మీ కారు రీసేల్ విలువ పెంచాలనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే

సాధారణంగా ఏ వ్యక్తికైనా తన ఇల్లు తరువాత అతని కారు అతని అతి పెద్ద ఆస్థిగా పరిగణిస్తాడు. కార్ అనేది కేవలం ప్రయాణానికి ఉపయోగించే వాహనం మాత్రమే కాదు, అది అతని కుటుంబతో ఒక విడదీయలేని సంబంధాన్ని ఏర్పరచుకుంటుంది. అయితే ఒక కారుని ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాలు ఉపయోగించిన తరువాత కొన్ని అనివార్య కారణాల వల్ల దానిని విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఒక కారుని కొన్ని రోజులు వినియోగించిన తరువాత దానిని తిరిగి విక్రయించేటప్పుడు అది తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తుంది. అయితే కారు యొక్క కండిషన్ మొదలైనవి సరైన స్థితిలో ఉంటే మంచి ధరకు విక్రయించవచ్చు. మీ కారు రీసేల్ విలువ తగ్గినప్పుడు సమస్య వస్తుంది. ఇది అనేక కారణాల వల్ల జరుగుతుంది. మీ కారు రీసేల్ విలువ తగ్గినప్పుడు దానిని ఎలా పెంచుకోవాలి అనే విషయాలను గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

మీ కారు రీసేల్ విలువ పెంచాలనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే

సిరామిక్ / టెఫ్లాన్ కోటింగ్ / పిపిఎఫ్:

మీ కారు యొక్క రీసేల్ విలువను పెంచుకోవడానికి ఇది చాలా అవసరం, కారులో ఇంజిన్ చాలా ప్రధానమైనదని అనే విషయం అందరికి తెలుసు. కావున ఎల్లప్పుడూ కారు యొక్క ఇంజిన్ మంచి స్థితిలో ఉండే విధంగా చూసుకోవాలి. అంతే కాకుండా కారు యొక్క ఎళుపలి భాగం కూడా మంచి స్థితిలోనే ఉండాలి, లేకుంటే రీసేల్ ఇలు తగ్గుతుంది.

మీ కారు రీసేల్ విలువ పెంచాలనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే

టెఫ్లాన్ కోటింగ్ అనేది టెంపరేచర్ రెసిస్టెన్స్ మరియు నాన్ స్టిక్. ఇది కారుని కాపాడటానికి మరియు గీతలు మొదలైన అతి నుంచి రక్షించడానికి ఉపయోగపడుతుంది. టెఫ్లాన్ కోటింగ్ కారు యొక్క ఆకర్షణను పెంపొందిస్తుంది. అంతే కాకుండా మెరుగైన రక్షణ కోసం మీరు యాంటీ రస్ట్ అండర్ బాడీ కోటింగ్‌ను కూడా పొందవచ్చు. ఎక్స్టీరియర్ కోసం, మీరు PPF లేదా పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్‌ను కూడా పొందవచ్చు. ఇవన్నీ కూడా వాహనాన్ని రక్షించడంలో సహకరిస్తాయి.

మీ కారు రీసేల్ విలువ పెంచాలనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే

హై పర్ఫామెన్స్ ఏసీ సర్వీస్:

కారులో ఎయిర్ కండిషనింగ్ అనేది చాలా ముఖ్యమైన అంశం, ఇది దాదాపు అందరికి తెలుసు. ఎందుకంటే ఇది క్యాబిన్ యొక్క అధిక ఉష్ణోగ్రతను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. కారు యొక్క సిస్టమ్‌లో అనేక కదిలే భాగాలు ఉన్నాయి మరియు విఫలమైన కంప్రెసర్ లేదా బెల్ట్ రావడం వంటి సమస్యలు ఉండవచ్చు. మీ కారుకు ఉత్తమమైన వాటిని అందించడానికి మీరు రెగ్యులర్ లేదా హై-పెర్ఫార్మెన్స్ సర్వీస్ ఎంచుకోవచ్చు.

మీ కారు రీసేల్ విలువ పెంచాలనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే

టైర్ & వీల్ కేర్:

మీ కారు యొక్క రీసేల్ విలువను పెంచే వాటిలో కారు యొక్క టైర్లు మరియు వీల్ కూడా ఎక్కువ ప్రాధాన్యత వహిస్తాయి. టైర్లు మరియు వీల్ పరిస్థితి మీరు నడిపే రోడ్లు మరియు మీ డ్రైవింగ్ విధానంపైన ఆధారపడి ఉంటుంది. కావున వాహనాన్ని వినియోగించే వారు తప్పకుండా వీటిపై శ్రద్ద వహించాలి. అప్పుడే వీటిని రక్షించుకోగలము.

