రేపే Honda N7X 7-సీటర్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; ఇది CR-V స్థానాన్ని భర్తీ చేయనుందా?

జపాన్‌కి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ (Honda Cars) తాజాగా రూపొందించిన తమ సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీ ఎన్7ఎక్స్ (N7X) ను రేపు (సెప్టెంబర్ 22, 2021వ తేదీన) ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించనుంది. ఈ ఏడాది మే 2021 నెలలో హోండా ఈ ఎస్‌యూవీని కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించింది. కాగా, ఇప్పుడు ఇందులో ప్రొడక్షన్ కు సిద్ధంగా ఉన్న మోడల్ ను ఆవిష్కరించనుంది.

రేపే Honda N7X 7-సీటర్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; ఇది CR-V స్థానాన్ని భర్తీ చేయనుందా?

ప్రస్తుతానికి, హోండా ఎన్7ఎక్స్ (Honda N7X) అనేది దాని కాన్సెప్ట్ వెర్షన్ పేరు మాత్రమే. కాగా, కంపెనీ దీని ప్రొడక్షన్ వెర్షన్ పేరును రేపు అధికారికంగా వెల్లడించనుంది. ఈ కొత్త ఎస్‌యూవీ ఇండోనేషియన్ మార్కెట్లోని ప్రస్తుత హోండా బిఆర్-వి (Honda BR-V) ఎస్‌యూవీ స్థానాన్ని భర్తీ చేయగలదని భావిస్తున్నారు. హోండా దీనిని ప్రత్యేకించి ఏషియన్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని ప్రవేశపెట్టనుంది.

రేపే Honda N7X 7-సీటర్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; ఇది CR-V స్థానాన్ని భర్తీ చేయనుందా?

హోండా ఎన్7ఎక్స్ యొక్క ప్రొడక్షన్ వెర్షన్ యొక్క డిజైన్ దాని కాన్సెప్ట్ వెర్షన్ మాదిరిగానే ఉంటుందని సమాచారం. ఈ మేరకు కంపెనీ విడుదల టీజర్ ఇమేజ్ లోని ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. దీని ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ ను గమనిస్తే, ఇది పూర్తిగా రీడిజైన్ చేయబడిన హోండా సిఆర్-వి మాదిరిగా అనిపిస్తుంది.

రేపే Honda N7X 7-సీటర్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; ఇది CR-V స్థానాన్ని భర్తీ చేయనుందా?

ఇక దీని డిజైన్ ను గమనిస్తే, ముందు వైపు ఎక్కువ క్రోమ్ గార్నిష్ తో కూడిన పెద్ద ఫ్రంట్ గ్రిల్ మరియు దాని మధ్యలో పెద్ద హోండా లోగో ఉంటుంది. కాన్సెప్ట్ వెర్షన్ లో హెడ్‌ల్యాంప్ క్లస్టర్ మరియు ఫ్రంట్ బంపర్ రెండింటిలోనూ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్ కనిపిస్తాయి. అయితే, ఇవి ప్రొడక్షన్ వెర్షన్ లో ఉంటాయా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఫ్రంట్ బంపర్ దిగువ భాగంలో పెద్ద హనీకోంబ్ ప్యాటర్న్ తో కూడిన సెకండ్ గ్రిల్ కూడా ఉంటుంది.

రేపే Honda N7X 7-సీటర్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; ఇది CR-V స్థానాన్ని భర్తీ చేయనుందా?

అంతేకాకుండా, కారు ముందు భాగంలో అమర్చిన పెద్ద బంపర్ లో ఫాగ్ ల్యాంప్స్ హౌసింగ్ కూడా ఉంటుంది. బానెట్ చాలా వరకూ ఫ్లాట్‌ గా ఉన్నట్లు కనిపిస్తుంది మరియు దాని మజిక్యులర్ బాడీ లైన్స్ కూడా ఉంటాయి. సైడ్ డిజైన్ చాలా మినిమలిస్టిక్ గా ఉంటుంది. డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్, డ్యూయెల్ టోన్ సైడ్ మిర్రర్స్, బ్లాక్డ్ అవుట్ బి మరియు సి పిల్లర్స్, కోరమ్ డోర్ హ్యాండిల్స్ మరియు డోర్స్ క్రింది భాగంలో సిల్వర్ కలర్ గార్నిష్ ఉంటుంది.

