అలెర్ట్.. అలెర్ట్.. హోండా కార్లలో ఫ్యూయెల్ పంప్ సమస్య; 77,954 కార్లు రీకాల్!

హోండా కార్స్ ఇండియా విక్రయించిన కార్లలో ఫ్యూయెల్ పంప్ సమస్య కారణంగా 77,954 కార్లను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. హోండా ప్రకటించిన ఈ స్వచ్ఛంద రీకాల్‌కు వర్తించే అన్ని కార్లలో కంపెనీ ఈ సమస్యను ఉచితంగా సరిచేయనుంది.

అలెర్ట్.. అలెర్ట్.. హోండా కార్లలో ఫ్యూయెల్ పంప్ ససమస్య; 77,954 కార్లు రీకాల్!

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ కార్లలోని ఫ్యూయెల్ పంప్స్‌లో లోపపూరితమైన ఇంపెల్లర్లు ఉండొచ్చని, వీటిని సరిచేయకపోయినట్లయితే, కొంత కాలం తర్వాత ఇంజన్ ఆగిపోవటం లేదా స్టార్ట్ కాకపోవటం వంటి సమస్యలు ఎదురుకావచ్చని కంపెనీ వివరించింది.

అలెర్ట్.. అలెర్ట్.. హోండా కార్లలో ఫ్యూయెల్ పంప్ ససమస్య; 77,954 కార్లు రీకాల్!

ఏయే కార్లు ఈ రీకాల్‌కు వర్తిస్తాయనే విషయాన్ని హోండా డీలర్‌షిప్ కేంద్రాలు తమ కస్టమర్లకు తెలియజేయనున్నాయి. అధీకృత హోండా డీలర్‌షిప్‌లలో ఈ సమస్యను ఉచితంగా పరిష్కరించి, అవసరమైతే ఫ్యూయెల్ పంప్‌ను రీప్లేస్ చేస్తారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ 17 నుండి ప్రారంభమై దశల వారీగా నడుస్తుంది.

MOST READ:రూ. 9 కోట్ల విలువైన కారు కొన్న కుమార మంగళం బిర్లా; పూర్తి వివరాలు

అలెర్ట్.. అలెర్ట్.. హోండా కార్లలో ఫ్యూయెల్ పంప్ ససమస్య; 77,954 కార్లు రీకాల్!

ఈ రీకాల్‌కు ప్రభావితమయ్యే కార్ల విషయానికి వస్తే, జనవరి-ఆగస్టు 2019 మధ్య కాలంలో తయారైన 36,086 యూనిట్ల అమేజ్ సెడాన్లు, జనవరి-సెప్టెంబర్ 2019 మధ్య కాలంలో తయారైన 20,248 యూనిట్ల 4వ తరం సిటీ సెడాన్లు మరియు జనవరి-ఆగస్టు 2019 మధ్యలో తయారైన 7,871 డబ్ల్యూఆర్-వి కార్లు ఉన్నాయి.

అలెర్ట్.. అలెర్ట్.. హోండా కార్లలో ఫ్యూయెల్ పంప్ ససమస్య; 77,954 కార్లు రీకాల్!

వీటితో పాటుగా జనవరి-ఆగస్టు 2019 మధ్య కాలంలో తయారైన 6,235 యూనిట్ల జాజ్ హ్యాచ్‌బ్యాక్‌లు, జనవరి-సెప్టెంబర్ 2019 మధ్యలో తయారైన 5,170 యూనిట్ల సివిక్ సెడాన్లు, జనవరి-అక్టోబర్ 2019 మధ్యలో తయారైన 1,737 యూనిట్ల బిఆర్-వి కార్లు మరియు జనవరి-సెప్టెంబర్ 2020 మధ్యలో తయారైన 607 యూనిట్ల సిఆర్‌వి ఎస్‌యూవీలు కూడా ఈ రీకాల్‌కు వర్తిస్తాయి.

MOST READ:మీకు తెలుసా.. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 లో కనిపించే క్లాసిక్ కార్లు, ఇవే

అలెర్ట్.. అలెర్ట్.. హోండా కార్లలో ఫ్యూయెల్ పంప్ ససమస్య; 77,954 కార్లు రీకాల్!

కోవిడ్-19 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో, భద్రతా నిబంధనల కారణంగా ప్రస్తుతం డీలర్‌షిప్‌లో పరిమిత సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారని కంపెనీ తెలిపింది. ఈ పరిస్థితుల్లో వినియోగదారులు డీలర్‌షిప్‌కు వెళ్లేముందు సదరు డీలర్‌తో ముందస్తు అపాయింట్‌మెంట్ తీసుకోవాలని కంపెనీ సూచించింది.

అలెర్ట్.. అలెర్ట్.. హోండా కార్లలో ఫ్యూయెల్ పంప్ ససమస్య; 77,954 కార్లు రీకాల్!

హోండా ప్రకటించిన ఈ రీకాల్‌కు మీ వద్ద ఉన్న హోండా కార్లు వర్తిస్తాయో లేదో ఇంట్లో కూర్చొనే తెలుసుకోవచ్చు. ఇందుకు గాను మీరు హోండా కార్స్ ఇండియా అధీకృత వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ కారు యొక్క 17-అంకెల విన్ (వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్)ను ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.

MOST READ:భాగ్యనగరంలో సైకిల్‌పై కనిపించిన సోనూసూద్ [వీడియో]

అలెర్ట్.. అలెర్ట్.. హోండా కార్లలో ఫ్యూయెల్ పంప్ ససమస్య; 77,954 కార్లు రీకాల్!

ఇందుకోసం హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ తమ స్వంత వెబ్‌సైట్‌లోనే ఓ కొత్త మైక్రోసైట్‌ను సృష్టించింది. ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సెకండ్ వేవ్ లాక్‌డౌన్ ప్రకటించినప్పటికీ, కంపెనీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూన తమ కస్టమర్లకు ఈ రీకాల్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తోంది.

అలెర్ట్.. అలెర్ట్.. హోండా కార్లలో ఫ్యూయెల్ పంప్ ససమస్య; 77,954 కార్లు రీకాల్!

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఏప్రిల్ 2021 నెలలో భాగంగా, తమ కార్లపై నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు ఇతర ఆఫర్లను ప్రకటించింది. ఈ నెలలో హోండా తమ కార్లపై రూ.38,000 వరకు తగ్గింపులను అందిస్తోంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్‌లో‌ చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda Cars India Recalls 77,954 Units Over Faulty Fuel Pumps, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X