Just In
- 9 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 19 hrs ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 22 hrs ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 23 hrs ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- Movies
రాజీవ్ కనకాల మా నాన్న.. చైల్డ్ ఆర్టిస్ట్ మాటలకు సుమ షాక్
- News
అక్కడ భయపడి, ఇక్కడ నాటకాలా? అమిత్ షాతో అదే చెప్పా: వైసీపీపై పవన్ కళ్యాణ్ విమర్శలు
- Sports
ఐపీఎల్ 2021 షెడ్యూల్ వచ్చేసింది.. వేదికల్లో హైదరాబాద్‌కు దక్కని చోటు !
- Finance
ట్విట్టర్ సీఈవో 15 ఏళ్ల క్రితం తొలి ట్వీట్‌కు రూ.కోట్లు
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టాటా సఫారీ, హెక్టర్ ప్లస్ మోడళ్లకు పోటీగా హ్యుందాయ్ క్రెటా 7-సీటర్
హ్యుందాయ్ మోటార్ ఇండియా, గతేడాది ఆరంభంలో తమ సరికొత్త 2020 క్రెటా ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసిన తర్వాత, కంపెనీ ఇందులో మరో కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. హ్యుందాయ్ క్రెటాకి ఎక్స్టెండెడ్ వెర్షన్‌గా ఓ 7-సీటర్ మోడల్‌పై హ్యుందాయ్ పనిచేస్తోంది.

హ్యుందాయ్ ఇప్పటికే తమ 7-సీటర్ క్రెటా ఎస్‌యూవీని భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. తాజాగా, ఇందుకు సంబంధించిన కొత్త స్పై చిత్రాలు ఇంటర్నెట్లో లీక్ అయ్యాయి. ఈ స్పై చిత్రాలలో హ్యుందాయ్ క్రెటాని పాక్షికంగా క్యామోఫ్లేజ్ చేసి ఉండటాన్ని మనం గమనించవచ్చు.

ఈ స్పై చిత్రాలను గమనిస్తుంటే, హ్యుందాయ్ క్రెటా 7-సీటర్ ప్రొడక్షన్‌కు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీని ఫ్రంట్ మరియు సైడ్ డిజైన్ చూడటానికి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కొత్త క్రెటా మాదిరిగానే అనిపిస్తుంది. అయితే, రియర్ డిజైన్‌లో మాత్రం పెరిగిన క్యాబిన్ స్పేస్ కారణంగా స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.
MOST READ:ఒక ఛార్జ్‌తో 130 కి.మీ.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేని కొత్త ఒకినవ స్కూటర్

హ్యుందాయ్ క్రెటాలో మూడవ వరుస సీటింగ్ కోసం ఈ ఎస్యూవీ పొడవును కాస్తంత పెంచినట్లుగా అనిపిస్తుంది. దీని ఫలితంగా, ఎస్‌యూవీలో విశాలమైన క్యాబిన్ స్పేస్ లభిస్తుంది. హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్, హారియర్ మరియు సఫారీవంటి మోడళ్ల మాదిరిగానే ఈ కొత్త క్రెటా 7-సీటర్ ఎస్యూవీ కూడా తన స్మాల్ బ్రదర్ (స్టాండర్డ్ క్రెటా) ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకోనుంది.

హ్యుందాయ్ ఇప్పటికే ఓ కొత్త పేరును కూడా ట్రేడ్‌మార్క్ కోసం రిజిస్టర్ చేసుకుంది. అదే 'హ్యుందాయ్ అల్కాజార్' (Hyundai Alcazar). క్రెటా 7-సీటర్ మోడల్ని ఈ పేరుతోనే పరిచయం చేసే అవకాశాలు కనిపిస్తు్నాయి.
MOST READ:బువ్వ తిను, బుల్లెట్ బైక్ పట్టుకెళ్లు: రాయల్ ఎన్ఫీల్డ్ 'బుల్లెట్' థాలి ఛాలెంజ్

కొత్తగా లీకైన స్పై చిత్రాలలో సి-ఆకారపు ఎల్ఇడి టెయిల్ లాంప్, కొత్త బంపర్ మరియు కొత్త టెయిల్‌గేట్ మరియు సరికొత్త అల్లాయ్ వీల్స్ వంటి వివరాలను గమనించవచ్చు. ఇంకా ఇందులో షార్క్ ఫిన్ యాంటెన్నా, రియర్ క్వార్టర్ విండోస్ వంటి ఇతర మార్పులను కూడా మనం చూడొచ్చు.

స్టాండర్డ్ క్రెటా మరియు ఎక్స్టెండెడ్ క్రెటా మోడళ్ల మధ్య వ్యత్యాసాన్ని ఉంచేందుకు కంపెనీ దీని డిజైన్‌లో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది. కొత్త 7-సీటర్ హ్యుందాయ్ క్రెటా ఎస్యూవీ డిజైన్‌లో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్, పెద్ద రియర్ క్వార్టర్ ప్యానెల్, కొత్తగా రూపొందించిన రియర్ ఎండ్, అప్డేట్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, బూట్ లిడ్ మరియు ఎల్ఈడి టెయిల్ లైట్స్ వంటి మార్పులు ఉండొచ్చని అంచనా.
MOST READ:వామ్మో.. ఆరుగురు పర్యాటకులున్న కారుని నోటితో లాగేసిన పులి [వీడియో]

ఇకపోతే, ఈ కొత్త 7-సీటర్ క్రెటాలోని అనేక ఇతర అంశాలు మరియు పరికరాలు స్టాండర్డ్ 5-సీటర్ క్రెటా మాదిరిగానే ఉండనున్నాయి. ఇంటీరియర్స్‌లో కూడా కొత్త 7-సీటర్ క్రెటాలో కొన్ని కీలకమైన మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇందులో ప్రధాన మార్పు అదనపు మూడవ-వరుస సీటింగ్ రూపంలో వస్తుంది.

ఇంటీరియర్ ఫీచర్ల విషయానికొస్తే, ఏడు సీట్ల క్రెటాను దాని స్టాండర్డ్ ఎస్యూవీ మోడల్ మాదిరిగానే అదే పరికరాలు మరియు యాక్ససరీలను కలిగి ఉంటుంది. ఇంజన్ పరంగా కూడా ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోవు. స్టాండర్డ్ క్రెటాలో లభిస్తున్న అన్ని ఇంజన్ ఆప్షన్లు కొత్త 7-సీటర్ క్రెటాలోనూ కొనసాగించే అవకాశం ఉంది.
MOST READ:కార్లపై స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా ?

హ్యుందాయ్ నుండి కొత్తగా వనున్న 7-సీటర్ క్రెటా ఈ ఏడాది మధ్య భాగం నాటికి మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా. ఇది ఎమ్‌జి హెక్టర్ ప్లస్, టాటా హారియర్, 7 సీటర్ జీప్ కంపాస్, న్యూ-జెన్ మహీంద్రా ఎక్స్యువి500 మరియు స్కార్పియో వంటి మోడళ్లకు పోటీగా నిలిచే ఆస్కారం ఉంది.
చిత్ర సౌజన్యం: autodriven_india / Instagram