Bank Of Maharashtra తో భాగస్వామ్యం కుదుర్చుకున్న Honda Cars India: ఎందుకో తెలుసా?

ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ Honda (హోండా) ఇప్పుడు తన కస్టమర్ల కోసం మరింత సరసమైన ఫైనాన్స్ సేవలను అందించడానికి Bank Of Maharashtra (బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర) తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో ఇప్పుడు తక్కువ వడ్డీ రేటుతో ఫైనాన్స్ స్కీమ్‌లు పొందటానికి హోండా యొక్క కస్టమర్‌లకు చాలా అనుకూలంగా ఉంటుంది. కంపెనీ ఏర్పరచుకున్న ఈ భాగస్వామ్యం కొనుగోలుదారులను మరింత పెంచడానికి అనుకూలంగా ఉంటుంది.

Bank Of Maharashtra తో భాగస్వామ్యం కుదుర్చుకున్న Honda Cars India: ఎందుకో తెలుసా?

కంపెనీ ఇప్పుడు తన కొత్త Honda Amaze (హోండా అమేజ్), Honda Jazz (హోండా జాజ్), Honda WR-V (హోండా డబ్ల్యుఆర్-వి) మరియు Honda City (హోండా సిటీ) వంటి మోడల్స్ కొనుగోలుపై సులభమైన లోన్‌ను కూడా ఆఫర్ చేస్తుంది. కావున కంపెనీ యొక్క అమ్మకాలు ఈ పండుగ సీజన్లో పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

Bank Of Maharashtra తో భాగస్వామ్యం కుదుర్చుకున్న Honda Cars India: ఎందుకో తెలుసా?

Honda Cars India ఇప్పుడు Bank Of Maharashtra కుదుర్చుకున్న ఈ భాగస్వామ్యంలో, కస్టమర్లు బ్యాంక్ సిగ్నేచర్ ప్రోడక్ట్ "మహా సూపర్ కార్ లోన్" నుండి ప్రయోజనం పొందుతారు. ఈ సమాచారాన్ని హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు డైరెక్టర్ - మార్కెటింగ్ మరియు సేల్స్ 'రాజేష్ గోయెల్' అధికారికంగా తెలిపారు.

Bank Of Maharashtra తో భాగస్వామ్యం కుదుర్చుకున్న Honda Cars India: ఎందుకో తెలుసా?

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రతో ఏర్పరచుకున్న ఈ ఒప్పందం వినియోగదారులకు సరసమైన మరియు అందుబాటులో ఉండే వాహనాలను అందించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. దీనికోసం మరిన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కంపెనీ యొక్క అమ్మకాలను బలోపేతం చేయడంలో సహకరిస్తుంది.

Bank Of Maharashtra తో భాగస్వామ్యం కుదుర్చుకున్న Honda Cars India: ఎందుకో తెలుసా?

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర యొక్క విస్తృత నెట్‌వర్క్ మరియు హోండా యొక్క అధునాతన సాంకేతిక ఉత్పత్తుల శ్రేణితో, ఈ భాగస్వామ్యం ఒకదానికొకటి ప్రయోజనం చేకూరుస్తుంది. కావున దేశీయ మార్కెట్లో ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకోవడంలో ఇది ఎంతగానో సహకరిస్తుంది.

Bank Of Maharashtra తో భాగస్వామ్యం కుదుర్చుకున్న Honda Cars India: ఎందుకో తెలుసా?

భారతదేశంలో ఇప్పుడు పండుగ సీజన్ ప్రారంభమయ్యింది. ఈ సమయంలో ఎక్కువమంది ప్రజలు కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. కస్టమర్లు ఈ పండుగ సీజన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమకు నచ్చిన కారును కొనుగోలు చేయడానికి తక్కువ వడ్డీ రేట్లు మరియు కార్ ఫైనాన్స్ వంటివి చాలా ఉపయోగపడతాయి.

