హ్యుందాయ్ ఎస్‌యూవీలకు భారీ డిమాండ్.. జులైలో జోరందుకున్న సేల్స్..

భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్, గడచిన జులై నెలలో భారీ అమ్మకాలను నమోదు చేసింది. కొత్తగా ప్రవేశపెట్టిన అల్కజార్, పాపులర్ క్రెటా మరియు సరసమైన వెన్యూ ఎస్‌యూవీల కారణంగా గత నెలలో హ్యుందాయ్ అమ్మకాలు జోరందుకున్నాయి.

హ్యుందాయ్ ఎస్‌యూవీలకు భారీ డిమాండ్.. జులైలో జోరందుకున్న సేల్స్..

జులై 2021లో హ్యుందాయ్ మొత్తం 60,249 యూనిట్ల వాహనాలను విక్రయించింది. వీటిలో దేశీయ మార్కెట్లో 48,042 యూనిట్లను విక్రయించగా, మిగిలిన 12,207 యూనిట్లను భారతదేశం నుండి విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయబడ్డాయి.

హ్యుందాయ్ ఎస్‌యూవీలకు భారీ డిమాండ్.. జులైలో జోరందుకున్న సేల్స్..

కాగా, గతేడాది ఇదే సమయం (జూలై 2020 నెల)లో హ్యుందాయ్ మొత్తం 41,300 యూనిట్లను విక్రయించినట్లు పేర్కొంది. ఈ సమయంతో పోలిస్తే, హ్యుందాయ్ అమ్మకాలు 45.9 శాతం వృద్ధిని సాధించాయి. కొత్తగా ప్రారంభించిన అల్కాజార్‌కి బలమైన డిమాండ్ ఏర్పడటం మరియు ఎప్పటిలాగే క్రెటా అమ్మకాలు బలంగా ఉండటంతో కంపెనీ ఈ వృద్ధిని సాధించగలిగింది.

హ్యుందాయ్ ఎస్‌యూవీలకు భారీ డిమాండ్.. జులైలో జోరందుకున్న సేల్స్..

హ్యుందాయ్ మొత్తం అమ్మకాలలో ఈ రెండు మోడళ్లే 25.8 శాతం వార్షిక వృద్ధికి దోహదపడ్డాయని కంపెనీ తెలిపింది. కాగా, గడచిన జూన్ 18వ తేదీన మార్కెట్లోకి ప్రవేశించిన హ్యుందాయ్ అల్కాజార్ 6-సీటర్ / 7-సీటర్ ఎస్‌యూవీ, దేశంలో లాంచ్ అయినప్పటి నుండి పాజిటివ్‌గా స్వీకరించబడింది.

హ్యుందాయ్ ఎస్‌యూవీలకు భారీ డిమాండ్.. జులైలో జోరందుకున్న సేల్స్..

ఈ మోడల్ కోసం ఇప్పటికే 14,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లను దక్కించుకున్నట్లు కంపెనీ పేర్కొంది. అల్కజార్‌ను ప్రారంభించిన మొదటి 40 రోజుల్లో ఇంతటి భారీ సంఖ్యలో బుకింగ్స్ అందుకోవటం చాలా సంతోషంగా ఉందని హ్యుందాయ్ ఇండియా డైరెక్టర్ (సేల్స్, మార్కెటింగ్ అండ్ సర్వీస్) తరుణ్ గార్గ్ అన్నారు.

హ్యుందాయ్ ఎస్‌యూవీలకు భారీ డిమాండ్.. జులైలో జోరందుకున్న సేల్స్..

హ్యుందాయ్ అల్కజార్ కోసం ఇప్పటివరకు వచ్చిన బుకింగ్‌లలో, కస్టమర్లు ఎక్కువగా 6-సీటర్ వెర్షన్‌ను ఎంచుకున్నారని ఆయన తెలిపారు. సుమారు 60 శాతం మంది కస్టమర్లు ఆ కాన్ఫిగరేషన్‌ని ఎంచుకున్నారని, అలాగే డీజిల్ వేరియంట్‌లకు డిమాండ్ 65 శాతం వరకూ ఉందని తరుణ్ చెప్పారు.

హ్యుందాయ్ ఎస్‌యూవీలకు భారీ డిమాండ్.. జులైలో జోరందుకున్న సేల్స్..

భారతదేశపు అతిపెద్ద ప్యాసింజర్ కార్ల ఎగుమతిదారులలో హ్యుందాయ్ కూడా ఒకటి. కంపెనీ ఇటీవల విడుదల చేసిన అల్కాజర్ ఎస్‌యూవీ, ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీ మరియు క్రెటా మిడ్-సైజ్ ఎస్‌యూవీల కారణంగా హ్యుందాయ్ గత నెలలో మెరుగైన అమ్మకాలను సాధించగలిగింది.

హ్యుందాయ్ ఎస్‌యూవీలకు భారీ డిమాండ్.. జులైలో జోరందుకున్న సేల్స్..

మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండగా, మూడు ఇంజన్ ఆప్షన్లు మరియు బహుళ గేర్‌బాక్స్ ఆప్షన్లు కలిగిన హ్యుందాయ్ వెన్యూ సబ్-ఫోర్ మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో అమ్మకాల పరంగా ముందంజలో ఉంది. ఇక, తాజాగా వచ్చిన అల్కజార్ ఎస్‌యూవీ కూడా అమ్మకాల పరంగా అద్భతమైన ప్రదర్శనను కనబరుస్తోంది.

హ్యుందాయ్ ఎస్‌యూవీలకు భారీ డిమాండ్.. జులైలో జోరందుకున్న సేల్స్..

భారత మార్కెట్లో హ్యుందాయ్ అల్కజార్ ఎస్‌యూవీని ప్రెస్టీజ్, ప్రీమియం మరియు సిగ్నేచర్ అనే మూడు వేరియంట్లలో విక్రయిస్తున్నారు. ఈ కొత్త ఎస్‌యూవీ 6 సీట్లు లేదా 7 సీట్ల కాన్ఫిగరేషన్‌తో లభ్యమవుతుంది. దేశీయ విపణిలో హ్యుందాయ్ అల్కజార్ ఎస్‌యూవీ ధరలు రూ.16.30 లక్షల నుంచి రూ.20.14 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

హ్యుందాయ్ ఎస్‌యూవీలకు భారీ డిమాండ్.. జులైలో జోరందుకున్న సేల్స్..

ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, హ్యుందాయ్ అల్కజార్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 159 బిహెచ్‌పి పవర్‌ను మరియు 191 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి.

Most Read Articles

English summary
Hyundai india registers 46 percent sales growth in july 2021 sold 60249 units
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X