పోలీసుల మది దోచిన హ్యుందాయ్ క్రెటా; ఇప్పుడు పోలీస్ ఫోర్స్‌లో

భారత మార్కెట్లో ప్రముఖ వాహన సంస్థగా ప్రసిద్ధి చెందిన హ్యుందాయ్ కంపెనీ విభాగంలో అత్యధిక అమ్మకాలు జరిపిన బ్రాండ్ క్రెటా. క్రెటా ఎస్‌యువి అత్యధిక ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ బ్రాండ్లలో ఒకటి. అయితే ప్రస్తుతం కంపెనీ క్రెటా యొక్క కాంపాక్ట్ ఎస్‌యువిని దేశీయ మార్కెట్లో విక్రయిస్తోంది. ఈ ఎస్‌యువి ఇప్పుడు సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా పోలీసులు కూడా వినియోగిస్తున్నారు.

లడక్ పోలీస్ ఫోర్స్‌లో చేరిన కొత్త హ్యుందాయ్ క్రెటా; వివరాలు

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యువిని ఇటీవల లడక్ పోలీసులు తమ విభాగంలో చేర్చుకున్నారు. లడఖ్ పోలీస్ ఫోర్స్ కోసం హ్యుందాయ్ క్రెటా యొక్క టాప్-స్పెక్ ఎస్ఎక్స్ వేరియంట్‌ కొనుగోలు చేయబడింది. పోలీస్ వినియోగం కోసం కొనుగోలు చేసిన ఈ కొత్త క్రెటా బయట వైపు కొన్ని మార్పులు జరిగాయి. వీటిని మీరు ఇక్కడ గమనించవచ్చు.

లడక్ పోలీస్ ఫోర్స్‌లో చేరిన కొత్త హ్యుందాయ్ క్రెటా; వివరాలు

లడక్ పోలీసులు కొనుగోలు చేసిన క్రెటా ఎస్‌యూవీల సంఖ్య మాత్రం ఖచ్చితంగా వెల్లడించలేదు. అయితే ఇకపై లడఖ్ పోలీస్ ఫోర్స్ లో ఈ క్రెటా వినియోగంలో ఉంటుంది. ఈ ఎస్‌యూవీ వాహనదారులకు చాలా అనుకూలమైన అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. కావున పోలీసులు కూడా తమ ఫోర్స్ లో ఈ వాహనాలను చేర్చారు.

లడక్ పోలీస్ ఫోర్స్‌లో చేరిన కొత్త హ్యుందాయ్ క్రెటా; వివరాలు

హ్యుందాయ్ క్రెటా భారతదేశంలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే అత్యధిక అమ్మకాలు చేపట్టిన ఎస్‌యూవీ. క్రెటా గత సంవత్సరం భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా రికార్డ్ నెలకొల్పింది.

లడక్ పోలీస్ ఫోర్స్‌లో చేరిన కొత్త హ్యుందాయ్ క్రెటా; వివరాలు

ప్రస్తుతం మార్కెట్లో విక్రయించబడుతున్న కొత్త క్రెటా ఎస్‌యూవీ, కస్టమర్ల డిమాండ్ మేరకు అనేక వేరియంట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. పర్ఫార్మెన్స్ ప్రియుల కోసం 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ మరియు 1.4 లీటర్ టర్బో పెట్రోల్ వెర్షన్ క్రెటా ఎస్‌యూవీలో ఉన్నాయి.

లడక్ పోలీస్ ఫోర్స్‌లో చేరిన కొత్త హ్యుందాయ్ క్రెటా; వివరాలు

క్రెటా ఎస్‌యూవీ గతంలో ఆఫర్ చేసిన 1.6-లీటర్ మరియు 1.4-లీటర్ డీజిల్ ఇంజిన్ తొలగించబడింది. అంతే కాకుండా రెగ్యులర్ మోడల్‌ను డీజిల్ మరియు పర్ఫార్మెన్స్ ప్రియుల కోసం 1.5-లీటర్ పెట్రోల్ మరియు 1.4-లీటర్ టర్బో పెట్రోల్‌తో కొనుగోలు చేయవచ్చు. 1.5-లీటర్ డీజిల్ మోడల్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్ తో 115 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

లడక్ పోలీస్ ఫోర్స్‌లో చేరిన కొత్త హ్యుందాయ్ క్రెటా; వివరాలు

ఈ కొత్త హ్యుందాయ్ క్రెటా ఎస్‌యువి డిజైన్ విషయానికొస్తే, దీని ముందు భాగంలో హ్యుందాయ్ యొక్క క్యాస్కేడింగ్ గ్రిల్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులోని హెడ్‌లైట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. స్ప్లిట్ హెడ్‌లైట్ స్లిట్ లాంటి ఎల్ఈడీ డిఆర్ఎల్ ని కలిగి ఉంది.

లడక్ పోలీస్ ఫోర్స్‌లో చేరిన కొత్త హ్యుందాయ్ క్రెటా; వివరాలు

ఈ ఎస్‌యువి హెడ్‌లైట్ క్లస్టర్ క్రింద కొత్త ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ క్రింద స్కఫ్ ప్లేట్లు ఉన్నాయి. స్క్వేర్-స్టైల్ వీల్ ఆర్క్‌లు క్రెటాకు మంచి డిజైన్ అందిస్తాయి. దీనితో కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వస్తుంది. ఈ సిస్టమ్‌లో వాయిస్ కమాండ్ మరియు బ్లూలింక్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

లడక్ పోలీస్ ఫోర్స్‌లో చేరిన కొత్త హ్యుందాయ్ క్రెటా; వివరాలు

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యువిలోని సన్‌రూఫ్ వాయిస్ కమాండ్ ద్వారా నిర్వహించబడుతుంది. ఆటోమేటిక్ మోడళ్లలో ప్యాడిల్ షిఫ్ట్, డ్యూయల్ హోస్ చిమ్నీ, రిమోట్ ఇంజిన్ స్టార్ట్-అప్, క్రూయిజ్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైయర్ మరియు వైర్‌లెస్ ఛార్జర్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

లడక్ పోలీస్ ఫోర్స్‌లో చేరిన కొత్త హ్యుందాయ్ క్రెటా; వివరాలు

భారత మార్కెట్లో ప్రస్తుతం అమ్ముడవుతున్న బిఎస్ 6 హ్యుందాయ్ క్రెటా దాని విభాగంలో కియా సెల్టోస్, రెనాల్ట్ డస్టర్, ఎంజీ హెక్టర్ మరియు టాటా హారియర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఏది ఏమైనా ఈ హ్యుందాయ్ క్రెటా ఎస్‌యువి మంచి అమ్మకాలతో ఒక మంచి బ్రాండ్ గా నిలిచింది.

Most Read Articles

English summary
Hyundai Creta Joins Ladakh Police Force. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X