Hyundai Creta బేస్ వేరియంట్‌ని కొనొచ్చా? ఫీచర్లు ఎలా ఉంటాయి?

ప్రస్తుతం మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta). కొరియన్ కార్ బ్రాండ్ అందిస్తున్న ఈ ఎస్‌యూవీ అనతి కాలంలోనే అత్యంత పాపులారిటీని దక్కించుకుంది. మంచి రోడ్ ప్రజెన్స్ మరియు ప్రీమియం ఫీచర్లతో ఇది కస్టమర్లను ఆకట్టుకుంటోంది. చిన్న కారు నుండి అప్‌గ్రేడ్ కోరుకునే వారు మరియు మొదటి సారిగా సాలిడ్ ఎస్‌యూవీని కొనాలనుకునే వారు క్రెటాను ఎంచుకుంటున్నారు.

Hyundai Creta బేస్ వేరియంట్‌ని కొనొచ్చా? ఫీచర్లు ఎలా ఉంటాయి?

హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) మొత్తం ఆరు ట్రిమ్ లలో 1.5 లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో పలు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో క్రెటా ఇ (Creta E) అనేది దాని బేస్ వేరియంట్ మరియు ఈ వేరియంట్ 1.5 లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది.

Hyundai Creta బేస్ వేరియంట్‌ని కొనొచ్చా? ఫీచర్లు ఎలా ఉంటాయి?

మరి ఈ కథనంలో మనం హ్యుందాయ్ క్రెటా ఇ (Hyundai Creta E) బేస్ వేరియంట్ యొక్క ధరలు, ఫీచర్లు, ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్, ఇంజన్, కంఫర్ట్ అండ్ సేఫ్టీ ఫీచర్స్ మరియు వాటి మైలేజ్ మొదలైన సమాచారాన్ని తెలుసుకుందా రండి..!

Hyundai Creta బేస్ వేరియంట్‌ని కొనొచ్చా? ఫీచర్లు ఎలా ఉంటాయి?

Hyundai Creta E ధర

హ్యుందాయ్ క్రెటా ఇ పెట్రోల్ - రూ. 10.16 లక్షలు

హ్యుందాయ్ క్రెటా ఇ డీజిల్ - రూ. 10.62 లక్షలు

పైన పేర్కొన్న రెండు ధరలు ఎక్స్-షోరూమ్. ఈ వేరియంట్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో మాత్రమే లభిస్తాయి. ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉండదు. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఫీచర్ కావాలనుకునే వారు మిడ్ లేదా టాప్ ఎండ్ వేరియంట్లను ఎంచుకోవాల్సి ఉంటుంది.

Hyundai Creta బేస్ వేరియంట్‌ని కొనొచ్చా? ఫీచర్లు ఎలా ఉంటాయి?

Hyundai Creta E ఫీచర్లు

ఎక్స్టీరియర్ ఫీచర్లు

  • బై ఫంక్షనల్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్
  • ఎల్ఈడి పొజిషనింగ్ లాంప్స్
  • బ్లాక్ కలర్ క్యాస్కేడింగ్ గ్రిల్
  • డ్యూయల్ టోన్ బంపర్
  • క్రోమ్ ఫినిష్డ్ అవుట్ సైడ్ డోర్ హ్యాండిల్
  • బాడీ కలర్ సైడ్ మిర్రర్స్
  • చిన్న యాంటెన్నా
  • రియర్ స్పాయిలర్
  • ఇంటీరియర్ ఫీచర్లు

    • డ్యూయల్ టోన్ ఇంటీరియర్
    • D కట్ స్టీరింగ్ వీల్
    • ఫాలో మి హోమ్ హెడ్‌ల్యాంప్స్
    • ఫోల్డబుల్ కీ
    • మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్
    • ఫ్రంట్ కన్సోల్ ఆర్మ్‌రెస్ట్
    • పవర్డ్ టెయిల్‌గేట్
    • రియర్ ఏసి వెంట్స్
    • ఫ్రంట్ పవర్ అవుట్‌లెట్
    • ఫ్రంట్ అండ్ రియర్ విండో
    • రూమ్ ల్యాంప్
    • బ్యాటరీ సేవర్
    • మాన్యువల్ షిఫ్ట్ ఇండికేటర్
    • ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు
    • Hyundai Creta బేస్ వేరియంట్‌ని కొనొచ్చా? ఫీచర్లు ఎలా ఉంటాయి?

