Alcazar ప్లాటినం(ఓ) 7-సీటర్ విడుదల చేసిన Hyundai; ధర & వివరాలు

ప్రముఖ కార్ల తయారీదారు Hyundai Motor India (హ్యుందాయ్ మోటార్ ఇండియా) దేశీయ మార్కెట్లో తన కొత్త Hyundai Alcazar (హ్యుందాయ్ అల్కాజార్‌) 6 మరియు 7 సీటర్ SUV ని విడుదల్ చేసిన విషయం తెలిసిందే. అయితే కంపెనీ ఈ SUV ని Prestige, Platinum మరియు Signature అనే వేరియంట్లలో మాత్రమే విడుదల చేసింది. కానీ హ్యుందాయ్ తన మిడ్-స్పెక్ Platinum (O) వేరియంట్‌ను కేవలం 6 సీట్ల కాన్ఫిగరేషన్‌లో మాత్రమే ప్రవేశపెట్టింది.

లాంచ్ సమయంలో హ్యుందాయ్ తన అల్కాజార్ ప్లాటినం (O) 7-సీటర్ వేరియంట్ విడుదల కాలేదు. అయితే ఈ వేరియంట్ ని ఇప్పుడు విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Alcazar ప్లాటినం(ఓ) 7-సీటర్ విడుదల చేసిన Hyundai; ధర & వివరాలు

కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన కొత్త అల్కాజార్ ప్లాటినం (ఓ) 7-సీటర్ వేరియంట్ ధర రూ. 19.63 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఈ కొత్త వేరియంట్ దాని 6-సీటర్ వేరియంట్ కంటే రూ. 15,000 తక్కువ ధరతో లాంచ్ చేయబడింది. అయితే ఈ కొత్త వేరియంట్ పెట్రోల్ ఇంజిన్‌తో అందించబడలేదు, ఇది కేవలం డీజిల్ ఇంజిన్ ఆప్సన్ మాత్రమే పొందుతుంది. ఇది ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

Alcazar ప్లాటినం(ఓ) 7-సీటర్ విడుదల చేసిన Hyundai; ధర & వివరాలు

ఇప్పుడు కంపెనీ యొక్క ప్లాటినం (ఓ) డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ మాత్రమే 6 మరియు 7 సీటింగ్ ఆప్షన్‌లను పొందుతుంది. ఇది కూడా అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. కావున మిగిలిన వేరియంట్స్ మాదిరిగానే చాలా అనుకూలంగా ఉంటుంది.

Alcazar ప్లాటినం(ఓ) 7-సీటర్ విడుదల చేసిన Hyundai; ధర & వివరాలు

కొత్త Hyundai Alcazar (హ్యుందాయ్ అల్కాజార్) యొక్క ప్లాటినం (ఓ) 7-సీటర్ వేరియంట్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇది టాప్-స్పెక్ వేరియంట్ కానప్పటికీ, చాలా గొప్ప ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులో 10.25 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది.

Alcazar ప్లాటినం(ఓ) 7-సీటర్ విడుదల చేసిన Hyundai; ధర & వివరాలు

అంతే కాకుండా ఇంద్దులో కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, పవర్డ్ డ్రైవర్ సీట్, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు బోస్ సౌండ్ సిస్టమ్‌ వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఎన్నో అందుబాటులో ఉంటాయి.

Alcazar ప్లాటినం(ఓ) 7-సీటర్ విడుదల చేసిన Hyundai; ధర & వివరాలు

Hyundai Alcazar యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్లు, బ్లైండ్‌స్పాట్ మానిటర్‌తో 360 డిగ్రీల కెమెరా మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ లభిస్తాయి.

Alcazar ప్లాటినం(ఓ) 7-సీటర్ విడుదల చేసిన Hyundai; ధర & వివరాలు

మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగా ఇది కేవలం 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో మాత్రమే కంపెనీ ఈ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. కావున ఇందులోని ఇంజిన్ 115 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఈ ఇంజిన్‌తో ఉపయోగించబడింది.

Alcazar ప్లాటినం(ఓ) 7-సీటర్ విడుదల చేసిన Hyundai; ధర & వివరాలు

హ్యుందాయ్ ఆల్కజార్ యొక్క పెట్రోల్ వేరియంట్స్ విషయానికి వస్తే, ఇందులో ఇందులో ఉన్న 2.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 159 బిహెచ్‌పి మరియు 191 ఎన్ఎమ్ టార్క్అందిస్తుంది. దీనికి 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉంటుంది.

Alcazar ప్లాటినం(ఓ) 7-సీటర్ విడుదల చేసిన Hyundai; ధర & వివరాలు

కంపెనీ ఇందులో మూడు డ్రైవ్ మోడ్‌లను అందిస్తుంది. అవి ఎకో, సిటీ మరియు స్పోర్ట్ మోడ్స్. కొత్త ఆల్కాజార్ 6 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి టైఫూన్ సిల్వర్, టైటాన్ గ్రే, టైగా బ్రౌన్, స్టార్రి నైట్, పోలార్ వైట్ మరియు ఫాంటమ్ బ్లాక్ కలర్స్. డ్యూయల్-టోన్ సిగ్నేచర్ వేరియంట్‌, ఫాంటమ్ బ్లాక్ రూఫ్ మరియు టైటాన్ గ్రేతో మాత్రమే లభిస్తుంది, అయితే సిగ్నేచర్ (ఓ) డ్యూయల్ టోన్ రెండు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. పోలార్ వైట్ విత్ బ్లాక్ ఫాంటమ్ రూఫ్ మరియు టైటాన్ గ్రే విత్ ఫాంటమ్ బ్లాక్ రూప్.

Alcazar ప్లాటినం(ఓ) 7-సీటర్ విడుదల చేసిన Hyundai; ధర & వివరాలు

ఈ కొత్త హ్యుందాయ్ అల్కాజార్ విడుదలైన అతి తక్కువ కాలంలోనే మంచి ప్రజాదరణ పొందింది. హ్యుందాయ్ అల్కాజార్ పరిమాణంలో హ్యుందాయ్ క్రెటా కంటే పెద్దదిగా ఉంటుంది. అయితే ఈ ఎస్‌యూవీ భారత మార్కెట్ రాబోయే జీప్ 7 సీట్స్ ఎస్‌యూవీ, ఎంజీ హెక్టర్ ప్లస్ మరియు టాటా సఫారి వంటి మోడళ్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Hyundai alcazar new platinum o 7 seater variant launched at rs 19 63 lakhs details
Story first published: Saturday, September 4, 2021, 9:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X