హ్యుందాయ్ కస్టో 7-సీటర్ ఎమ్‌పివి టీజర్ లాంచ్: ఇన్నోవా, కార్నివాల్‌కి గట్టి పోటీ!

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ ఈ ఏడాది మార్చి నెలలో తమ సరికొత్త 'స్టారియా' ఎమ్‌పివి కాన్సెప్ట్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. లగ్జరీ ఎమ్‌పివి విభాగం కోసం కంపెనీ ఈ ఎమ్‌పివిని డిజైన్ చేసింది. కాగా, ఇప్పుడు టొయోటా ఇన్నోవా మరియు కియా కార్నివాల్ వంటి మోడళ్లకు పోటీగా మరొక కొత్త ఎమ్‌పివిని తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది.

హ్యుందాయ్ కస్టో 7-సీటర్ ఎమ్‌పివి టీజర్ లాంచ్: ఇన్నోవా, కార్నివాల్‌కి గట్టి పోటీ!

హ్యుందాయ్ కస్టో పేరుతో కంపెనీ తాజాగా ఓ ఎమ్‌పివి టీజర్‌ను ఆవిష్కరించింది. హ్యుందాయ్ కస్టో ఒక 7-సీటర్ ఎమ్‌పివి, మరికొద్ది రోజుల్లోనే కంపెనీ ఈ మోడల్‌ను అధికారికంగా ఆవిష్కరించనుంది. విడుదలకు ముందే కంపెనీ ఈ ఎమ్‌పివికి సంబంధించిన కొన్ని వివరాలను మీడియాకు వెల్లడించింది.

హ్యుందాయ్ కస్టో 7-సీటర్ ఎమ్‌పివి టీజర్ లాంచ్: ఇన్నోవా, కార్నివాల్‌కి గట్టి పోటీ!

హ్యుందాయ్ విడుదల చేసిన ఈ టీజర్ చిత్రాలలో కస్టో ఎమ్‌పివి యొక్క ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ స్పష్టంగా తెలుస్తుంది. గతంలో కంపెనీ స్టారియా ఎమ్‌పివి కంటే హ్యుందాయ్ కస్టో ఎమ్‌పివి కాస్తంత చిన్నదిగా అనిపిస్తుంది. హ్యుందాయ్ కస్టో ఎమ్‌పివి పొడవు 4,950 మిమీ, వెడల్పు 1,850 మిమీ మరియు ఎత్తు 1,734 మిమీ గా ఉంటుంది.

హ్యుందాయ్ కస్టో 7-సీటర్ ఎమ్‌పివి టీజర్ లాంచ్: ఇన్నోవా, కార్నివాల్‌కి గట్టి పోటీ!

హ్యుందాయ్ కస్టో ఎమ్‌పివిని తొలిసారిగా చూసినప్పుడు దీని డిజైన్ కొత్త తరం హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యూవీ నుండి ప్రేరణ పొంది రూపొందించినట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా దీని ఫ్రంట్ డిజైన్‌లో ఈ వివరాలు స్పష్టంగా తెలుస్తాయి. హ్యుందాయ్ కస్టో ఎమ్‌పివిలో ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు స్లిమ్ ఎల్‌ఇడి హెడ్‌లైట్‌లతో సమానంగా కనిపించే ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది.

హ్యుందాయ్ కస్టో 7-సీటర్ ఎమ్‌పివి టీజర్ లాంచ్: ఇన్నోవా, కార్నివాల్‌కి గట్టి పోటీ!

అయితే, ఇటీవలి హ్యుందాయ్ డిజైన్ లాంగ్వేజ్‌కు విరుద్ధంగా, కస్టో ఎమ్‌పివిలో ఎక్కువ సైడ్ క్రీజులు కనిపించవు. కియా మోటార్స్ మరియు హ్యుందాయ్ కంపెనీలు రెండూ కూడా అనుబంధ సంస్థలు కావడంతో, కస్టో ఎమ్‌‌పివి మరియు కార్నివాల్ ఎమ్‌పివిల మధ్య కొన్ని పోలికలు ఉండే అవకాశం ఉంది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ విషయంలో కూడా ఇదే జరిగింది.

హ్యుందాయ్ కస్టో 7-సీటర్ ఎమ్‌పివి టీజర్ లాంచ్: ఇన్నోవా, కార్నివాల్‌కి గట్టి పోటీ!

హ్యుందాయ్ కస్టో డోర్ హ్యాండిల్స్ యొక్క అమరిక కియా కార్నివాల్ ఎమ్‌పివిలో చూసినట్లుగా అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇది స్లైడింగ్ డోర్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. కస్టో వెనుక భాగంలో ఎల్‌ఈడీ లైటింగ్ సన్నని సి-ఆకారపు డిజైన్‌తో రూపొందించబడింది మరియు ఇది హారిజాంటల్ బార్‌తో అనుసంధానించబడి ఉంటుంది.

హ్యుందాయ్ కస్టో 7-సీటర్ ఎమ్‌పివి టీజర్ లాంచ్: ఇన్నోవా, కార్నివాల్‌కి గట్టి పోటీ!

ప్రస్తుతానికి హ్యుందాయ్ కస్టో ఇంటీరియర్‌కి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. అయితే, ఇది మూడు వరుసల సీటింగ్ కాన్ఫిగరేషన్‌తో ఆరు లేదా ఏడు సీట్ల ఆప్షన్‌తో లభించే అవకాశం ఉంది. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌కి అనుగుణంగా దీని ఇంటీరియర్ క్యాబిన్, డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ మరియు ఫీచర్లు కూడా అధునాతన టెక్నాలజీతో కూడుకున్నవే కావచ్చు.

హ్యుందాయ్ కస్టో 7-సీటర్ ఎమ్‌పివి టీజర్ లాంచ్: ఇన్నోవా, కార్నివాల్‌కి గట్టి పోటీ!

ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, హ్యుందాయ్ కస్టో ఎమ్‌పివిలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 170 హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మరింత శక్తివంతమైన 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ కూడా ఉంటుందని సమాచారం. ఇది గరిష్టంగా 236 హెచ్‌పి శక్తిని జనరేట్ చేస్తుంది.

హ్యుందాయ్ కస్టో 7-సీటర్ ఎమ్‌పివి టీజర్ లాంచ్: ఇన్నోవా, కార్నివాల్‌కి గట్టి పోటీ!

హ్యుందాయ్ కస్టో ఎమ్‌పివి ధరను అందుబాటులో ఉంచేందుకు కంపెనీ దీనిని ఫ్రంట్-వీల్ ఆప్షన్‌తో మాత్రమే అందించవచ్చని భావిస్తున్నారు. మరి ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్ ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఎమ్‌పివి ముందుగా చైనా మార్కెట్లో విడుదల కానుంది. ఆ తర్వాతి దశల్లో ఇది ఆసియా మార్కెట్లలో విడుదలయ్యే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Hyundai Custo 7-seater MPV Teased Ahead Of Official Debut, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X