హ్యుందాయ్ కంపెనీ కొత్త రికార్డ్; 10 మిలియన్ యూనిట్‌గా అల్కజార్

భారతదేశంలో రెండవ అతిపెద్ద వాహన తయారీసంస్థ హ్యుందాయ్ ఇండియా, ఇటీవల దేశీయ మార్కెట్లో ఏకంగా 1,00,00,000 కార్లను ఉత్పత్తి చేసి కొత్త రికార్డ్ సృష్టించింది. తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబుదూర్‌లోని తన తయారీ కేంద్రంలో కొత్త హ్యుందాయ్ అల్కాజార్‌ను తయారుచేసి 10 మిలియన్ల కారుగా ప్రకటించింది.

హ్యుందాయ్ కంపెనీ కొత్త రికార్డ్; 10 మిలియన్ యూనిట్‌గా అల్కజార్

ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరియు హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండి మరియు సిఇఒ ఎస్.ఎస్. కిమ్ అక్కడే ఉన్నాడు. హ్యుందాయ్ కార్లను భారతీయ కస్టమర్లు చాలా ఇష్టపడతారు. ప్రస్తుతం, హ్యుందాయ్ ఇండియా భారతదేశంలో రెండు ప్రొడక్షన్ ప్లాంట్లను కలిగి ఉంది. ఇవి తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని ఇరుంగట్టుకొట్టై మరియు శ్రీపెరంబుదూర్ వద్ద ఉన్నాయి.

హ్యుందాయ్ కంపెనీ కొత్త రికార్డ్; 10 మిలియన్ యూనిట్‌గా అల్కజార్

హ్యుందాయ్ కంపెనీ భారతదేశంలో తమ ప్రయాణాన్ని మే 1996 లో ప్రారంభించింది. ప్రారంభించిన అనతి కాలంలోనే మంచి ప్రజాదరణ పొందింది. 1998 లో పరిచయం చేయబడిన, ఫస్ట్ వెర్షన్ సాంట్రో భారత మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగింది. హ్యుందాయ్ సాంట్రో కారు ద్వారా ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షితులయ్యారు. హ్యుందాయ్ కంపెనీ గత 25 సంవత్సరాలుగా భారత మార్కెట్లో గణనీయమైన వృద్ధిని కైవసం చేసుకుంది.

హ్యుందాయ్ కంపెనీ కొత్త రికార్డ్; 10 మిలియన్ యూనిట్‌గా అల్కజార్

ప్రస్తుతం హ్యుందాయ్ కంపెనీ సాంట్రో, గ్రాండ్ ఐ 10 నియోస్, ఐ 20, ఆరా, వెన్యూ, ఎలంట్రా, వెర్నా, టక్సన్‌ వంటి వాటిని భారతీయ మార్కెట్లో విక్రయిస్తోంది. 2015 విడుదలైన హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ భారత మార్కెట్లో మరింత సంచలనం సృష్టించగలిగింది. అదే విధంగా హ్యుందాయ్ క్రెటా, వెన్యూ వంటి కార్లు తమ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఈ ఎస్‌యూవీలు ఆకర్షణీయమైన డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల ఇప్పటికి మంచి ప్రజాదరణ పొందుతున్నాయి.

హ్యుందాయ్ కంపెనీ కొత్త రికార్డ్; 10 మిలియన్ యూనిట్‌గా అల్కజార్

హ్యుందాయ్ ఇండియా తన ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం కొత్త హ్యుందాయ్ అల్కాజార్ ఎస్‌యూవీ విడుదల చేసింది. ఈ కొత్త ఎస్‌యూవీమంచి డిజైన్ మరియు మంచి ఫీచర కలిగి ఉండటం వల్ల విడుదలైన అతి తక్కువ కాలంలోనే మంచి ఆదరణ పొందుతోంది.

