Just In
- 10 hrs ago
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!
- 12 hrs ago
విడుదలకు ముందే యమహా FZ-X స్పెసిఫికేషన్స్ లీక్
- 14 hrs ago
భారత్‌లో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టీల్‌బర్డ్; ధర & వివరాలు
- 14 hrs ago
మిస్టర్ మస్క్.. భారత్‌లో త్వరగా టెస్లా కార్లను ఉత్పత్తి చేయండి: నితిన్ గడ్కరీ
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులు అకస్మాత్తుగా ప్రయాణం చేయొచ్చు...!
- News
వైఎస్ షర్మిల నుంచి పిలుపు: కొండా సురేఖ దంపతులు ఏమన్నారంటే..?, జగన్‌పై సంచలనం
- Sports
PBKS vs CSK: 'సూపర్' జడేజా! కళ్లుచెదిరే రనౌట్.. స్టన్నింగ్ క్యాచ్!వీడియోలు
- Movies
పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్.. ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టిన రాంగోపాల్ వర్మ.. కోవిడ్ 19 హీరో అంటూ..
- Finance
మళ్లీ బంగారం ర్యాలీ ప్రారంభమైందా? 15 రోజుల్లో 6% జంప్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారతదేశంలో మొట్టమొదటి స్ట్రీట్ లైట్ ఈవి ఛార్జింగ్ స్టేషన్ ఇదే.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?
భారతదేశంలో రోజురోజకి పెట్రోల్ మరియు డీజిల్ రేట్లు పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న ధరలు వాహనదారులకు చాలా ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించడానికి చాలా వరకు రాయితీలు కల్పిస్తున్నాయి.

ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులు పెరుగుతున్నారు. కానీ ఇప్పటికి ఎలక్ట్రిక్ వాహనాలకు కావలసిన మౌలికసదుపాయాలు అందుబాటులో లేదు. ఈ కారణంగా ఇప్పటిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ సర్వీస్ లు ఏర్పాటు చేస్తున్నారు.

ఇందులో భాగంగానే ఛార్జింగ్ సర్వీస్ ప్రొవైడర్ మెజెంటా హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ సహకారంతో దేశంలోని మొట్టమొదటి స్ట్రీట్ లాంప్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జీని ఢిల్లీ మరియు ముంబైలలో ప్రారంభించింది. ఈ ఛార్జర్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది వీధి లైట్ యొక్క పోల్ పై అమర్చబడి ఉంటుంది.
MOST READ:పబ్లిక్ రోడ్డుపై బైక్ స్టంట్ ; వీడియో చూసి పోలీసులకు పట్టుబడ్డ బైకర్

ఎలక్ట్రిక్ వాహనాన్ని ఛార్జ్ చేయడానికి అన్ని పరికరాలు ఈ పోల్లోనే అమర్చబడి ఉంటాయి. అంతేగాని దీని కోసం ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్ నిర్మించబడలేదు. ఈ ఛార్జింగ్ పోల్ యొక్క ప్రయోజనం ఏమిటంటే దాని నిర్వహణ చాలా తక్కువగా ఉంది మరియు దీనికి స్థలం అవసరం లేదు.

మెజెంటా స్ట్రీట్ లాంప్ ఈవి ఛార్జింగ్ స్టేషన్‌ను గుర్తించడానికి కంపెనీ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. దీనితో ఛార్జింగ్ పోల్ ఉన్న ప్రదేశాన్ని కనుగొనవచ్చు. అంతే కాకుండా ఇందులో ఛార్జింగ్ కోసం ఆన్లైన్ చెల్లింపు సౌకర్యం కూడా అందించబడింది. ఇంత తక్కువ ఖర్చుతో ఛార్జింగ్ స్టేషన్‌ను ఇతర నగరాల్లో కూడా ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది.
MOST READ:కార్లలో ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్ అంటే ఏమిటి, అదెలా పనిచేస్తుంది?

ఈ ఏడాది దేశంలో 100 కి పైగా ఛార్జింగ్ గ్రిడ్లను కంపెనీ ఏర్పాటు చేయబోతోంది. స్ట్రీట్ లైట్ పోల్‌లో ఈ ఛార్జింగ్ స్టేషన్లను నిర్మించడం చాలా సులభం అని, వాటిని ఇన్స్టాల్ చేయడానికి కూడా తక్కువ ఖర్చు అవుతుందని కంపెనీ తెలిపింది. ఈ స్టేషన్లలో ఏ ఆపరేటర్ లేదా అటెండెంట్‌ను ఉంచాల్సిన అవసరం లేదు.

దేశంలో కాలుష్యాన్ని తగ్గించడానికి మరియు పెట్రోల్ మరియు డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి ఢిల్లీ ప్రభుత్వం స్విచ్ ఢిల్లీ ప్రచారాన్ని కూడా నిర్వహిస్తోంది.
MOST READ:విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించిన పిల్లి.. ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజమే

ఢిల్లీలో 2019 సంవత్సరంలో ఎలక్ట్రిక్ వాహన విధానం ప్రకటించబడింది. దీని కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం, త్రీ వీలర్ మరియు కారు కొనుగోలుకు రాయితీ ఇవ్వబడుతుంది. దేశంలోని చాలా చిన్న మరియు పెద్ద నగరాల్లో, ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్లను తయారుచేసే పనులు వేగంగా జరుగుతున్నాయి.