వారెవ్వా.. ఇది ఏం కారండి బాబు.. మైండ్ బ్లోయింగ్ అంతే

ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్లో రోజురోజుకి కొత్త కొత్త వాహనాలు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ కొరియన్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ (Hyundai) ఫ్యూచరిస్టిక్ కార్ల వైపు ఒక అడుగు ముందుకు వేస్తూ కొత్త కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ SUVని ఆవిష్కరించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కార్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

వారెవ్వా.. ఇది ఏం కారండి బాబు.. మైండ్ బ్లోయింగ్ అంతే

హ్యుందాయ్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా హ్యుందాయ్ ఐయోనిక్ (Hyundai Ioniq) పేరుతో ప్రపంచవ్యాప్తంగా విక్రయించబడుతుంది. కంపెనీ Ioniq 5 మరియు Ioniq 6 లతో పాటు విక్రయించబడే హ్యుందాయ్ Ioniq సిరీస్ లో Hyundai Ioniq 7 మూడవ కారు కానుంది. ఇది చూడతనికి చాలా ఆకర్షనీయంగా ఉండటమే కాకుండా ఆధునిక ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

వారెవ్వా.. ఇది ఏం కారండి బాబు.. మైండ్ బ్లోయింగ్ అంతే

Hyundai Ioniq 7 కారులో ఏడు మంది వ్యక్తులు కూర్చోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇతర హ్యుందాయ్ Ioniq కార్ల మాదిరిగానే, Ioniq 7 కూడా e-GMP ప్లాట్‌ఫారమ్‌పైన అభివృద్ధి చేయబడింది. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన మాడ్యులర్ మరియు ఫ్లెక్సిబుల్ ఆర్కిటెక్చర్. కావున అధునాతనంగా ఉంటుంది.

వారెవ్వా.. ఇది ఏం కారండి బాబు.. మైండ్ బ్లోయింగ్ అంతే

హ్యుందాయ్ ఐయోనిక్ 7 ఎలక్ట్రిక్ SUV హ్యుందాయ్ యొక్క డిజైనింగ్ నైపుణ్యాన్ని ఇక్కడ అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. ఈ కారులో పారామెట్రిక్ పిక్సెల్ లైటింగ్ ఉపయోగించబడింది. కారు ముందు భాగంలో ఎల్ఈడీ లైట్ బార్ అమర్చబడి ఉంటుంది. ఇది హుడ్ యొక్క ఒక చివర నుండి మరొక వైపుకు నడుస్తుంది. హుడ్ కింద ఎల్ఈడీ హెడ్‌లైట్ యూనిట్ ఉంటుంది. ఇది పారామెట్రిక్ ఎల్ఈడీ పిక్సెల్‌లను ఉపయోగిస్తుంది. కావున చాలా స్టైలిష్ గా ఉంటుంది.

వారెవ్వా.. ఇది ఏం కారండి బాబు.. మైండ్ బ్లోయింగ్ అంతే

హ్యుందాయ్ ఐయోనిక్ 7 ఎలక్ట్రిక్ SUVలో ప్రీమియం ఇంటీరియర్స్ ఇవ్వబడ్డాయి. దాని ఇంటీరియర్‌లోని అత్యంత అద్భుతమైన ఫీచర్ దాని ఇండ్యూజువల్ లాంజ్, ఇది గది లాంటి వాతావరణాన్ని అందిస్తుంది. కంపెనీ దాని అంతర్గత రూపకల్పనలో స్థిరమైన మరియు పర్యావరణ అనుకూల పదార్థాలను ఉపయోగించింది. కావున వాహన వినియోగదారులను అనుకూలంగా ఉంటుంది.

వారెవ్వా.. ఇది ఏం కారండి బాబు.. మైండ్ బ్లోయింగ్ అంతే

ప్రస్తుతం, కంపెనీ ఈ హ్యుందాయ్ ఐయోనిక్ 7 ఎలక్ట్రిక్ SUV యొక్క బ్యాటరీ మరియు పవర్ సమాచారాన్ని అధికారికంగా విడుదల చేయలేదు. ఈఅప్పటికీ ఇప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ హ్యుందాయ్ ఐయోనిక్ 7 ఎలక్ట్రిక్ SUV లో పెద్ద 100 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ఉపయోగించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో, ఇది 800-వోల్ట్ పవర్ సిస్టమ్‌తో కూడా అమర్చబడుతుందని ఆశిస్తున్నాము.

