భారత్‌లో బ్యాటరీ షేరింగ్ సర్వీస్ ప్రారభించనున్న Honda: వివరాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన హోండా (Honda) దేశీయ మార్కెట్లో ఎంతోకాలంగా ప్రజల నమ్మకాలను నిలబెట్టుకుంటూ, ఆధునిక వాహనాలను విడుదల చేస్తూ మంచి అమ్మకాలతో, ప్రత్యర్థులకు ధీటుగా నిలబడింది. అయితే ప్రస్తుత ఆటోమొబైల్ రంగం ఎలక్ట్రిక్ వాహన విభాగంపైన ద్రుష్టి సారించింది. ఈ కారణంగా చాలా కంపెనీలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేయడంలో నిమగ్నమై ఉన్నాయి. ఈ నేపథ్యంలో హోండా కంపెనీ కూడా భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో తనకంటూ ఒక సుస్థిరమైన స్థానం ఏర్పాటు చేసుకోవడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది.

భారత్‌లో బ్యాటరీ షేరింగ్ సర్వీస్ ప్రారభించిన Honda: వివరాలు

హోండా కంపెనీ ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టడమే కాకుండా, సరఫరా వంటి వాటివైపు కూడా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పుడు భారతదేశంలో బ్యాటరీ షేరింగ్ సర్వీస్ ప్రారంభించింది. ఇది ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ మరియు బ్యాటరీ మార్పిడి వంటి వాటికి చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత్‌లో బ్యాటరీ షేరింగ్ సర్వీస్ ప్రారభించిన Honda: వివరాలు

హోండా పవర్ ప్యాక్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది హోండా ప్రారంభించిన బ్యాటరీ షేరింగ్ సర్వీస్. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, 2022 వ సంవత్సరం మొదటి అర్ధభాగం నుంచి భారతీయ మార్కెట్లోని ఆటో-రిక్షాల కోసం బ్యాటరీ షేరింగ్ సర్వీస్ అందించనుంది.

భారత్‌లో బ్యాటరీ షేరింగ్ సర్వీస్ ప్రారభించిన Honda: వివరాలు

కంపెనీ మొదటి ఈ సర్వీస్ బెంగళూరులో అందుబాటులోకి రానుంది, ఆ తరువాత కాలంలో భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలలో కూడా అందుబాటులోకి రానుంది. రాయితీ ఈ సర్వీస్ దశలవారీగా అందుబాటులోకి వస్తుంది. దీని కోసం, హోండా మొబైల్ పవర్ ప్యాక్ ఈ-బ్యాటరీని కూడా భారతదేశంలో స్థానికంగా తయారు చేస్తుంది. తమ సర్వీస్ సబ్‌స్క్రైబర్‌లు బ్యాటరీని మార్చుకోవడానికి సమీపంలోని బ్యాటరీ-స్వాపింగ్ స్టేషన్ నుండి సర్వీస్ పొందవచ్చని కంపెనీ తెలిపింది.

భారత్‌లో బ్యాటరీ షేరింగ్ సర్వీస్ ప్రారభించిన Honda: వివరాలు

కంపెనీ ప్రారంభించిన ఈ సర్వీస్ వల్ల ఆటో-రిక్షా డ్రైవర్లు ఇప్పుడు ఛార్జింగ్ కోసం ప్రత్యేకంగా వేచి ఉండాల్సిన అవసరం లేదు. కావున వారి సమయాన్ని అదా చేయడమే కాకుండా, తమ వ్యాపారాలను కూడా వృద్ధి చేస్తుంది. మొత్తానికి ఇది వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత్‌లో బ్యాటరీ షేరింగ్ సర్వీస్ ప్రారభించిన Honda: వివరాలు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించిన తర్వాత కొత్త అనుబంధ సంస్థలతో కూడా కంపెనీ భాగస్వామి అవుతుంది. కాగా, వచ్చే ఐదేళ్లలో కనీస పది కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయాలని హోండా యోచిస్తోంది. కంపెనీ 2040 తర్వాత పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకుని ఈ దిశగా అడుగులు వేస్తోంది.

భారత్‌లో బ్యాటరీ షేరింగ్ సర్వీస్ ప్రారభించిన Honda: వివరాలు

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు అత్యధిక డిమాండ్ ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. ఈ కారణంగానే కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసి తమ ఉనికిని మరింత విస్తరించాలని యోచిస్తోంది. మొత్తానికి కంపెనీ రానున్న కాలంలో హోండా ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టి మంచి ఆదరణ పొందే అవకాశం ఉంటుంది, అని భావిస్తున్నాము.

