భారత్‌లో విడుదలైన హ్యుందాయ్ ఆల్కాజార్; లేటెస్ట్ ఫీచర్స్ & పర్ఫామెన్స్.. ధర కూడా తక్కువే

భారత మార్కెట్లో హ్యుందాయ్ కంపెనీ తన కొత్త ఆల్కాజార్‌ను విడుదల చేసింది. ఈ కొత్త ఆల్కాజార్ ఎస్‌యూవీ యొక్క ప్రారంభ ధర రూ. 16.30 లక్షలు(ఎక్స్‌షోరూమ్) కాగా, ఆల్కాజార్ టాప్ వేరియంట్ ధర రూ. 19.99 లక్షలు. ఈ కొత్త ఆల్కాజర్ లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది ఇప్పుడు రెండు ఇంజన్లు మరియు రెండు గేర్‌బాక్స్ ఆప్షన్లలో మూడు డ్రైవ్ మోడ్‌లు మరియు 6 మరియు 7 సీటింగ్ ఎంపికలతో వచ్చింది.

ఇండియన్ మార్కెట్లో అల్కాజార్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు 25,000 రూపాయలు చెల్లింది బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు కూడా త్వరలో ప్రారంభమవుతాయి.

భారత్‌లో విడుదలైన హ్యుందాయ్ ఆల్కాజార్; లేటెస్ట్ ఫీచర్స్ & పర్ఫామెన్స్.. ధర కూడా తక్కువే

హ్యుందాయ్ ఆల్కాజార్ 6 వేరియంట్లలో అందించబడుతుంది. అవి సిగ్నేచర్, సిగ్నేచర్ (ఓ), ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ (ఓ), ప్లాటినం మరియు ప్లాటినం (ఓ) అనే వేరియంట్లు. ఇందులో సిగ్నేచర్ ఎస్‌యూవీకి బేస్ వేరియంట్‌ కాగా, ప్లాటినం (ఓ) వేరియంట్ ఇందులో టాప్ వేరియంట్ అవుతుంది.

భారత్‌లో విడుదలైన హ్యుందాయ్ ఆల్కాజార్; లేటెస్ట్ ఫీచర్స్ & పర్ఫామెన్స్.. ధర కూడా తక్కువే
6-Seat Model Prices
Alcazar Variants P 2.0 MT P 2.0 AT D 1.5 MT D 1.5 AT
Prestige Rs 16.45 Lakh Rs 17.93 Lakh Rs 16.68 Lakh NA
Platinum NA Rs 19.55 Lakh NA Rs 19.78 Lakh
Signature Rs 18.70 Lakh Rs 19.84 Lakh Rs 18.93 Lakh Rs 19.99 Lakh
భారత్‌లో విడుదలైన హ్యుందాయ్ ఆల్కాజార్; లేటెస్ట్ ఫీచర్స్ & పర్ఫామెన్స్.. ధర కూడా తక్కువే

హ్యుందాయ్ అల్కాజార్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, బోస్ సౌండ్ సిస్టమ్, డ్రైవర్ సీటుకు ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, 360 డిగ్రీల పార్కింగ్ కెమెరా వంటివి ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన హ్యుందాయ్ ఆల్కాజార్; లేటెస్ట్ ఫీచర్స్ & పర్ఫామెన్స్.. ధర కూడా తక్కువే

కొత్త హ్యుందాయ్ అల్కాజార్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవును 4,330 మి.లీ, 1,790 మి.లీ వద్ద కంపెనీ ఉంచగా, వీల్ బేస్ మాత్రం 2,760 మిమీ పొడవు వుంది. ఇది హ్యుందాయ్ క్రెటా కంటే కూడా 150 మిమీ పొడవుగా ఉంటుంది. దీనికి 50 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌ను ఇచ్చారు. ఇందులో 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ అమర్చారు. ఈ ఎస్‌యూవీ యొక్క వెనుక భాగంలో కొత్త ర్యాపారౌండ్ టెయిల్ లాంప్స్ మరియు డ్యూయల్ ఎగ్జాస్ట్ టిప్స్ కలిగి ఉంటుంది.

భారత్‌లో విడుదలైన హ్యుందాయ్ ఆల్కాజార్; లేటెస్ట్ ఫీచర్స్ & పర్ఫామెన్స్.. ధర కూడా తక్కువే

హ్యుందాయ్ అల్కాజార్ 6 మరియు 7 సీట్ల ఎంపికలలో అందుబాటులోకి వచ్చింది. 6 సీట్ల ఆల్కాజార్ కారు 2 + 2 + 2 మోడల్‌ను కలిగి ఉండగా, 7 సీటర్లలో 2 + 3 + 2 మోడల్ లో ఉంటుంది.ఇది క్రెటా కంటే కొంత పొడవుగా ఉండటం వల్ల లెగ్‌రూమ్‌ కొంత తగ్గి ఉండే అవకాశం ఉంటుంది.