వారెవ్వా.. ఇది ఏం కారండి బాబు.. మైండ్ బ్లోయింగ్ అంతే

హ్యుందాయ్ ఐయోనిక్ 7 ఎలక్ట్రిక్ SUV ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 500 కి.మీల దూరం ప్రయాణించగలదఐ కంపెనీ తెలిపింది. ఇది Ioniq 5 లేదా Kia EV6 లో అందించబడిన అదే పవర్‌ట్రెయిన్‌ను అందించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నాము. Ioniq 5 ఎలక్ట్రిక్ SUV 225 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది అయితే Kia EV6 కారు 576 బిహెచ్‌పి పవర్ విడుదల చేస్తుంది. హ్యుందాయ్ ఐయోనిక్ 7 అటువంటి పనితీరు గణాంకాలతో వస్తే, అది అత్యంత సామర్థ్యం గల ఎలక్ట్రిక్ SUV కేటగిరీలో నిలబడుతుంది.

వారెవ్వా.. ఇది ఏం కారండి బాబు.. మైండ్ బ్లోయింగ్ అంతే

ఈ గణాంకాలతో, ఇది టెస్లా మోడల్ Y పనితీరు మరియు ఫోర్డ్ ముస్టాంగ్ మాక్-E GT పనితీరు కంటే కూడా మెరుగ్గా ఉంటుంది. ఏది ఏమైనా ఈ కొత్త హ్యుందాయ్ ఎలక్ట్రిక్ SUV మంచి పనితీరుకి అందిస్తుంది అని భావిస్తున్నాము. కావున ఇది మంచి ఆదరణ పొందే అవకాశం కూడా ఉంటుంది.

వారెవ్వా.. ఇది ఏం కారండి బాబు.. మైండ్ బ్లోయింగ్ అంతే

ఇదిలా ఉండగా హ్యుందాయ్ మోటార్ (Hyundai Motor) కంపెనీ కూడా ఎగిరే వాహనాల తయారీ దిశగా కూడా అడుగులు వేస్తోంది. హ్యుందాయ్ మోటార్ కంపెనీ భవిష్యత్ మొబిలిటీ విజన్‌ను కోసం, ఇటీవల సూపర్నల్ ఎల్‌ఎల్‌సి అనే కొత్త కంపెనీని ప్రారంభించింది, ఇది అర్బన్ ఎయిర్ మొబిలిటీ వాహనాలను అభివృద్ధి చేయాలనే కంపెనీ లక్ష్యం కోసం పని చేస్తుంది. హ్యుందాయ్ (Hyundai) తన భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా ఎగిరే వాహనాల అభివృద్ధి ప్రాజెక్టులపై తీవ్రంగా కృషి చేస్తోంది. హ్యుందాయ్ కంపెనీ ప్రారంభించనున్న ఈ ఫ్లైయింగ్ కార్ లో 5 సభ్యులు ప్రయాణించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

వారెవ్వా.. ఇది ఏం కారండి బాబు.. మైండ్ బ్లోయింగ్ అంతే

ఇందుకోసం హ్యుందాయ్ కంపెనీ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ పెట్టుబడిదారుల నుండి మద్దతు తీసుకుంటోంది. తన కొత్త కంపెనీ కింద, హ్యుందాయ్ 2028 లో మొదటి కమర్షియల్ ఫ్లయింగ్ వెహికల్‌ను విడుదల చేననున్నట్లు తెలిపింది. అయితే ఈ ఫ్లయింగ్ వెహికల్‌ 2030 నుంచి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది.

Most Read Articles

English summary
Hyundai ioniq 7 electric suv unveiled range features specifications details
Story first published: Friday, November 19, 2021, 13:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X