హ్యుందాయ్ అల్కజార్ ఎస్‌యూవీ: వేరియంట్ల వారీ ధరలు మరియు ఫీచర్లు

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా, ఇటీవల భారత మార్కెట్లో తమ కొత్త 6-సీటర్ / 7-సీటర్ ఎస్‌యూవీ 'హ్యుందాయ్ అల్కాజార్'ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ హ్యుందాయ క్రెటా ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపుదిద్దుకున్న అల్కజార్ ఎస్‌యూవీ ప్రెస్టీజ్, ప్లాటినం మరియు సిగ్నేచర్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది.

హ్యుందాయ్ అల్కజార్ ఎస్‌యూవీ: వేరియంట్ల వారీ ధరలు మరియు ఫీచర్లు

కొత్త హ్యుందాయ్ అల్కాజార్ ఎస్‌యూవీలో వేరియంట్ వారీగా లభించే ఫీచర్లు మరియు వాటి ధరల వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

హ్యుందాయ్ అల్కజార్ ఎస్‌యూవీ: వేరియంట్ల వారీ ధరలు మరియు ఫీచర్లు

హ్యుందాయ్ అల్కాజర్ ప్రెస్టీజ్ - ధరలు: రూ.16.30 లక్షల నుండి రూ.16.68 లక్షలు

ఈ వేరియంట్ 2.0-లీటర్ పెట్రోల్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ (6 మరియు 7-సీటర్) మరియు 1.5-లీటర్ డీజిల్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ (6 మరియు 7-సీటర్) ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, డీఆర్‌ఎల్‌లు, టెయిల్ లాంప్స్, ట్విన్ టిప్ ఎగ్జాస్ట్, 17-ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ బ్రౌన్ ఇంటీరియర్ థీమ్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

హ్యుందాయ్ అల్కజార్ ఎస్‌యూవీ: వేరియంట్ల వారీ ధరలు మరియు ఫీచర్లు

అంతేకాకుండా, ఈ వేరియంట్ లెథర్‌తో చుట్టబడిన ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, లెథర్‌తో చుట్టబడిన గేర్ నాబ్, 64 కలర్ ఆప్షన్లతో కూడిన యాంబియంట్ లైటింగ్, వాయిస్ కంట్రోల్, పానోరమిక్ సన్‌రూఫ్, కీలెస్ ఎంట్రీ అండ్ స్టార్ట్, రిమోట్ ఇంజన్ స్టార్ట్, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్, క్రూయిజ్ కంట్రోల్ మరియు ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

హ్యుందాయ్ అల్కజార్ ఎస్‌యూవీ: వేరియంట్ల వారీ ధరలు మరియు ఫీచర్లు

ఇంకా ఇందులో, పవర్ అడ్జస్టబల్ అండ్ ఫోల్డబిల్ సైడ్ మిర్రర్స్, ముందు భాగంలో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, రియర్-సెంటర్ ఆర్మ్‌రెస్ట్ (7-సీటర్), వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ (6-సీటర్)తో కూడిన రియర్-సెంటర్ కన్సోల్, రియర్ విండో సన్‌షేడ్, మూడవ వరుసలో ఏసి వెంట్స్ మరియు యుఎస్‌బి ఛార్జర్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

హ్యుందాయ్ అల్కజార్ ఎస్‌యూవీ: వేరియంట్ల వారీ ధరలు మరియు ఫీచర్లు

ఇవే కాకుండా, కంపెనీ ఈ కారులో కూల్డ్ గ్లోవ్ బాక్స్, ఎత్తు-సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, రెండవ-వరుస సీట్లకు స్లైడింగ్ మరియు రిక్లైనింగ్ సదుపాయం, మూడవ-వరుస సీట్లకు రిక్లైనింగ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మరియు ఫోన్ కంట్రోల్స్, హ్యుందాయ్ బ్లూ-లింక్ కనెక్ట్-కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లను కూడా జోడించింది.