7-Seat Model Prices
Alcazar Variants P 2.0 MT P 2.0 AT D 1.5 MT D 1.5 AT
Prestige Rs 16.30 Lakh NA Rs 16.53 Lakh Rs 18.01 Lakh
Platinum Rs 18.22 Lakh NA Rs 18.45 Lakh NA
భారత్‌లో విడుదలైన హ్యుందాయ్ ఆల్కాజార్; లేటెస్ట్ ఫీచర్స్ & పర్ఫామెన్స్.. ధర కూడా తక్కువే

6 సీట్ల వేరియంట్‌కు మధ్య వరుసలో రెండు కెప్టెన్ సీట్లు లభిస్తాయి. కెప్టెన్ సీట్ల మధ్య సెంట్రల్ కన్సోల్ ఇవ్వబడింది, దీనిలో ఆర్మ్ రెస్ట్, మొబైల్ ఫోన్ ఛార్జర్ మరియు కప్ హోల్డర్ ఇవ్వబడ్డాయి. 7-సీట్ల వేరియంట్లో, మీరు సెంట్రల్ ఆర్మ్‌రెస్ట్‌తో రెండవ వరుస ఫోల్డ్ సీటును పొందుతారు. ఇది మూడవ వరుసలో ఉన్నవారు సులభంగా వెళ్ళడానికి మరియు రావడానికి అనుమతిస్తుంది.

భారత్‌లో విడుదలైన హ్యుందాయ్ ఆల్కాజార్; లేటెస్ట్ ఫీచర్స్ & పర్ఫామెన్స్.. ధర కూడా తక్కువే

అల్కాజార్ ఎస్‌యూవీ రెండు ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో ఒకటి 2.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు రెండవది1.5 లీటర్ డీజిల్ ఇంజిన్. ఇందులో ఉన్న 2.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 159 బిహెచ్‌పి మరియు 191 ఎన్ఎమ్ టార్క్అందిస్తుంది. దీనికి 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక ఉంటుంది.

భారత్‌లో విడుదలైన హ్యుందాయ్ ఆల్కాజార్; లేటెస్ట్ ఫీచర్స్ & పర్ఫామెన్స్.. ధర కూడా తక్కువే

ఇక రెండవ ఇంజిన్ అయిన 1.5-లీటర్ డీజిల్ విషయానికి వస్తే, ఇది 115 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. దీనికి 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక కూడా ఉంది. ఇందులో మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి కంఫర్ట్, ఎకో మరియు స్పోర్ట్ మోడ్స్.

భారత్‌లో విడుదలైన హ్యుందాయ్ ఆల్కాజార్; లేటెస్ట్ ఫీచర్స్ & పర్ఫామెన్స్.. ధర కూడా తక్కువే

హ్యుందాయ్ అల్కాజార్ 2.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 14.5 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగా, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 14.2 కిలోమీటర్ల వరకు అందిస్తుంది. అదేవిధంగా 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 20.4 కిలోమీటర్లు, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 18.1 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది.

భారత్‌లో విడుదలైన హ్యుందాయ్ ఆల్కాజార్; లేటెస్ట్ ఫీచర్స్ & పర్ఫామెన్స్.. ధర కూడా తక్కువే

కొత్త ఆల్కాజార్ 6 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి టైఫూన్ సిల్వర్, టైటాన్ గ్రే, టైగా బ్రౌన్, స్టార్రి నైట్, పోలార్ వైట్ మరియు ఫాంటమ్ బ్లాక్ కలర్స్. డ్యూయల్-టోన్ సిగ్నేచర్ వేరియంట్‌, ఫాంటమ్ బ్లాక్ రూఫ్ మరియు టైటాన్ గ్రేతో మాత్రమే లభిస్తుంది, అయితే సిగ్నేచర్ (ఓ) డ్యూయల్ టోన్ రెండు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. పోలార్ వైట్ విత్ బ్లాక్ ఫాంటమ్ రూఫ్ మరియు టైటాన్ గ్రే విత్ ఫాంటమ్ బ్లాక్ రూప్.

భారత్‌లో విడుదలైన హ్యుందాయ్ ఆల్కాజార్; లేటెస్ట్ ఫీచర్స్ & పర్ఫామెన్స్.. ధర కూడా తక్కువే

హ్యుందాయ్ అల్కాజార్ పరిమాణంలో హ్యుందాయ్ క్రెటా కంటే పెద్దదిగా ఉంటుంది. కావున ధర కూడా కొత్త ఎక్కువగా ఉంది. అయితే ఈ ఎస్‌యూవీ భారత మార్కెట్ రాబోయే జీప్ 7 సీట్స్ ఎస్‌యూవీ, ఎంజీ హెక్టర్ ప్లస్, టాటా సఫారి వంటి మోడళ్లకు ప్రత్యర్థిగా ఉంటుంది. దేశీయ మార్కెట్లో అరంగేట్రం చేసిన ఈ కొత్త ఎస్‌యూవీ ఎలాంటి అమ్మకాలను జరుపుతుందో వేచి చూడాలి.

Most Read Articles

English summary
Hyundai Alcazar Launch In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X