఫైనాన్సింగ్ ఆప్షన్లు మరియు ఇబ్బంది లేని కార్ లోన్ సదుపాయాన్ని పొందవచ్చు.

Honda Cars కొనాలనుకునే కస్టమర్లకు Canara Bank నుండి అట్రాక్టివ్ లోన్స్..

ఈ పండుగ సీజన్‌లో షాపింగ్ ను మరింత ఆకర్షణీయంగా చేయడానికి, కంపెనీ వివిధ ఫైనాన్సింగ్ స్కీమ్‌లు మరియు రివార్డులను ప్రవేశపెట్టింది. సెమీ అర్బన్ మరియు గ్రామీణ ప్రాంతాలపై Honda Cars India Limited ప్రత్యేక దృష్టి సారించి దేశవ్యాప్తంగా ఈ ప్రణాళికలను అందించడానికి పలు రకాల బ్యాంకులతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంది.

Honda Cars కొనాలనుకునే కస్టమర్లకు Canara Bank నుండి అట్రాక్టివ్ లోన్స్..

Honda కార్ల ప్రత్యేక ఫైనాన్సింగ్ స్కీమ్ లో ఆకర్షణీయమైన వడ్డీ రేటు, మహిళా కొనుగోలుదారులకు రాయితీ వడ్డీ రేటు, కనీస ప్రాసెసింగ్ ఫీజు, కారు మొత్తం విలువలో 90 శాతం వరకు రుణం, 84 నెలల గరిష్ట రీపేమెంట్ వ్యవధి వంటి సదుపాయాలు ఉన్నాయి. Canara Bank మార్గదర్శకాల ప్రకారం అన్ని Honda కార్లపై సరసమైన ఫైనాన్స్ స్కీమ్‌లను పొందవచ్చు.

Honda Cars కొనాలనుకునే కస్టమర్లకు Canara Bank నుండి అట్రాక్టివ్ లోన్స్..

ఈ సందర్భంగా Honda Cars India Limited సీనియర్ వైస్ ప్రెసిడెంట్ Rajesh Goel మాట్లాడుతూ.. తమ కస్టమర్లకు సులభమైన మరియు అనుకూలమైన ఆర్థిక పరిష్కారాలను అందించే దిశలో భాగంగానే Canara Bank తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని, ఈ బ్యాంక్ రాబోయే పండుగ సీజన్‌లో తమ కస్టమర్ల యొక్క విభిన్న ఆర్థిక అవసరాలను తీర్చడంలో సహాయపడుతుందని అన్నారు.

Honda Cars కొనాలనుకునే కస్టమర్లకు Canara Bank నుండి అట్రాక్టివ్ లోన్స్..

Honda కార్లపై ఆగస్ట్ ఆఫర్స్.. రూ.57,000 వరకు డిస్కౌంట్..

ఇదిలా ఉంటే, Honda ఈ ఆగస్టు 2021 నెలలో తమ కార్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు మరియు ఆఫర్లను అందిస్తోంది. ఒకవేళ మీరు ఈ నెలలో కొత్త Honda కారు కొనాలని చూస్తున్నట్లయితే, మీరు గరిష్టంగా రూ. 57,000 వరకు ఆదా చేసుకోవచ్చు. కంపెనీ విక్రయిస్తున్న City, Amaze, WR-V మరియు Jazz మోడళ్లపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

Honda Cars కొనాలనుకునే కస్టమర్లకు Canara Bank నుండి అట్రాక్టివ్ లోన్స్..

Honda నుండి అత్యధికంగా అమ్ముడయ్యే కాంపాక్ట్ సెడాన్ Amaze పై కంపెనీ ఈ నెలలో గరిష్టంగా రూ.57,243 ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తోంది. అలాగే, Honda City యొక్క నాల్గవ తరం మరియు ఐదవ తరం మోడళ్లపై కూడా భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఆగస్ట్ 2021 నెలలో ఈ కార్లపై గరిష్టంగా రూ. 22,000 ప్రయోజనాలను అందిస్తోంది.