భారత్‌లో బ్యాటరీ షేరింగ్ సర్వీస్ ప్రారభించిన Honda: వివరాలు

ఇదిలా ఉండగా హోండా కంపెనీ 2050 సంవత్సరం నాటికి వాహన ప్రమాదాలను పూర్తిగా (0%) తగ్గించడానికి కృషి చేస్తోంది. కంపెనీ అందించిన తాజా నివేదికల ప్రకారం, వచ్చే 2050 నాటికి వాహన ప్రమాదాలను 0% తగ్గించడానికి సహాయపడే అధునాతన భద్రతా సాంకేతికతపై పని చేస్తున్నట్లు తెలిపింది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, కంపెనీ రెండు ప్రధాన సాంకేతికతలను ఉపయోగించబోతోంది. ఇందులో మొదటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కాగా, రెండవది కార్ల నెట్‌వర్క్ ఆధారిత సాంకేతికత. ఈ రెండూ కూడా వాహన ప్రమాదాలను పూర్తిగా తగ్గించడంలో సహాయపడతాయి.

భారత్‌లో బ్యాటరీ షేరింగ్ సర్వీస్ ప్రారభించిన Honda: వివరాలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేది ఇటీవల వస్తున్న కొత్త కార్లలో వస్తున్న లేటెస్ట్ ఫీచర్. ఈ ఫీచర్ డ్రైవింగ్ చేసేటప్పుడు సంభావ్య ప్రమాదాల గురించి కారు డ్రైవర్‌కు తెలియజేస్తుంది, అంతే కాకుండా రోడ్డుపైన డ్రైయర్ యొక్క అజాగ్రత్తను తగ్గించడంలో సహాయపడుతుందని హోండా తెలిపింది.

భారత్‌లో బ్యాటరీ షేరింగ్ సర్వీస్ ప్రారభించిన Honda: వివరాలు

సురక్షితమైన మరియు పటిష్టమైన నెట్‌వర్క్ టెక్నాలజీ రోడ్డుపైన వాహనాలు మరియు పాదచారులకు కార్-టు-కార్ కనెక్టివిటీని అనుమతిస్తుంది. టెలికమ్యూనికేషన్ ద్వారా, రహదారిపై సాధ్యమయ్యే ప్రమాదాలను అంచనా వేయడం కూడా దీని ద్వారా సాధ్యమవుతుంది. కావున సులభంగా రోడ్డు ప్రమాదాలను నివారించ్చవచ్చు. తద్వారా 2050 నాటికి 0% ప్రమాదాల రేటుని పొందటం చాలా సులభం.

భారత్‌లో బ్యాటరీ షేరింగ్ సర్వీస్ ప్రారభించిన Honda: వివరాలు

ప్రజా రహదారులపైన ప్రమాదాలు పూర్తిగా తగ్గించడానికి 'హోండా సెన్సింగ్ 360'ని కూడా త్వరలో పరిచయం చేయనున్నట్టు హోండా తెలిపింది. ఇది 2030 నుండి హోండా కార్లలో ఉపయోగించే మల్టీపర్పస్ టెక్నాలజీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు అడ్వాన్స్‌డ్ కమ్యూనికేషన్ మీడియా మద్దతుతో, ఈ సాంకేతికత హోండా కార్లను రోడ్డుపై సురక్షితంగా ఉండేట్లు చేస్తుంది. అంతే కాకూండా డ్రైవర్‌లు రోడ్డుపై సరైన మార్గంలో కారును నడపడానికి కూడా సహాయపడుతుంది.

భారత్‌లో బ్యాటరీ షేరింగ్ సర్వీస్ ప్రారభించిన Honda: వివరాలు

హోండా కంపెనీ కేవలం కార్లను మాత్రమే కాకుండా కంపెనీ యొక్క బైక్‌లు, స్కూటర్ల వంటి ద్విచక్ర వాహనాలను కూడా రక్షించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగించే అవకాశం ఉంటుంది. కావున హోండా కంపెనీ యొక్క కార్లు మరియు బైకులు ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవచ్చు. దీని ద్వారా ప్రమాదాల శాతం పూర్తిగా తగ్గుతుంది. డ్రైవింగ్‌లో తప్పులకు గల కారణాలను తెలుసుకోవడానికి మరియు రోడ్డుపై డ్రైవింగ్ చేసేటప్పుడు వ్యక్తుల మానసిక స్థితిని తెలుసుకోవడానికి కూడా సాంకేతికతను ఉపయోగిస్తామని హోండా పేర్కొంది.

భారత్‌లో బ్యాటరీ షేరింగ్ సర్వీస్ ప్రారభించిన Honda: వివరాలు

ప్రమాదాలను నివారించడంలో సేఫ్టీ టెక్నాలజీ మెరుగ్గా సహాయపడుతుందని కార్ల కంపెనీ తెలియజేసింది. తరువాతి తరం డ్రైవర్-అసిస్టెన్స్ టెక్నాలజీ ప్రస్తుతం పరిశోధన మరియు అభివృద్ధిలో ఉందని కూడా హోండా నివేదించింది. ఇవన్నీ కూడా ప్రమాదాలను తప్పకుండా తగ్గిస్తాయి. తద్వారా కంపెనీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda launches battery sharing services in india details
Story first published: Friday, December 3, 2021, 9:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X