రేపే Honda N7X 7-సీటర్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; ఇది CR-V స్థానాన్ని భర్తీ చేయనుందా?

కాన్సెప్ట్ వెర్షన్ లో కారు చుట్టూ పియానో బ్లాక్ ఫినిష్ తో కూడిన బాడీ క్లాడింగ్ ఉంటుంది. అయితే, ప్రొడక్షన్ వెర్షన్ లో ఇది స్టాండర్డ్ బ్లాక్ ఫినిష్ లో ఉంటుందా లేదా షైనీగా ఉండే పియానో బ్లాక్ ఫినిష్ లో ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక వెనుక డిజైన్ ను గమనిస్తే, ఇందులో ఫ్లోటింగ్ స్ప్లిట్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ ఉంటుంది. ప్రొడక్షన్ వెర్షన్ లో వెనుక వైపు క్రోమ్ గార్నిష్‌ను ఆశించవచ్చు.

రేపే Honda N7X 7-సీటర్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; ఇది CR-V స్థానాన్ని భర్తీ చేయనుందా?

ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా, హోండా ఈ కారులో అత్యుత్తమమైన మరియు అత్యాధునికమైన కంఫర్ట్ అండ్ సేఫ్టీ ఫీచర్లను అందించే అవకాశం ఉంది. ఇందులో ప్రీమియం అప్‌హోలెస్ట్రీ, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ , బహుళ ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్ విత్ ఇబిడి, ట్రాక్షన్ కంట్రోల్, డ్రైవింగ్ మోడ్స్ వంటి అనేక ఫీచర్లను అందించే అవకాశం ఉంది.

రేపే Honda N7X 7-సీటర్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; ఇది CR-V స్థానాన్ని భర్తీ చేయనుందా?

ఈ కొత్త Honda N7X యొక్క క్యాబిన్ అనుభూతిని మెరుగుపరచడానికి కంపెనీ ఈ కారులో పానోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ ను కూడా అందిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి, ఈ కారులో ఉపయోగించబోయే ఇంజన్ మరియు మెకానికల్ పరికరాల జాబితా వెల్లడి కాకపోయినప్పటికీ, హోండా విక్రయిస్తున్న కొత్త తరం సిటీ సెడాన్ లో ఉపయోగించిన ఇంజన్ నే ఈ కొత్త ఎస్‌యూవీ లోనూ ఉపయోగించవచ్చని విశ్వసిస్తున్నారు.

రేపే Honda N7X 7-సీటర్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; ఇది CR-V స్థానాన్ని భర్తీ చేయనుందా?

హోండా కార్స్ అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ హోండా సిటీలో 1.5 లీటర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 119 బిహెచ్‌పి పవర్ ను మరియు 145 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

రేపే Honda N7X 7-సీటర్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; ఇది CR-V స్థానాన్ని భర్తీ చేయనుందా?

ప్రస్తుతం, ఇందులోని హైబ్రిడ్ వెర్షన్ గురించి ఎలాంటి సమాచారం లేదు, కానీ ఒకవేళ అది కంపెనీ ప్లాన్‌లో ఉన్నట్లయితే, రేపు అధికారికంగా ఆవిష్కరించిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ కొత్త హోండా ఎన్7ఎక్స్‌ ఎస్‌యూవీని భారతదేశానికి తీసుకురావడం విషయంలో హోండా కార్స్ ఇండియాకు ఎలాంటి ప్రణాళికలు లేవని తెలుస్తోంది.

రేపే Honda N7X 7-సీటర్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; ఇది CR-V స్థానాన్ని భర్తీ చేయనుందా?

ఏదేమైనప్పటికీ, భారతదేశంలో ఎస్‌యూవీ లకు డిమాండ్ పెరుగుతూనే ఉన్నందున మరియు హోండా కార్స్ ఇండియా పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం WR-V మినహా వేరే ఎస్‌యూవీ లేనందున, కంపెనీ కొత్త హోండా ఎన్7ఎక్స్‌ భారత మార్కెట్ కోసం పరిగణలోకి తీసుకోవచ్చు. లేటెస్ట్ కార్స్ అండ్ బైక్స్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda n7x 7 seater suv is all set to be unveiled tomorrow details
Story first published: Tuesday, September 21, 2021, 14:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X