Bank Of Maharashtra తో భాగస్వామ్యం కుదుర్చుకున్న Honda Cars India: ఎందుకో తెలుసా?

కంపెనీ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రతో ఏర్పరచుకున్న భాగస్వామ్యంతో, ఈ స్కీమ్ కింద వాహన ధరలో దాదాపు 90 శాతం వరకు లోన్ పొందే ఆకాశం మరియు 7.05 శాతం కంటే తక్కువ వడ్డీ రేటు వంటివి అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా, ఫ్రీ అప్రూవల్ 48 గంటల టర్న్-అరౌండ్ టైమ్‌, కార్పొరేట్ శాలరీ అకౌంటెంట్ రేట్ అఫ్ ఇంట్రస్ట్ పై రాయితీ మరియు డిసెంబర్ 31, 2021 వరకు జీరో ప్రాసెసింగ్ ఫీజు వంటి ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.

Bank Of Maharashtra తో భాగస్వామ్యం కుదుర్చుకున్న Honda Cars India: ఎందుకో తెలుసా?

వీటితోపాటు, కార్పోరేట్ క్లయింట్‌లుగా నమోదు చేసుకున్న కంపెనీలకు వాహన ధరలో 80 శాతం వరకు కారు లోన్ కూడా అందుబాటులో ఉంటుంది. Honda కంపెనీ ప్రస్తుతం అందిస్తున్న ఈ సౌలబ్యాలు తప్పకుండా దేశీయ మార్కెట్లో తమ అమ్మకాలను పెంచడానికి చాలా సహకరిస్తాయని భావిస్తున్నాము.

Bank Of Maharashtra తో భాగస్వామ్యం కుదుర్చుకున్న Honda Cars India: ఎందుకో తెలుసా?

Honda కంపెనీ ఇటీవల 2021 సెప్టెంబర్ నెల యొక్క అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ గణాంకాల ప్రకారం, గత సెప్టెంబర్ నెలలో దేశీయ మార్కెట్లో మొత్తం 6,765 యూనిట్ల కార్లను విక్రయించినట్లు తెలిసింది.

Bank Of Maharashtra తో భాగస్వామ్యం కుదుర్చుకున్న Honda Cars India: ఎందుకో తెలుసా?

ప్రస్తుతం కంపెనీ సెమీకండక్టర్ల కొరత కారణంగా సరఫరా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో ఉన్న దాదాపు అన్ని వాహన తయారీ సంస్థలు ఈ సెమీకండక్టర్ల కొరతను ఎదుర్కొంటున్నాయి, కావున ఉత్పత్తి మరియు సరఫరా చాలా వరకు తగ్గింది. అయితే 2020 సెప్టెంబర్ నెలలో కంపెనీ దేశీయ మార్కెట్లో దాదాపు 10,199 యూనిట్లను విక్రయించగలిగింది.

Bank Of Maharashtra తో భాగస్వామ్యం కుదుర్చుకున్న Honda Cars India: ఎందుకో తెలుసా?

కంపెనీ యొక్క నివేదికల ప్రకారం ఎగుమతుల విషయానికి వస్తే, 2020 సెప్టెంబర్ నెలలో కంపెనీ ఎగుమతులు 170 యూనిట్లు మాత్రమే. కానీ నెలవారీ అమ్మకాల పరంగా మాత్రం, కంపెనీ 2021 ఆగస్టు నెలలో భారత మార్కెట్లో 11,177 యూనిట్లను విక్రయించింది మరియు ఆగస్టు 2021లో కంపెనీ మొత్తం 2,262 యూనిట్ల కార్లను విదేశీ మార్కెట్‌లకు ఎగుమతి చేసింది. అంటే కంపెనీ యొక్క అమ్మకాలు సెప్టెంబర్ నెల కంటే కూడా ఆగష్టు నెలలో కొంత పురోగతిని పొందింది.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda cars india partnership with bank of maharashtra for easy finance details
Story first published: Tuesday, October 26, 2021, 15:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X