Honda Cars కొనాలనుకునే కస్టమర్లకు Canara Bank నుండి అట్రాక్టివ్ లోన్స్..

ఇకపోతే, Honda WR-V క్రాసోవర్ పై ఈ నెలలో కంపెనీ గరిష్టంగా రూ .34,058 ప్రయోజనాలను అందిస్తుండగా, Honda Jazz హ్యాచ్‌బ్యాక్ పై కొనుగోలుపై రూ. 34,095 ప్రయోజనాలను అందిస్తోంది.

Honda Cars కొనాలనుకునే కస్టమర్లకు Canara Bank నుండి అట్రాక్టివ్ లోన్స్..

Honda నుండి కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ

Honda కూడా ఎట్టకేలకు మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది. Hyundai Creta, Kia Selto, Skoda Kushaq వంటి మోడళ్లకు పోటీగా Honda కూడా ఓ మిడ్-సైజ్ సెడాన్‌ను తయారు చేయనున్నట్లు ధృవీకరించింది. భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగం బాగా ప్రాచుర్యం పొందిందని, ఈ నేపథ్యంలో తాము కూడా ఈ విభాగంలో ఓ కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టబోతున్నామని కంపెనీ పేర్కొంది.

Honda Cars కొనాలనుకునే కస్టమర్లకు Canara Bank నుండి అట్రాక్టివ్ లోన్స్..

ఈ విభాగంలో Honda తమ కారును విడుదల చేయడం ద్వారా కంపెనీ అమ్మకాలను గణనీయంగా పెంచుకోవాలని యోచిస్తోంది. కాగా, Honda నుండి రాబోయే ఈ కొత్త ఎస్‌యూవీ కంపెనీ ప్రస్తుతం విక్రయిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ Honda City ప్లాట్‌ఫామ్‌పై నిర్మించనున్నారు. ఈ మోడల్ భారతీయ మార్కెట్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

Honda Cars కొనాలనుకునే కస్టమర్లకు Canara Bank నుండి అట్రాక్టివ్ లోన్స్..

తాజా సమాచారం ప్రకారం, Honda నుండి రానున్న ఈ కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీని అంతర్గతంగా 31XA అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతకాలం క్రితమే Honda 'Elivate' అనే పేరును ట్రేడ్‌మార్క్ చేసింది. బహుశా ఈ పేరును కంపెనీ తమ భవిష్యత్ ఎస్‌యూవీ కోసం ఉపయోగించే అవకాశం ఉంది.

Honda Cars కొనాలనుకునే కస్టమర్లకు Canara Bank నుండి అట్రాక్టివ్ లోన్స్..

ఈ కొత్త Honda ఎస్‌యూవీని 5-సీటర్‌తో పాటు 7-సీటర్ కాన్ఫిగరేషన్‌తో కూడా అందించవచ్చని సమాచారం. ఈ కొత్త Honda ఎస్‌యూవీని City సెడాన్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించనున్న నేపథ్యంలో, ఈ రెండు మోడళ్లలో ఒకేరకమైన ఇంజన్ ఆప్షన్లు ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న Honda City సెడాన్‌లో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లను ఉపయోగిస్తున్నారు.

Honda Cars కొనాలనుకునే కస్టమర్లకు Canara Bank నుండి అట్రాక్టివ్ లోన్స్..

ఇందులోని పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 121 బిహెచ్‌పి పవర్‌ను మరియు 145 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ ఇంజన్ 100 బిహెచ్‌పి శక్తిని మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. Honda ఇవే ఇంజన్లను తమ కొత్త ఎస్‌యూవీలోనూ కొనసాగించవచ్చని అంచనా. ఈ ఇంజన్లు మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉండనున్నాయి.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda cars india join hands with canara bank to offer attractive financing schemes details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X