హ్యుందాయ్ అల్కాజార్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ వీడియో.. చూసారా?

అల్కాజార్ అంటే స్పానిష్ భాషలో ప్యాలెస్ అని అర్థం. ఈ అర్థాన్ని సార్థకం చేస్తూ హ్యుందాయ్ కంపెనీ అల్కాజార్ ఎస్‌యూవీని అదే పేరుతో భారతదేశంలో విడుదల చేసింది. ఇది క్రెటా ఆధారంగా రూపొందించబడింది. దీని స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 16.30 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 19.99 లక్షల వరకు ఉంది.

హ్యుందాయ్ కంపెనీ 2021 జూన్ 18 న భారత మార్కెట్లో కొత్త హ్యుందాయ్ అల్కాజార్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఇటీవల కాలంలో మేము ఈ కొత్త అల్కాజార్ యొక్క టాప్-ఆఫ్-ది-లైన్, 6-సీటర్, సిగ్నేచర్ మోడల్‌ను డ్రైవ్ చేసాము. దీని గురించి పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

హ్యుందాయ్ ఆల్కాజార్ 6 వేరియంట్లలో అందించబడుతుంది. అవి సిగ్నేచర్, సిగ్నేచర్ (ఓ), ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ (ఓ), ప్లాటినం మరియు ప్లాటినం (ఓ) అనే వేరియంట్లు. ఇందులో సిగ్నేచర్ ఎస్‌యూవీకి బేస్ వేరియంట్‌ కాగా, ప్లాటినం (ఓ) వేరియంట్ ఇందులో టాప్ వేరియంట్ అవుతుంది.

అల్కాజార్ ఎస్‌యూవీ రెండు ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో ఒకటి 2.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు రెండవది1.5 లీటర్ డీజిల్ ఇంజిన్. ఇందులో ఉన్న 2.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 159 బిహెచ్‌పి మరియు 191 ఎన్ఎమ్ టార్క్అందిస్తుంది. దీనికి 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక ఉంటుంది.

ఇక రెండవ ఇంజిన్ అయిన 1.5-లీటర్ డీజిల్ విషయానికి వస్తే, ఇది 115 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. దీనికి 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక కూడా ఉంది. ఇందులో మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి కంఫర్ట్, ఎకో మరియు స్పోర్ట్ మోడ్స్.

హ్యుందాయ్ అల్కాజార్ పరిమాణంలో హ్యుందాయ్ క్రెటా కంటే పెద్దదిగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీ భారత మార్కెట్ రాబోయే జీప్ 7 సీట్స్ ఎస్‌యూవీ, ఎంజీ హెక్టర్ ప్లస్, టాటా సఫారి వంటి మోడళ్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

హ్యుందాయ్ అల్కాజార్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

Most Read Articles

English summary
Hyundai Alcazar Suv First Drive Review Video. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X