హ్యుందాయ్ క్రెటా రికార్డ్: భారత రోడ్లపై 5 లక్షల మంది హ్యాపీ కస్టమర్స్!

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ "హ్యుందాయ్ క్రెటా" అమ్మకాల పరంగా దూసుకుపోతోంది. ఈ విభాగంలోకి ఎన్ని కొత్త మోడళ్లు వచ్చినా, క్రెటానే కస్టమర్ల ఫస్ట్ ఛాయిస్‌గా ఉంటోంది. తాజాగా హ్యుందాయ్ క్రెటా మరో అరుదైన మైలురాయిని చేరుకుంది.

హ్యుందాయ్ క్రెటా రికార్డ్: భారత రోడ్లపై 5 లక్షల మంది హ్యాపీ కస్టమర్స్!

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీని భారత మార్కెట్లో ప్రవేశపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకూ 5,00,000 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ ప్రకటించింది. ఐదేళ్ల క్రితం భారత మార్కెట్లోకి ప్రవేశించిన క్రెటా, ఇప్పుడు దేశవ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా హ్యాపీ కస్టమర్లను సంపాధించుకుందని కంపెనీ పేర్కొంది.

హ్యుందాయ్ క్రెటా రికార్డ్: భారత రోడ్లపై 5 లక్షల మంది హ్యాపీ కస్టమర్స్!

ఈ మేరకు హ్యుందాయ్ తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో 'ది లెగసీ ఆఫ్ క్రెటా' పేరుతో ఓ ఆసక్తికరమైన వీడియోని కూడా విడుదల చేసింది. ఇందులో వివిధ కస్టమర్లు తమ క్రెటాతో తీసియో వీడియో బైట్‌లు కంపెనీతో పంచుకున్నారు. ఆ వీడియోలన్నింటినీ కలిపి హ్యుందాయ్ అద్భుతమైన వీడియోని తయారు చేసింది.

MOST READ:అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్ ఉపయోగించే 'దెయ్యం' కారు గురించి తెలుసా?

హ్యుందాయ్ క్రెటా రికార్డ్: భారత రోడ్లపై 5 లక్షల మంది హ్యాపీ కస్టమర్స్!

హ్యుందాయ్ గతేడాది ఆరంభంలో అప్‌గ్రేడెడ్ 2020 క్రెటా ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీ మునుపటి కంటే అత్యధికంగా అమ్ముడవుతోంది. దేశంలో కోవిడ్-19 వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ మోడల్ కస్టమర్లను ఆకర్షించడంలో విజయం సాధించింది.

హ్యుందాయ్ క్రెటా రికార్డ్: భారత రోడ్లపై 5 లక్షల మంది హ్యాపీ కస్టమర్స్!

ఈ కొత్త (2020) మోడల్ మార్కెట్లో విడుదలైన అతికొద్ది సమయంలోనే 65,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లను దక్కించుకుంది. ఏప్రిల్ - జూలై 2020 మధ్య కాలంలో 34,212 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. మార్కెట్లో ఎమ్‌జి హెక్టర్, కియా సెల్టోస్ వంటి మోడళ్లు వచ్చినప్పటికీ, పోటీలో నిలదొక్కుకుంది.

MOST READ:బైక్ మ్యూజియంలో అగ్నికి ఆహుతైన అరుదైన వాహనాలు

హ్యుందాయ్ క్రెటా రికార్డ్: భారత రోడ్లపై 5 లక్షల మంది హ్యాపీ కస్టమర్స్!

కొత్త 2020 హ్యుందాయ్ క్రెటా విభిన్న ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో కొత్త 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లు ఒకేరకంగా 115 బిహెచ్‌పి శక్తిని మరియు 144 ఎన్ఎమ్ (పెట్రోల్) మరియు 250 ఎన్ఎమ్‌ల (డీజిల్) గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

హ్యుందాయ్ క్రెటా టాప్-ఎండ్ వేరియంట్లలో 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 140 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ మూడు ఇంజన్లు స్టాండర్డ్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి.

MOST READ:బువ్వ తిను, బుల్లెట్ బైక్ పట్టుకెళ్లు: రాయల్ ఎన్‌ఫీల్డ్ 'బుల్లెట్' థాలి ఛాలెంజ్

హ్యుందాయ్ క్రెటా రికార్డ్: భారత రోడ్లపై 5 లక్షల మంది హ్యాపీ కస్టమర్స్!

ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కావాలనుకునే వారికి కూడా ఇందులో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ సివిటి, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ టార్క్-కన్వర్టర్ మరియు 1.4-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

హ్యుందాయ్ క్రెటా రికార్డ్: భారత రోడ్లపై 5 లక్షల మంది హ్యాపీ కస్టమర్స్!

కొత్త హ్యుందాయ్ క్రెటాలో స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, 7-ఇంచ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హ్యుందాయ్ అఫీషియల్ బ్లూ-లింక్ కనెక్టివిటీ టెక్నాలజీతో పాటుగా యాపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లను సపోర్ట్ చేసే 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:వామ్మో.. ఆరుగురు పర్యాటకులున్న కారుని నోటితో లాగేసిన పులి [వీడియో]

హ్యుందాయ్ క్రెటా రికార్డ్: భారత రోడ్లపై 5 లక్షల మంది హ్యాపీ కస్టమర్స్!

అంతేకాకుండా, ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, పానోరమిక్ సన్‌రూఫ్, ఆంబియెంట్ లైటింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ఎబిఎస్ విత్ ఇబిడి, ప్యాడల్ షిఫ్టర్స్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, రియర్ పార్కింగ్ కెమెరా మరియు సెన్సార్లు, హిల్-స్టార్ట్ అసిస్ట్, హిల్-డీసెంట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి అధునాతన సాంకేతిక మరియు సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటా రికార్డ్: భారత రోడ్లపై 5 లక్షల మంది హ్యాపీ కస్టమర్స్!

హ్యుందాయ్ ఇండియా ప్రస్తుతం భారత్‌లో తన ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోలో వెన్యూ, క్రెటా, టూసాన్ మరియు కోనా ఎలక్ట్రిక్ వాహనాలను కలిగి ఉంది. కాగా, హ్యుందాయ్ క్రెటా ఈ విభాగంలో కియా సెల్టోస్, ఎమ్‌జి హెక్టర్, టాటా హారియర్, జీప్ కంపాస్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Hyundai Sold 5,00,000 Creta SUVs Since Its Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X