మీ కారు రీసేల్ విలువ పెంచాలనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే

మీరు ఉపయోగించే కారులో మీరు తప్పకుండా అధిక నాణ్యత కలిగిన మరియు మెరుగైన టైర్లను వినియోగించాలి (JK, Apollo, MRF, Goodyear & CEAT వంటి టైర్లు) అప్పుడే అవి ఎక్కువ కాలం వినియోగించడానికి అనుకూలంగా ఉంటాయి. అంతే కాకుండా వీల్స్ కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అప్పుడే రీసేల్ లో మీ కారు మంచి ధరకు అమ్ముడవుతుంది. స్టీరింగ్ అడ్జస్టబుల్ మరియు టైర్ రొటేషన్, అలాగే లేజర్-అసిస్టెడ్ వీల్ అలైన్‌మెంట్ & వెయిట్ కరెక్షన్‌పై కూడా పని చేయాలి.

మీ కారు రీసేల్ విలువ పెంచాలనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే

బ్యాటరీ మరియు బ్రేక్:

మీ కారు మరియు ఇతర ఎలక్ట్రిక్ అవసరాలను స్టార్ట్ చేయడానికి ప్రతిసారీ రన్నింగ్ బ్యాటరీని కలిగి ఉండటం ఉత్తమం. కారులోని బ్యాటరీ మంచి స్థితిలో ఉండాలి. అంతే కాకుండా బ్యాటరీలో ఏమైనా సమస్యలు కనిపిస్తే ఎప్పటికప్పుడు దానిని రిపేర్ చేయాలి. అప్పుడే బ్యాటరీ మంచి కండిషన్ లో ఉంటుంది.

మీ కారు రీసేల్ విలువ పెంచాలనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే

కారులోని బ్యాటరీ మంచి స్థితిలో ఉంటే మాత్రమే సరిపోదు, అందులోని బ్రేక్‌లు మరియు ఇతర అత్యవసర పరికరాలు కూడా మంచి స్థితిలోనే ఉండాలి. కారులోని బ్రేకులు మంచి స్థాయిలో ఉండాలి, కావున వాటిని కూడా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. కారులో బ్రేక్ ప్యాడ్‌లు అరిగిపోతూ ఉంటాయి, కావున దీనిపై జాగ్రత్త వహించాలి. కారులోని బ్రేకులు వాహనదారుల భద్రతను నిర్ధరిస్తాయి.

మీ కారు రీసేల్ విలువ పెంచాలనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే

డీటైలింగ్ మరియు కార్ స్పా:

కారు యొక్క రీసేల్ విలువను పెంచడంలో చివరిది, డీటైలింగ్ మరియు కార్ స్పా సర్వీస్. చాలామంది వీటిని అనవసరమైనవిగా పరిగణిస్తారు. అయితే మీరు కారుని విక్రయించేటప్పుడు ఇది చాలా అవసరమైనది అని తెలుసుకుంటారు. కారు చాలా శుభ్రంగా ఉంటేనే కొనుగోలుదారులను తొందరగా ఆకర్షిస్తుంది.

మీ కారు రీసేల్ విలువ పెంచాలనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే

కారు చాలా శుభ్రమైన స్థితిలో ఉండాలి, కేవలం బయట చూడటానికి మాత్రమే కాకుండా కారు యొక్క లోపలి భాగాలను కూడా శుభ్రంగా ఉంచాలి. క్యాబిన్ వంటివి కూడా తప్పకుండా శుభ్రంగా ఉండేలా చూడాలి. అప్పుడే కారు మంచి ఆకర్షనీయంగా మరియు కొనుగోలుదారులకు నచ్చే విధంగా ఉంటుంది.

మీ కారు యొక్క రీసేల్ విలువను పెంచుకోవడానికి తప్పకుండా పైన తెలిపిన అన్నింటిని పాటించాలి. అప్పుడే రీసేల్ విలువ పెరుగుతుంది.

Most Read Articles

Read more on: #టిప్స్ #tips
English summary
How to increase resale value of a car there are 5 tips details
Story first published: Monday, October 25, 2021, 11:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X