డీలర్ల వద్దకు హ్యుందాయ్ అల్కజార్ 7-సీటర్; విడుదలైన తక్షణమే డెలివరీలు!

హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ 'క్రెటా'ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఇందులో 'అల్కజార్' పేరుతో ఓ 7-సీటర్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. అతి త్వరలోనే ఈ కొత్త ఎస్‌యూవీ మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే కంపెనీ ఈ మోడల్‌ను డీలర్‌షిప్ స్టాక్ యార్డులకు తరలిస్తోంది.

డీలర్ల వద్దకు హ్యుందాయ్ అల్కజార్ 7-సీటర్; విడుదలైన తక్షణమే డెలివరీలు!

హ్యుందాయ్ అల్కజార్ విషయంలో, ఈ మోడల్‌ని మార్కెట్లోకి విడుదల చేసిన తక్షణమే డెలివరీలను ప్రారంభించే విధంగా, కంపెనీ గడచిన మే నెలలో 1,360 యూనిట్లను వివిధ డీలర్‌షిప్ కేంద్రాలకు రవాణా చేసినట్లు సమాచారం.

డీలర్ల వద్దకు హ్యుందాయ్ అల్కజార్ 7-సీటర్; విడుదలైన తక్షణమే డెలివరీలు!

వాస్తవానికి, హ్యుందాయ్ అల్కజార్ ఇప్పటికే మార్కెట్లోకి రావల్సి ఉంది. కానీ, దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ కారు విడుదల ఆలస్యమైంది. ప్రస్తుతం, కొత్త కోవిడ్ కేసులు తగ్గుతుండటం మరియు పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతుండటంతో, అల్కజార్ ఈ నెలలోనే మార్కెట్లో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

MOST READ:హోండా గ్రాజియా 125 స్కూటర్‌పై అదిరిపోయే ఆఫర్.. ఇప్పుడే కోనేయండి

డీలర్ల వద్దకు హ్యుందాయ్ అల్కజార్ 7-సీటర్; విడుదలైన తక్షణమే డెలివరీలు!

హ్యుందాయ్ అల్కాజార్ మొత్తం ఆరు వేరియంట్లలో లభ్యం కానుంది. అవి: సిగ్నేచర్, సిగ్నేచర్ (ఓ), ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ (ఓ) మరియు ప్లాటినం, ప్లాటినం (ఓ). కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి ఇది 6-సీటర్ లేదా 7-సీటర్ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంటుంది.

డీలర్ల వద్దకు హ్యుందాయ్ అల్కజార్ 7-సీటర్; విడుదలైన తక్షణమే డెలివరీలు!

ఈ ఎస్‌యూవీని మొత్తం ఆరు కలర్ ఆప్షన్లలో పరిచయం చేయనున్నారు. ఇందులో టైఫూన్ సిల్వర్, టైటాన్ గ్రే, టైగా బ్రౌన్, స్టార్రి నైట్, పోలార్ వైట్ మరియు ఫాంటమ్ బ్లాక్ ఉన్నాయి. కాగా, ఇంటీరియర్ మాత్రం ఒకే కలర్‌లో ఉంటుంది. కాగ్నాక్ బ్రౌన్ కలర్ ఆప్షన్ ఇంటీరియర్‌తో కంపెనీ ఈ ఎస్‌యూవీని అందించనుంది.

MOST READ:90 వసంతాలు పూర్తి చేసుకున్న భారతదేశపు మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ ట్రైన్, ఇదే

డీలర్ల వద్దకు హ్యుందాయ్ అల్కజార్ 7-సీటర్; విడుదలైన తక్షణమే డెలివరీలు!

