హ్యుందాయ్ అల్కజార్ 7-సీటర్ ఎస్‌యూవీ ఇంజన్ డీటేల్స్ లీక్; బుకింగ్స్ ఓపెన్!

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్, భారత మార్కెట్ కోసం సిద్ధం చేస్తున్న 7-సీటర్ ఎస్‌యూవీ 'అల్కజార్' మరికొద్ది రోజుల్లోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, హ్యుందాయ్ అల్కజార్ ఎస్‌యూవీకి సంబంధించిన తాజా వివరాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.

హ్యుందాయ్ అల్కజార్ 7-సీటర్ ఎస్‌యూవీ ఇంజన్ డీటేల్స్ లీక్; బుకింగ్స్ ఓపెన్!

తాజా సమాచారం ప్రకారం, హ్యుందాయ్ అందిస్తున్న ఎలాంట్రా సెడాన్ మరియు టక్సన్ ఎస్‌యూవీలలో ఉపయోగిస్తున్న 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అల్కజార్ ఎస్‌యూవీలో ఉపయోగించవచ్చని తెలుస్తోంది. అంతేకాకుండా, ఇందులో 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది.

హ్యుందాయ్ అల్కజార్ 7-సీటర్ ఎస్‌యూవీ ఇంజన్ డీటేల్స్ లీక్; బుకింగ్స్ ఓపెన్!

మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఇప్పటికే కొందరు హ్యుందాయ్ డీలర్లు కొత్త అల్కజార్ 7-సీటర్ కోసం అనధికారిక బుకింగ్‌లను కూడా స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

MOST READ:13,000 యూనిట్లు దాటిన హోండా సిబి350 అమ్మకాలు

హ్యుందాయ్ అల్కజార్ 7-సీటర్ ఎస్‌యూవీ ఇంజన్ డీటేల్స్ లీక్; బుకింగ్స్ ఓపెన్!

హ్యుందాయ్ అల్కజార్‌లో ఉపయోగించబోయే బిఎస్ 6-కంప్లైంట్ 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ గరిష్టంగా 152 బిహెచ్‌పి పవర్‌ను మరియు 192 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

హ్యుందాయ్ అల్కజార్ 7-సీటర్ ఎస్‌యూవీ ఇంజన్ డీటేల్స్ లీక్; బుకింగ్స్ ఓపెన్!

హ్యుందాయ్ అల్కజార్‌ను క్రెటా ఎస్‌యూవీ ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారు చేసిన నేపథ్యంలో, క్రెటాలో ఉపయోగించిన 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కూడా ఈ 7-సీటర్ మోడల్‌లో ఉపయోగించే అవకాశం ఉంది.

MOST READ:సి5 ఎయిర్‌క్రాస్ లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన సిట్రోయెన్; వివరాలు

హ్యుందాయ్ అల్కజార్ 7-సీటర్ ఎస్‌యూవీ ఇంజన్ డీటేల్స్ లీక్; బుకింగ్స్ ఓపెన్!

ఈ 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 138 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ డిసిటి (డ్యూయల్-క్లచ్ ట్రాన్స్మిషన్) ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చే అవకాశం ఉంది.

హ్యుందాయ్ అల్కజార్ 7-సీటర్ ఎస్‌యూవీ ఇంజన్ డీటేల్స్ లీక్; బుకింగ్స్ ఓపెన్!

హ్యుందాయ్ అల్కాజార్ ఎస్‌యూవీ 6-సీటర్ మరియు 7-సీటర్ ఆప్షన్లతో రానుంది. ఇందులో 6-సీటర్ వెర్షన్‌లో రెండవ వరుసలో కెప్టెన్ సీట్లు లభిస్తుండగా, 7-సీటర్ వెర్షన్‌లో రెండవ వరుసలో 60:40 స్ప్లిట్ ఫంక్షన్‌తో కూడిన బెంచ్-టైప్ సీట్ లభ్యం కానుంది. ఏప్రిల్ 6, 2021వ తేదీన కంపెనీ ఈ కారుని ప్రపంచానికి పరిచయం చేయనుంది.

MOST READ:ఆడి క్యూ 7 లగ్జరీ కార్ కొన్న నటుడు చందు గౌడ

హ్యుందాయ్ అల్కజార్ 7-సీటర్ ఎస్‌యూవీ ఇంజన్ డీటేల్స్ లీక్; బుకింగ్స్ ఓపెన్!