      Hyundai Creta E సేఫ్టీ ఫీచర్లు

      • ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్
      • ఈబిడితో కూడిన ఏబిఎస్
      • రివర్స్ పార్కింగ్ సెన్సార్స్
      • డే అండ్ నైట్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్
      • ఫ్రంట్ సీటు బెల్ట్ ప్రీ టెన్షనర్
      • సీట్ బెల్ట్ రిమైండర్ (డ్రైవర్ + ప్యాసింజర్)
      • ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్
      • హై స్పీడ్ అలెర్ట్ సిస్టమ్
      • ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ లాక్
      • లేన్ ఛేంజ్ ఇండికేటర్
      • ఇమ్మొబిలైజర్
      • డ్యూయెల్ హారన్
      • సెంట్రల్ లాకింగ్
      • Hyundai Creta బేస్ వేరియంట్‌ని కొనొచ్చా? ఫీచర్లు ఎలా ఉంటాయి?

        Hyundai Creta E ఇంజన్ ఆప్షన్లు

        హ్యుందాయ్ క్రెటా ఇ బేస్ వేరియంట్ రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో మొదటిది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు రెండవది 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. ఈ రెండు ఇంజన్లు కూడా మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

        Hyundai Creta బేస్ వేరియంట్‌ని కొనొచ్చా? ఫీచర్లు ఎలా ఉంటాయి?

        ఈ ఎస్‌యూవీలోని 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 115 బిహెచ్‌పి పవర్ ను మరియు 143 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 115 బిహెచ్‌పి పవర్ ను మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

        Hyundai Creta బేస్ వేరియంట్‌ని కొనొచ్చా? ఫీచర్లు ఎలా ఉంటాయి?

        Hyundai Creta E మైలేజ్

        మైలేజ్ విషయానికొస్తే, హ్యుందాయ్ క్రెటా లోని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ తో లీటరుకు 16.8 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అలాగే, ఇందులోని 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో లీటరుకు 21.4 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. పెట్రోల్ మరియు డీజిల్ మోడళ్లు రెండూ కూడా 50 లీటర్ల ఇంధన ట్యాంక్ తో వస్తాయి.

        Hyundai Creta బేస్ వేరియంట్‌ని కొనొచ్చా? ఫీచర్లు ఎలా ఉంటాయి?

        Hyundai Creta E కలర్ ఆప్షన్లు

        హ్యుందాయ్ క్రెటా ఇ వేరియంట్ సింగిల్ టోన్ మరియు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది, వాటి వివరాలు ఇలా ఉన్నాయి:

        సింగిల్ టోన్ కలర్ ఆప్షన్స్

        • సిల్వర్ టైఫూన్
        • పోలార్ వైట్
        • రెడ్
        • లావా ఆరెంజ్
        • ఫాంటమ్ బ్లాక్
        • టైటాన్ గ్రే
        • డీప్ ఫారెస్ట్
        • డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్స్

          • పోలార్ వైట్ విత్ ఫాంటమ్ బ్లాక్ రూఫ్
          • లావా ఆరెంజ్ విత్ ఫాంటమ్ బ్లాక్ రూఫ్
          • Hyundai Creta బేస్ వేరియంట్‌ని కొనొచ్చా? ఫీచర్లు ఎలా ఉంటాయి?

            Hyundai Creta E వీల్స్, బ్రేకులు, సైజు

            హ్యుందాయ్ క్రెటా యొక్క బేస్ వేరియంట్ E లో 205/65 R16 ప్రొఫైల్ తో కూడిన చక్రాలు ఉంటాయి మరియు వాటిపై ట్యూబ్‌లెస్ టైర్లను అమర్చబడి ఉంటాయి. ముందు భాగంలో డ్రమ్ బ్రేకులు మరియు వెనుక భాగంలో డిస్క్ బ్రేకులు ఉంటాయి. ఈ ఎస్‌యూవీ మొత్తం పొడవు 4300 మిమీ, వెడల్పు 1790 మిమీ, ఎత్తు 1635 మిమీ మరియు వీల్‌బేస్ 2610 మిమీగా ఉంటుంది.

            Hyundai Creta బేస్ వేరియంట్‌ని కొనొచ్చా? ఫీచర్లు ఎలా ఉంటాయి?

            డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం

            ప్రస్తుతం హ్యుందాయ్ క్రెటా ఈ బ్రాండ్ నుండి బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది. అయితే, ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ఎక్కువగా అమ్ముడవుతోంది. ఒకవేళ ఎవరైనా ఈ ఎస్‌యూవీ బేస్ వేరియంట్‌ను కొనుగోలు చేయాలని చూస్తుంటే, దానికి బదులుగా కాస్తంత ధర ఎక్కువైనా మిడ్ వేరియంట్ ఎస్ లేదా ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్‌ లను ఎంచుకోవటం మంచిది. వీటిలో ధరకు తగిన ఫీచర్లు మరియు విలువ లభిస్తుంది.

Most Read Articles

English summary
Hyundai creta e base variant features explained price specs engine mileage details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X