ఫ్లైయింగ్ వెహికల్స్ విడుదలకు నేను సైతం అంటున్న Hyundai.. పూర్తి వివరాలు

ఒకప్పుడు గుర్రపు బండ్లు, తరువాత సైకిల్స్ ఆ తరువాత డీజిల్ మరియు పెట్రోల్ వాహనాలు పుట్టుకొచ్చాయి. అయితే ఇప్పుడు పెట్రోల్ మరియు డీజిలు కార్ల స్థానంలో ఎలక్ట్రిక్ కార్లు పుట్టుకొస్తున్నాయి. కొన్ని రోజుల తరువాత ప్రపంచ మార్కెట్లో డీజిల్ మరియు పెట్రోల్ వాహనాలు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

అయితే ప్రస్తుత కాలంలో చాలా కంపెనీలు ఏకంగా ఎగిరే వాహనాలు మార్కెట్లో విడుదల చేయాలనే సంకల్పంతో వాటిపై నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన హ్యుందాయ్ మోటార్ (Hyundai Motor) కంపెనీ కూడా ఎగురే వాహనాల తయారీ దిశగా అడుగులు వేస్తోంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఫ్లైయింగ్ కార్స్ విడుదలకు నేను సైతం అంటున్న Hyundai.. పూర్తి వివరాలు

హ్యుందాయ్ మోటార్ కంపెనీ భవిష్యత్ మొబిలిటీ విజన్‌ను కోసం, ఇటీవల సూపర్నల్ ఎల్‌ఎల్‌సి అనే కొత్త కంపెనీని ప్రారంభించింది, ఇది అర్బన్ ఎయిర్ మొబిలిటీ వాహనాలను అభివృద్ధి చేయాలనే కంపెనీ లక్ష్యం కోసం పని చేస్తుంది. హ్యుందాయ్ (Hyundai) తన భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా ఎగిరే వాహనాల అభివృద్ధి ప్రాజెక్టులపై తీవ్రంగా కృషి చేస్తోంది. హ్యుందాయ్ కంపెనీ ప్రారంభించనున్న ఈ ఫ్లైయింగ్ కార్ లో 5 సభ్యులు ప్రయాణించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

ఫ్లైయింగ్ కార్స్ విడుదలకు నేను సైతం అంటున్న Hyundai.. పూర్తి వివరాలు

ఇందుకోసం హ్యుందాయ్ కంపెనీ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ పెట్టుబడిదారుల నుండి మద్దతు తీసుకుంటోంది. తన కొత్త కంపెనీ కింద, హ్యుందాయ్ 2028 లో మొదటి కమర్షియల్ ఫ్లయింగ్ వెహికల్‌ను విడుదల చేననున్నట్లు తెలిపింది. అయితే ఈ ఫ్లయింగ్ వెహికల్‌ 2030 నుంచి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది.

నివేదికల ప్రకారం హ్యుందాయ్ కంపెనీ ఇప్పటికే eVTOL ఫ్లయింగ్ వెహికల్‌పై పనిచేస్తున్నట్లు కూడా తెలిపింది. త్వరలో రానున్న ఈ ఫ్లైయింగ్ కార్స్ రవాణా రీతుల్లోనే ఒక సంచలన మార్పు తీసుకు వస్తుంది అని భావిస్తున్నారు. ఎగిరే కార్లు అందుబాటులోకి వచ్చినట్లైతే ట్రాఫిక్ మాత్రమే కాకుండా రోడ్డు ప్రమాదాల సంఖ్య కనిష్ఠానికి కూడా చేరుకుంటుంది అని సంబంధిత వర్గాలు తెలుపుతున్నాయి.

ఫ్లైయింగ్ కార్స్ విడుదలకు నేను సైతం అంటున్న Hyundai.. పూర్తి వివరాలు

హ్యుందాయ్ (Hyundai) కంపెనీ రాబోయే ఈ ఫ్లయింగ్ వాహనాన్ని సామాన్య వినియోగదారులకు కూడా అందుబాటులో ఉండేలా అందుబాటు ధరలో తయారు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు తెలిపింది. దీని కోసం, హ్యుందాయ్ తన బృందంతో కలిసి అన్ని ప్రమాణాలకు అనుగుణంగా దీనిని సరసమైనదిగా మార్చడానికి కృషి చేస్తోంది.సరసమైన ధరకు ఫ్లైయింగ్ కార్లు అందుబాటులోకి వచ్చినట్లైతే పూర్తి రవాణా వ్యవస్థలో ఒక పెను మార్పు సంభవిస్తుంది.

