కాలుష్య రహిత తిరుమల కోసం 100 ఎలక్ట్రిక్ బస్సులు.. వచ్చేస్తున్నాయ్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది, ఈ తరుణంలో భాగంగానే అన్ని రంగాల్లోనూ ఎలక్ట్రిక్ వాహనాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు సైకిల్స్ దగ్గర నుంచి బస్సులు మొదలైన వాటి వరకూ కూడా ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రపంచ ప్రసిద్దిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమలలో కూడా ఎలక్ట్రిక్ బస్సులు తిరగనున్నాయి. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

తిరుమల గిరుల్లో పరుగులు తీయనున్న 100 ఎలక్ట్రిక్ బస్సులు: వీటి ధర రూ. 140 కోట్లు

ఇల వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన తిరుమల క్షేత్రంలో ఎలక్ట్రిక్ బస్సులను ఉపయోగించడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఏకంగా 100 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయనుంది ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) ఆసక్తి చూపుతోంది. దీనికోసం హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా పని చేస్తోన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ (Olectra Greentech) కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ అనేది మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌ (MEIL) కు అనుబంధ సంస్థ.

తిరుమల గిరుల్లో పరుగులు తీయనున్న 100 ఎలక్ట్రిక్ బస్సులు: వీటి ధర రూ. 140 కోట్లు

ఏపీఎస్ఆర్టీసీ ఇప్పుడు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ నుంచి కొనుగోలు చేయనున్న 100 బస్సుల ధర సుమారు రూ. 140 కోట్లు. అంతే కాకుండా కంపెనీ భారత ప్రభుత్వం యొక్క FAME-II (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) పథకం కింద 100 ఈ-బస్సులను సరఫరా చేయనుంది. ఇప్పటికి చేసుకున్న ఈ ఒప్పందం ప్రకారం ఈ ఎలెక్ట్రిక్ బస్సులు 12 నెలల వ్యవధిలో పంపిణీ చేయబడతాయి.

తిరుమల గిరుల్లో పరుగులు తీయనున్న 100 ఎలక్ట్రిక్ బస్సులు: వీటి ధర రూ. 140 కోట్లు

కాంట్రాక్టు కాలంలో ఓలెక్ట్రా కంపెనీ ఈ బస్సుల నిర్వహణను చేపడుతుంది. ఈ బస్సులను అలిపిరి (తిరుపతి) డిపోలో ఏర్పాటు చేననున్నట్లు కూడా ఇప్పటికే తెలిపారు. అయితే ఈ కొత్త ఆర్డర్‌తో ఏపీఎస్ఆర్టీసీ ఆధీనంలోకి రానున్న ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య 1,450 కి చేరుతుంది. దీన్నిబట్టి చూస్తే ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం రోజురోజుకి పెరుగుదల దిశవైపు పరుగులు తీస్తున్నట్లు తెలుస్తుంది.

తిరుమల గిరుల్లో పరుగులు తీయనున్న 100 ఎలక్ట్రిక్ బస్సులు: వీటి ధర రూ. 140 కోట్లు

ఏపీఎస్ఆర్టీసీ నుంచి తమకు లెటర్ ఆఫ్ అవార్డ్ అందిన విషయాన్ని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీ ప్రదీప్ అధికారికంగా తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థలో కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుందని వారు అన్నారు. అంతే కాకుండా తిరుమల కొండమీద ప్రశాంతమైన వాతావరణాన్ని కలుషితం చేయకూడదని, దీనికోసం పెద్ద ఎత్తున బస్సులను కొనుగోలు చేస్తున్నారు. ఇది నిజంగా హర్షించదగ్గ విషయం.