హ్యుందాయ్ అల్కజార్ ఎస్‌యూవీ: వేరియంట్ల వారీ ధరలు మరియు ఫీచర్లు

హ్యుందాయ్ అల్కాజర్ ప్రెస్టీజ్ (ఓ) - ధరలు: రూ.17.93 లక్షల నుండి రూ.18.01 లక్షలు

హ్యుందాయ్ అల్కాజార్‌లోని ఈ వేరియంట్ 2.0 పెట్రోల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ (6-సీటర్) మరియు 1.5 డీజిల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ (7-సీటర్) ఆప్షన్లతో లభిస్తుంది. ఈ వేరియంట్‌లో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ఎయిర్ ప్యూరిఫైయర్, డ్రైవ్ మోడ్ (కంఫర్ట్, ఎకో, స్పోర్ట్), ట్రాక్షన్ కంట్రోల్ మోడ్ (స్నో, శాండ్, మడ్) మరియు పాడిల్ షిఫ్టర్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

హ్యుందాయ్ అల్కజార్ ఎస్‌యూవీ: వేరియంట్ల వారీ ధరలు మరియు ఫీచర్లు

హ్యుందాయ్ అల్కాజర్ ప్లాటినం - ధరలు: రూ.18.22 లక్షల నుండి రూ.18.45 లక్షలు

ఈ వేరియంట్ 2.0 పెట్రోల్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ (7-సీటర్) మరియు 1.5 డీజిల్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ (7-సీటర్) ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఈ వేరియంట్‌లో 4 అదనపు ఎయిర్‌బ్యాగులు (మొత్తం 6 ఎయిర్‌బ్యాగులు), 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్, 18 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, 10.25 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, లెదర్ అప్‌హోలెస్ట్రీ, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, ఎయిర్ ప్యూరిఫైయర్, సెకండ్ రో హెడ్‌రెస్ట్ కుషన్, పవర్డ్ డ్రైవర్ సీట్ మరియు బోస్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

హ్యుందాయ్ అల్కజార్ ఎస్‌యూవీ: వేరియంట్ల వారీ ధరలు మరియు ఫీచర్లు

హ్యుందాయ్ అల్కాజర్ ప్లాటినం (ఓ) - ధరలు: రూ.19.56 లక్షల నుండి రూ.19.79 లక్షలు

ఈ వేరియంట్‌ను 2.0 పెట్రోల్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ (6-సీటర్) మరియు 1.5 డీజిల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ (6-సీటర్) ఆప్షన్లతో లభిస్తుంది. ఈ వేరియంట్‌లో సైడ్ ఫుట్ స్టెప్, డ్రైవ్ మోడ్ (కంఫర్ట్, ఎకో, స్పోర్ట్), ట్రాక్షన్ కంట్రోల్ మోడ్ (స్నో, శాండ్, మడ్) మరియు పాడిల్ షిఫ్టర్లు వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

హ్యుందాయ్ అల్కజార్ ఎస్‌యూవీ: వేరియంట్ల వారీ ధరలు మరియు ఫీచర్లు

హ్యుందాయ్ అల్కాజార్ సిగ్నేచర్ - ధరలు: రూ.18.71 లక్షల నుండి రూ.18.94 లక్షలు

ఈ వేరియంట్‌ను 2.0 పెట్రోల్ మాన్యువల్ (6-సీటర్) మరియు 1.5 డీజిల్ మాన్యువల్ (6-సీటర్) ఇంజిన్‌లతో కంపెనీ ప్రవేశపెట్టింది. సిగ్నేచర్ వేరియంట్‌లో ప్లాటినం వేరియంట్ యొక్క లక్షణాలతో పాటు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, డ్యూయల్-టోన్ బాడీ కలర్ (ఐచ్ఛికం) మరియు వెంటిలేషన్‌తో ముందు సీట్లు లభిస్తాయి.

హ్యుందాయ్ అల్కజార్ ఎస్‌యూవీ: వేరియంట్ల వారీ ధరలు మరియు ఫీచర్లు

హ్యుందాయ్ అల్కాజార్ సిగ్నేచర్ (ఓ) - ధర: రూ .19.85 నుంచి రూ .19.99 లక్షలు

ఈ వేరియంట్ 2.0 లీటర్ పెట్రోల్ ఆటోమేటిక్ (6-సీటర్) మరియు 1.5 డీజిల్ ఆటోమేటిక్ (6-సీటర్) ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో సైడ్ ఫుట్ స్టెప్, డ్రైవ్ మోడ్ (కంఫర్ట్, ఎకో, స్పోర్ట్), ట్రాక్షన్ కంట్రోల్ మోడ్ (స్నో, శాండ్, మడ్) మరియు పాడిల్ షిఫ్టర్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

హ్యుందాయ్ అల్కజార్ ఎస్‌యూవీ: వేరియంట్ల వారీ ధరలు మరియు ఫీచర్లు

ఇంజన్ విషయానికి వస్తే, ఇందులోని 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 159 బిహెచ్‌పి పవర్‌ను మరియు 191 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి.

Most Read Articles

English summary
Hyundai Alcazar SUV Variant-wise Prices And Features, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X