ఫ్లైయింగ్ కార్స్ విడుదలకు నేను సైతం అంటున్న Hyundai.. పూర్తి వివరాలు

ఇప్పటికే భవిష్యత్ తరాలకు అనుకూలంగా ఉండే వాహనాలను తయారుచేయడానికి (ఎగిరే వాహనాలు) 50 కంటే ఎక్కువ చిన్న మరియు పెద్ద కంపెనీలను సూపర్నల్ తో కలిగి ఉంది. సూపర్నల్ అనేది వాహనాలను అభివృద్ధి చేయడమే కాకుండా, కంపెనీ తయారుచేసే అన్ని వాహనాలను ఒకే నెట్‌వర్క్‌కు అనుసంధానించే వ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తోంది. ఇవన్నీ కూడా రాబోయే తరాలకు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఫ్లైయింగ్ కార్స్ విడుదలకు నేను సైతం అంటున్న Hyundai.. పూర్తి వివరాలు

హ్యుందాయ్ కంపెనీ కమర్షియల్ స్పేస్ కోసం మొదట ఫ్లయింగ్ వాహనాలను లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో క్యాబ్ బుక్ చేసినట్లే ఈ కార్లను బుక్ చేసుకోవచ్చు. ప్రయాణీకులు దీన్ని యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు, అలాగే రైడ్ సమయాన్ని ఎంచుకోవడానికి, మార్చడానికి మరియు రద్దు చేయడానికి కూడా మీకు ఆప్సన్ అందుబాటులో ఉంటుంది. కావున దీనిని చాలా సులభంగా వినియోగించుకోవచ్చు.

హ్యుందాయ్ మోటార్ గ్రూప్ యొక్క ఎయిర్ మొబిలిటీ విభాగం గత సంవత్సరం అంతర్జాతీయ మార్కెట్లో తన కాన్సెప్ట్ ఫ్లయింగ్ కార్ S-A1 ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం, కంపెనీ దీనిని eVTOLగా అభివృద్ధి చేస్తోంది. ఇది 2024 లో US ఏజెన్సీలచే ధృవీకరించబడుతుందని, ఆ తర్వాత US మార్కెట్‌లలో విక్రయానికి సిద్ధంగా ఉంటుందని కంపెనీ అధికారికంగా తెలిపింది.

ఫ్లైయింగ్ కార్స్ విడుదలకు నేను సైతం అంటున్న Hyundai.. పూర్తి వివరాలు

ఇప్పుడు చాలా కంపెనీలు ఎగిరే వాహనాల తయారీలో ఉన్నాయి, కావున ఈ ఎగిరే వాహనాలు కూడా ముందుగా పట్టణ, ప్రధాన మార్గాల్లో ప్రారంభిస్తారు. ఈ ఎగిరే ఎలక్ట్రిక్ కారును రూపొందించడానికి, కంపెనీ విమాన సేవలకు సంబంధించిన ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు మరియు హస్తకళాకారుల సహాయాన్ని తీసుకుంటోంది. ఎందుకంటే ఎగిరే వాహనాలు విమానాలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. కావున ఈ ఎగిరే వాహనాలు కూడా ఒకరమైన విమాన ప్రయాణ అనుభూతి తప్పకుండా కలిగిస్తాయి.

ఫ్లైయింగ్ కార్స్ విడుదలకు నేను సైతం అంటున్న Hyundai.. పూర్తి వివరాలు

ప్రపంచం రోజురోజుకి అభివృద్ధి వైపు పరుగులు తీస్తోంది. ఈ క్రమంలో అధునాతన సాంకేతిక లక్షణాలు కలిగిన ఎన్నో వాహనాలు విడుదలవుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో విడుదలవుతున్న వాహనాలు కూడా మునుపటి కార్లలో ఫీచర్స్ కంటే కూడా చాలా అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉన్నాయి. కావున రానున్న భవిష్యత్ తరాలు మరింత అధునాతనంగా ఉంటాయి అనుటలో ఎటువంటి సందేహం లేదు.

Most Read Articles

English summary
Hyundai group sets up firm to develop flying vehicles details
Story first published: Friday, November 12, 2021, 14:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X