తిరుమల గిరుల్లో పరుగులు తీయనున్న 100 ఎలక్ట్రిక్ బస్సులు: వీటి ధర రూ. 140 కోట్లు

ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ కంపెనీ ప్రస్తుతం హైదరాబాద్, ముంబై, పూణే, నాగ్‌పూర్, సూరత్, డెహ్రాడూన్, సిల్వస్సా, గోవా, హిమాచల్ ప్రదేశ్ మరియు కేరళలో తన బస్సులను నడుపుతోంది. అయితే ఇప్పుడు ఆంద్రప్రదేశ్ లో కూడా తమ ఉనికిని చాటుకోవడానికి సిద్ధంగా ఉంది. కావున త్వరలో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు తిరుమల గిరుల్లో పరుగులు తీయనున్నాయి.

తిరుమల గిరుల్లో పరుగులు తీయనున్న 100 ఎలక్ట్రిక్ బస్సులు: వీటి ధర రూ. 140 కోట్లు

ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ కంపెనీ యొక్క ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు పొడవు తొమ్మిది మీటర్ల వరకు ఉంటుంది. ఇందులో సీట్ల సామర్థ్యం 35 వరకు ఉంటుంది, కావున 35 మంది ప్రయాణికులు ఒకసారి ప్రయాణించవచ్చు. ఈ ఎలెక్ట్రిక్ బస్సులు లిథియం-అయాన్ బ్యాటరీ ఆధారంగా నడుస్తాయి. వీటిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 180 కిలోమీటర్ల వరకు రాకపోకలు సాగించ గలుగుతాయి. అయితే ఈ పరిధి ట్రాఫిక్, రోడ్ కండీషన్ మీద ఆధారపడి ఉంటుంది.

తిరుమల గిరుల్లో పరుగులు తీయనున్న 100 ఎలక్ట్రిక్ బస్సులు: వీటి ధర రూ. 140 కోట్లు

ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఎలక్ట్రిక్ బస్సుల యొక్క బ్యాటరీ పూర్తిస్థాయిలో ఛార్జ్ కావడానికి హై-పవర్ AC & DC ఛార్జింగ్ సిస్టమ్ ద్వారా మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. ఈ బస్సులు ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటాయి. కావున ఇందులో అడ్వాన్స్డ్ బ్రేక్ సిస్టమ్‌ కూడా అందుబాటులో ఉంటుంది. అయితే ఇప్పటివరకు సాధారణ రోడ్లపైన ప్రయాణించడానికి అనుకూలమైన బస్సులను కంపెనీ తయారు చేసింది, అయితే ఇప్పుడు తిరుమల ఘాట్ రోడ్డులో ప్రయాణించడానికి అనుకూలమైన బస్సులను తయారు చేయనున్నారు.

తిరుమల గిరుల్లో పరుగులు తీయనున్న 100 ఎలక్ట్రిక్ బస్సులు: వీటి ధర రూ. 140 కోట్లు

ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ కంపెనీ ఇప్పటికే భారతీయ రహదారులపై నాలుగు కోట్ల కిలోమీటర్లకు పైగా తమ ఎలక్ట్రిక్ బస్సులతో పూర్తి చేసింది. ఈ ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం వల్ల ఇప్పటి వరకు 35,700 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ (Co2) ఉద్గారాలను తగ్గించింది. రానున్న రోజుల్లో ఈ ఉద్గారాలను మరింత తగ్గించడానికి ఈ బస్సులు ఎంతగానో ఉపయోగపడతాయి.

తిరుమల గిరుల్లో పరుగులు తీయనున్న 100 ఎలక్ట్రిక్ బస్సులు: వీటి ధర రూ. 140 కోట్లు

భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. కావున ఎక్కువమంది ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ఆసక్తి చూపుతున్నారు. అంతే కాకుండా వాతావరణంలో కాలుష్య ఉద్గారాలను తగ్గించడానికి సరైన మార్గం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం. కావున కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తుంది. అంతే కాకుండా ప్రభుత్వ వాహనాలను కూడా ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేయడానికి ఇప్పటికే శ్రీకారం చుట్టింది. కావున రానున్న కాలంలో కార్బన్ ఉద్గారాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు.

Most Read Articles

English summary
Hyderbad company olectra gets 140 crore order from apsrtc
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X