ఇదివరకు చెప్పుకున్నట్లుగా, హ్యుందాయ్ అల్కాజార్ దాని డిజైన్ మరియు ఫీచర్లను హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీతో పంచుకుంటుంది. అయితే, అల్కాజార్‌లో కొన్ని చెప్పుకోదగిన మార్పులు ఉన్నాయి. క్రెటా వీల్‌బేస్ 2,610 మి.మీగా ఉంటే, అల్కజార్ వీల్‌బేస్ 2760 మి.మీగా ఉంటుంది. ఇందులో పెరిగిన 150 మి.మీ వీల్‌బేస్ కారణంగా, కారు లోపల మూడవ వరుస సీటింగ్‌ను చేర్చడం సాధ్యమైంది.

డీలర్ల వద్దకు హ్యుందాయ్ అల్కజార్ 7-సీటర్; విడుదలైన తక్షణమే డెలివరీలు!

హ్యుందాయ్ క్రెటా మాదిరిగానే హ్యుందాయ్ అల్కాజార్ కూడా వివిధ రకాల ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. ఇందులోని 2.0-లీటర్ 'ఎన్‌యు' ఫోర్-సిలిండర్ డిఓహెచ్‌సి పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 157 బిహెచ్‌పి శక్తిని మరియు 192 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:ఇకపై హెల్మెట్స్ వినియోగంపై కొత్త రూల్స్.. అవేంటో ఇక్కడ చూడండి

డీలర్ల వద్దకు హ్యుందాయ్ అల్కజార్ 7-సీటర్; విడుదలైన తక్షణమే డెలివరీలు!

అలాగే, ఈ కారులో ఉపయోగించబోయే 1.5-లీటర్ ఫోర్ సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 115 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానున్నాయి.

డీలర్ల వద్దకు హ్యుందాయ్ అల్కజార్ 7-సీటర్; విడుదలైన తక్షణమే డెలివరీలు!

హ్యుందాయ్ అల్కజార్ ఎక్స్టీరియర్ ఫీచర్లను గమనిస్తే, ఇందులో క్యాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్, ఆల్-ఎల్ఈడి లైటింగ్, లాంగ్ రియర్ ఓవర్‌హాంగ్, వెనుక భాగంలో క్వార్టర్ గ్లాస్, 18 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ రూఫ్ రైల్స్ మరియు ఆల్‌రౌండ్ బాడీ క్లాడింగ్ మొదలైనవి ఉన్నాయి.

MOST READ:దిశా పటాని & టైగర్ ష్రాఫ్‌పై ఎఫ్‌ఐఆర్‌ బుక్ చేసిన ముంబై పోలీసులు.. కారణం ఇదే

డీలర్ల వద్దకు హ్యుందాయ్ అల్కజార్ 7-సీటర్; విడుదలైన తక్షణమే డెలివరీలు!

అలాగే, ఇంటీరియర్స్‌లో పెద్ద టచ్‌స్క్రీన్ 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో పాటు హ్యుందాయ్ యొక్క లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మొదలైన ఫీచర్లు మరెన్నో ఉన్నాయి.

డీలర్ల వద్దకు హ్యుందాయ్ అల్కజార్ 7-సీటర్; విడుదలైన తక్షణమే డెలివరీలు!

ఇంకా ఇందులో క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, పనోరమిక్ సన్‌రూఫ్, ఇంజన్ స్టార్ట్ / స్టాప్ బటన్, పెద్ద ఎమ్ఐడి డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆరు ఎయిర్‌బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్‌లు మొదలైన స్మార్ట్ ఫీచర్లు కూడా ఉండనున్నాయి.

డీలర్ల వద్దకు హ్యుందాయ్ అల్కజార్ 7-సీటర్; విడుదలైన తక్షణమే డెలివరీలు!

మార్కెట్లో హ్యుందాయ్ అల్కజార్ ధర సుమారు రూ.11 లక్షల నుంచి రూ.19 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా. ఇది ఈ విభాగంలో టాటా సఫారి, ఎమ్‌జి హెక్టర్ ప్లస్, మహీంద్రా ఎక్స్‌యూవీ500 మరియు రాబోయే జీప్ కమాండర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Source: Autopunditz

Most Read Articles

English summary
Hyundai Motor India Dispatched 1,360 Alcazar SUVs In May 2021, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X