Just In
- 1 hr ago
3 కి.మీ ట్రక్కుని రివర్స్ గేర్‌లో నడిపిన డ్రైవర్.. ఎందుకనుకుంటున్నారా, అయితే ఇది చూడండి
- 1 hr ago
దేశంలోనే అతిపెద్ద మల్టీ-బ్రాండ్ కార్ సర్వీస్ సెంటర్‌ను ఓపెన్ చేసిన బాష్
- 2 hrs ago
టీవీఎస్ ఎక్స్ఎల్ 100 విన్నర్ ఎడిషన్ లాంచ్ : ధర & వివరాలు
- 16 hrs ago
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
Don't Miss
- News
నాన్సీ ల్యాప్‌టాప్ చోరీ? రష్యా ఇంటలిజెన్స్‌కు చేరవేసే ప్లాన్.. ఎఫ్‌బీఐ అఫిడవిట్లో సంచలనాలు..
- Sports
వికెట్ కీపర్‌గా పంత్ అరుదైన రికార్డు.. ధోనీ కన్నా వేగంగా!!
- Finance
Gold prices today : స్థిరంగా బంగారం ధరలు, వెండి ధరలు జంప్
- Lifestyle
మీరు ఎప్పుడూ ఎందుకు అలసిపోతున్నారు?అందుకు సాధారణ కారణాలు ఇక్కడ ఉన్నాయి..
- Movies
Master box office: 6వ రోజు కూడా పవర్ఫుల్ కలెక్షన్స్.. విజయ్ మరో బిగ్గెస్ట్ రికార్డ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొత్త హ్యుందాయ్ ఐ 20 బుకింగ్స్ హవా.. ఇప్పటికీ తగ్గని జోరు
దేశీయ మార్కెట్లో కొత్త హ్యుందాయ్ ఐ 20 లాంచ్ అయినప్పటి నుంచి ఎక్కువ ప్రజాదరణను పొందుతోంది. ఈ ఐ 20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బుకింగ్స్ ఒక నెల తర్వాత జోరుగా సాగుతున్నాయి. కంపెనీ నివేదికల ప్రకారం ఐ 20 బుకింగ్స్ ఇప్పటికే 35,000 యూనిట్లు దాటినట్లు సమాచారం.

కొత్త హ్యుందాయ్ ఐ 20 యొక్క ఆకర్షణీయమైన డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ మరియు ఇంజన్ ఆప్షన్లు వాహన ప్రియులను ఎక్కువగా ఆకర్షించాయి. ఈ కారణంగా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఐ 20 ఒక్క నవంబర్ నెలలోనే దాదాపు 9,096 యూనిట్లు అమ్ముడయ్యాయి.

కొత్త ఐ 20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ డెలివరీలు త్వరలో పార్రంభమవుతాయి. కానీ ఈ హ్యాచ్‌బ్యాక్ కోసం కస్టమర్లు ఇంకా కొన్ని రోజులు వేచి ఉండక తప్పదు. కొత్త హ్యుందాయ్ ఐ 20 దాని పోటీదారుల కంటే కొంచెం ఖరీదైనది, అయినప్పటికీ ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షించడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
MOST READ:కొత్త మహీంద్రా థార్ కొనుగోలు చేసిన మలయాళీ సెలబ్రెటీ, ఎవరో చూసారా ?

ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షించడం వల్ల లాంచ్ అయిన అతి తక్కువ కాలంలోనే విజయవంతమైన కారుగా నిలిచింది. దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కొత్త హ్యుందాయ్ ఐ 20 ప్రారంభ ధర రూ. 6.80 లక్షల నుంచి రూ. 11.18 లక్షల వరకు ఉంటుంది.

కస్టమర్లు ఈ ఐ 20 కారుని బుక్ చేసుకోవాలనుకుంటే కంపెనీ యొక్క వెబ్సైట్ లేదా డీలర్‌షిప్‌లో రూ. 21 వేల ముందస్తు మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు. కంపెనీ దాని ఎంట్రీ లెవల్ వేరియంట్‌ను తీసుకురానున్నట్లు సమాచారం అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన విడుదల కాలేదు.
MOST READ:వెదురుతో చేసిన ఈ-సైకిల్.. వెరీ కాస్ట్లీ గురూ..!

కొత్త ఐ 20 పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో ప్రవేశపెట్టబడింది. మొదట పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే ఇందులో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 120 బిహెచ్పి శక్తిని అందిస్తుంది. దీనికి డిసిటి మరియు 6-స్పీడ్ ఐఎమ్‌టి గేర్‌బాక్స్ జతచేయబడి ఉంటుంది.

ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, అది 1.2-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. ఇది ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 88 బిహెచ్పి, 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 83 బిహెచ్‌పిని అందిస్తుంది. మూడవ ఇంజిన్ 1.5-లీటర్ డీజిల్ ఇంజన్, ఇది 100 బిహెచ్పి శక్తిని అందిస్తుంది, 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
MOST READ:న్యూ ఇయర్లో భారీగా తగ్గిపోయిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. అసలు కారణం ఇదే..

హ్యుందాయ్ ఐ 20 యొక్క ఇంటీరియర్స్ గమనించినట్లయితే ఇందులో కంట్రోల్ బటన్లతో కూడిన కొత్త స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో మరియు బ్రాండ్ యొక్క బ్లూ లింక్ కనెక్ట్ టెక్నాలజీ వంటివి ఉన్నాయి.

ఇప్పటికే భారత మార్కెట్లో దాదాపు అన్ని వాహన తయారీ కంపెనీలు తమ బ్రాండ్ యొక్క వాహనాల ధరలను పెంచుతున్నట్లు సమాచారం అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భాగంగా హ్యుందాయ్ ఐ 20 ధరలు కూడా కొత్త సంవత్సరం నుండి పెరిగాయి. ధర పెరుగుదల కారణంగా బుకింగ్స్ ఏ విధంగా ఉంటాయనేది త్వరలో తెలుస్తుంది. ఏది ఏమైనా ధరలు పెరిగినప్పటికీ బుకింగ్స్ యధావిధిగా ఉండే అవకాశం ఉంటుందని మేము భావిస్తున్నాము.
MOST READ:యువరాజ్ సింగ్ గ్యారేజ్‌లో చేరిన మరో కొత్త లగ్జరీ కార్ ; ధర & వివరాలు