భారత్‌లో హ్యుందాయ్ క్రెటా ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ విడుదల; ధర & వివరాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ ఇండియా, తన ప్రసిద్ధ క్రెటా కాంపాక్ట్ ఎస్‌యూవీ యొక్క కొత్త వెర్షన్‌ను ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త క్రెటా ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ 1.5-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

క్రెటా ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ పెట్రోల్ మోడల్‌ను ధర ఎక్స్‌షోరూమ్ ప్రకారం రూ. 13.18 లక్షలు కాగా, డీజిల్ మోడల్‌ యొక్క ఎక్స్‌షోరూమ్ ధర రూ. 14.18 లక్షల వరకు ఉంటుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ క్రెటా ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ పెట్రోల్ మోడల్‌ ధర దాని స్టాండర్డ్ ఎస్ఎక్స్ మోడల్ కంటే తక్కువ ధర కలిగి ఉంది. మిడ్ రేంజ్ ఎస్ఎక్స్ వేరియంట్ యొక్క డిమాండ్ పెంచడానికి కొన్ని మార్పులతో ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ విడుదల చేయబడింది.

హ్యుందాయ్ క్రెటా ఇప్పుడు ఈఎక్స్, ఎస్, ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్, ఎస్ఎక్స్ మరియు ఎస్ఎక్స్ (ఓ) అనే ఐదు వేరియంట్లలో లభిస్తుంది. ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ ఎస్ఎక్స్ క్రింద ఉంచబడింది. కావున ఎస్ఎక్స్ తో పోలిస్తే దీని ఫీచర్స్ తక్కువగా ఉంటాయి.

కొత్త వెర్షన్‌లో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, కార్ టెక్ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే, తెఫ్ట్ అలారం, ఆర్కామిస్ సౌండ్ సిస్టమ్ మరియు వాయిస్ రికగ్నిషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇందులో కొన్ని ప్రీమియం ఫీచర్లు తొలగించబడినప్పటికీ, కొత్త వెర్షన్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, యుఎస్‌బి ఫోర్ట్, ఎల్‌ఇడి హెడ్‌లైట్లు, 17 ఇన్ అల్లాయ్ వీల్‌, క్రూయిజ్ కంట్రోల్, ఆటో ఎసి వంటి స్టాండర్డ్ ఫీహార్స్ అలాగే ఉన్నాయి.

హ్యుందాయ్ యొక్క ఎస్ఎక్స్ పెట్రోల్ ఎమ్‌టి ధర ప్రస్తుతం రూ. 13.93 లక్షలు. కానీ ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ పెట్రోల్ ఎస్ఎక్స్ పెట్రోల్ కంటే రూ. 75,000 తక్కువ. అదే సమయంలో ఎస్ఎక్స్ ఎమ్‌టి డీజిల్ ధర రూ. 14.93 లక్షలు. ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ డీజిల్ ఎస్ఎక్స్ ఎంటి డీజిల్ కంటే రూ. 75,000 తక్కువగా ఉంటుంది.

హ్యుందాయ్ క్రెటా అదే ఇంజిన్ లైనప్ ద్వారా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లను కలిగి ఉంటుంది. వీటిలో ప్రతి 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్, ఒక ఐవిటి మరియు 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్ ఇవ్వబడ్డాయి.

Most Read Articles

English summary
Hyundai Creta SX Executive Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X