సెకండ్ జనరేషన్ హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీని ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ 7-సీటర్ వెర్షన్ అల్కజార్ ఎస్‌యూవీని తయారు చేస్తున్నప్పటికీ, ఈ రెండు మోడళ్ల మధ్యలో డిజైన్ పరంగా పలు వ్యత్యాసాలు ఉంటాయి. ఈ ఎస్‌యూవీని హ్యుందాయ్ యొక్క గ్లోబల్ డిజైన్ ఐడెంటిటీ ఆఫ్ సెన్సస్ స్పోర్టినెస్ ఆధారంగా రూపొందించారు.

హ్యుందాయ్ అల్కజార్ 7-సీటర్ ఎస్‌యూవీ ఇంజన్ డీటేల్స్ లీక్; బుకింగ్స్ ఓపెన్!

హ్యుందాయ్ అల్కజార్‌లో సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్, వెనుక భాగంలో సి-ఆకారపు టెయిల్ ల్యాంప్ మరియు బూట్ డోరుపై క్రోమ్ స్ట్రిప్, ఇరువైపులా సిల్వర్ స్కిడ్ ప్లేట్స్, రూఫ్‌తో పాటుగా అమర్చిన రియర్ స్పాయిలర్, టర్న్ ఇండికేటర్లతో కూడిన సైడ్ మిర్రర్స్, విశిష్టమైన డిజైన్‌తో కూడిన డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ వంటి డిజైన్ ఫీచర్లను ఇందులో ఆశించవచ్చు.

MOST READ:కఠినమైన రోడ్డులో కారు నడిపి అదరగొట్టిన అరుణాచల్ ప్రదేశ్ సిఎం [వీడియో]

హ్యుందాయ్ అల్కజార్ 7-సీటర్ ఎస్‌యూవీ ఇంజన్ డీటేల్స్ లీక్; బుకింగ్స్ ఓపెన్!

ఇంటీరియర్ ఫీచర్లను గమనిస్తే, ఇందులో బేజ్ అండ్ బ్లాక్ కలర్‌లో డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్, ఫోర్ స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు డాష్‌బోర్డ్‌లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఇంకా ఇందులో 7 ఇంచ్ టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360 డిగ్రీ కెమెరా, బోస్ ఆడియో సిస్టమ్ మరియు హ్యుందాయ్ బ్లూలింక్ కనెక్ట్ టెక్నాలజీ మొదలైన ఫీచర్లు ఉండనున్నాయి.

హ్యుందాయ్ అల్కజార్ 7-సీటర్ ఎస్‌యూవీ ఇంజన్ డీటేల్స్ లీక్; బుకింగ్స్ ఓపెన్!

హ్యుందాయ్ యొక్క లేటెస్ట్ కార్ కనెక్ట్ టెక్నాలజీ ద్వారా, ఇందులో 50కి పైగా ఫీచర్లను ఆపరేట్ చేయవచ్చు. ఈ ఎస్‌యూవీలో ఫార్వర్డ్ కొలైజన్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ కొలైజన్ ఎవిడెన్స్ అసిస్ట్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ వంటి స్మార్ట్‌సెన్స్ ఫీచర్లను కంపెనీ ఆఫర్ చేసే అవకాశం ఉంది.

హ్యుందాయ్ అల్కజార్ 7-సీటర్ ఎస్‌యూవీ ఇంజన్ డీటేల్స్ లీక్; బుకింగ్స్ ఓపెన్!

ఇంకా ఇందులో స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, హైవే డ్రైవింగ్ అసిస్ట్ మరియు లేన్ డిపార్చర్ వార్నింగ్ వంటి లక్షణాలను కూడా ఆశించవచ్చు. ఇకపోతే, ఇందులో ఆటోమేటిక్ డే / నైట్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, బ్లూటూత్ కనెక్టివిటీ టెక్నాలజీ, వాయిస్ కమాండ్, పనోరమిక్ సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్, ఎల్‌ఇడి డిఆర్‌ఎల్ మరియు లెదర్ అప్‌హోలెస్ట్రీ వంటి ఫీచర్లు కూడా లభించే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Hyundai Alcazar 7-Seater SUV Engine Details Revealed Ahead Of Launch. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X