హ్యుందాయ్ కంపెనీ కొత్త రికార్డ్; 10 మిలియన్ యూనిట్‌గా అల్కజార్

ఈ కొత్త ఎస్‌యూవీ స్ప్లిట్-స్టైల్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్, 3 డి హనీకూంబ్ గ్రిల్, కొత్త బంపర్ డిజైన్, ఎల్‌ఇడి టెయిల్ లాంప్, ఎల్‌ఇడి టర్న్ ఇండికేటర్, 17 మరియు 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, ఫ్లక్స్ స్కఫ్ ప్లేట్, షార్క్ పిన్ వంటి వాటిని కలిగి ఉంది.

హ్యుందాయ్ కంపెనీ కొత్త రికార్డ్; 10 మిలియన్ యూనిట్‌గా అల్కజార్

ఈ ఎస్‌యూవీ లోపలి భాగంలో 10.25 ఇంచెస్ టిఎఫ్‌టి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లూ లింక్ కనెక్ట్ టెక్నాలజీ, వాయిస్ కమాండర్, త్రీ రో ఎసి వెంట్స్, బ్లైండ్ విండో మానిటర్ మరియు యాంబియంట్ లైటింగ్ వంటి వాటితోపాటు, సీట్ బెల్ట్, ఆటో ఎయిర్ ప్యూరిఫైయర్, రిమోట్ ఇంజిన్ స్టార్ట్, క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అనేక ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంది.

హ్యుందాయ్ కంపెనీ కొత్త రికార్డ్; 10 మిలియన్ యూనిట్‌గా అల్కజార్

కొత్త ఆల్కాజార్ 6 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి టైఫూన్ సిల్వర్, టైటాన్ గ్రే, టైగా బ్రౌన్, స్టార్రి నైట్, పోలార్ వైట్ మరియు ఫాంటమ్ బ్లాక్ కలర్స్. డ్యూయల్-టోన్ సిగ్నేచర్ వేరియంట్‌, ఫాంటమ్ బ్లాక్ రూఫ్ మరియు టైటాన్ గ్రేతో మాత్రమే లభిస్తుంది, అయితే సిగ్నేచర్ (ఓ) డ్యూయల్ టోన్ రెండు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. పోలార్ వైట్ విత్ బ్లాక్ ఫాంటమ్ రూఫ్ మరియు టైటాన్ గ్రే విత్ ఫాంటమ్ బ్లాక్ రూప్.

హ్యుందాయ్ కంపెనీ కొత్త రికార్డ్; 10 మిలియన్ యూనిట్‌గా అల్కజార్

హ్యుందాయ్ అల్కాజార్ ఎస్‌యూవీ ప్రెస్టీజ్, ప్రీమియం మరియు సిగ్నేటర్ అనే మూడు వేరియంట్లలో విడుదలైంది. ఈ ఎస్‌యూవీని ప్రారంభ ధర రూ. 16.30 లక్షలు, ఎక్స్‌షోరూమ్‌కి విడుదల చేయగా, దాని టాప్ మోడల్ ధరను ఎక్స్‌షోరూమ్‌గా రూ. 20.14 లక్షల వద్ద ఉంచారు.

హ్యుందాయ్ కంపెనీ కొత్త రికార్డ్; 10 మిలియన్ యూనిట్‌గా అల్కజార్

అల్కాజార్ ఎస్‌యూవీ రెండు ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో ఒకటి 2.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు రెండవది1.5 లీటర్ డీజిల్ ఇంజిన్. ఇందులో ఉన్న 2.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 159 బిహెచ్‌పి మరియు 191 ఎన్ఎమ్ టార్క్అందిస్తుంది. దీనికి 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్

హ్యుందాయ్ కంపెనీ కొత్త రికార్డ్; 10 మిలియన్ యూనిట్‌గా అల్కజార్

ఇక రెండవ ఇంజిన్ అయిన 1.5-లీటర్ డీజిల్ విషయానికి వస్తే, ఇది 115 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. దీనికి 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక కూడా ఉంది. ఇందులో మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి కంఫర్ట్, ఎకో మరియు స్పోర్ట్ మోడ్స్.

Image Courtesy: Bijoy Ghosh/Twitter

Most Read Articles

English summary
Hyundai Alcazar Is 10 Millionth Car From Chennai Plant. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X