హవ్వ..! ఇంత ఖరీదైన కారుకి జీరో స్టార్ సేఫ్టీ రేటింగా..? ఇక దీనిని ఎవరైనా కొంటారా?

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తయారు చేస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ 'హ్యుందాయ్ టక్సన్' (Hyundai Tucson) దాని అధిక ధర కారణంగా భారతదేశంలో అంత ప్రాచుర్యం పొందలేదు కానీ, ఈ మోడల్ కు అంతర్జాతీయ మార్కెట్లలో మంచి ప్రజాదరణే ఉంది. అయితే, ఇంతటి ఖరీదైన మరియు స్టైలిష్ హ్యుందాయ్ ఎస్‌యూవీ గురించి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. హ్యుందాయ్ టక్సన్ కోసం 2021 లాటిన్ ఎన్‌క్యాప్ (Latin NCAP) నిర్వహించిన క్రాష్ టెస్టులో 0-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను దక్కించుంది.

హవ్వ..! ఇంత ఖరీదైన కారుకి జీరో స్టార్ సేఫ్టీ రేటింగా..? ఇక దీనిని ఎవరైనా కొంటారా?

హ్యుందాయ్ యొక్క అత్యంత ప్రసిద్ధ కార్ మోడళ్లలో టక్సన్ ఎస్‌యూవీ కూడా ఒకటి. భారత మార్కెట్లో ఇది అత్యంత ఖరీదైన హ్యుందాయ్ ఎస్‌యూవీ. హ్యుందాయ్ ఈ కారును ప్రపంచంలోని అనేక దేశాల్లో విక్రయిస్తోంది. తాజాగా, ఈ ఎస్‌యూవీ కోసం లాటిన్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (Latin NCAP) నిర్వహించిన క్రాష్ టెస్టులో 0-స్టార్ (జీరో స్టార్) సేఫ్టీ రేటింగ్ పొందినట్లు టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది.

హవ్వ..! ఇంత ఖరీదైన కారుకి జీరో స్టార్ సేఫ్టీ రేటింగా..? ఇక దీనిని ఎవరైనా కొంటారా?

టక్సన్ ఎస్‌యూవీ యొక్క భద్రతా సామర్థ్యాల గురించి తెలుసుకోవడానికి లాటిన్ ఎన్‌క్యాప్ ఈ కారును ఘర్షణ పరీక్ష (క్రాష్ టెస్ట్)కు గురి చేసింది. ఈ అధ్యయనంలో హ్యుందాయ్ టక్సన్ ప్రయాణీకుల సేఫ్టీలో పూర్తిగా విఫలమైనట్లు తేలింది. హ్యుందాయ్ నుండి అత్యంత ఖరీదైన మరియు పాపులర్ అయిన ఈ కారు జీరో స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందడం అందరినీ షాక్‌కు గురిచేసింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇదే టక్సన్ ఎస్‌యూవీ కోసం యూరో ఎన్‌క్యాప్ (Euro NCAP) నిర్వహించిన క్రాష్ టెస్టులో దీనికి 5-స్టార్ (ఫైవ్ స్టార్) సేఫ్టీ రేటింగ్ లభించింది.

హవ్వ..! ఇంత ఖరీదైన కారుకి జీరో స్టార్ సేఫ్టీ రేటింగా..? ఇక దీనిని ఎవరైనా కొంటారా?

ఈ రెండు టెస్టింగ్ ఏజెన్సీలు విడుదల చేసిన ఫలితాలు ఇప్పుడు హ్యుందాయ్ టక్సన్ వినియోగదారులను మరియు కొత్తగా ఈ కారును కొనుగోలు చేయాలనుకునే వారికిని గందరగోళంలో పడేస్తున్నాయి. యూరో ఎన్‌సిఎపి క్రాష్ టెస్టులో ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన టక్సన్, లాటిన్ ఎన్‌సిఎపి నిర్వహించిన క్రాష్ టెస్టులో జీరో స్టార్‌లను ఎలా పొందిందనే దానిపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. మరి ఇదెలా జరిగిందో తెలుసుకనే ప్రయత్నం చేద్దాం రండి.

హవ్వ..! ఇంత ఖరీదైన కారుకి జీరో స్టార్ సేఫ్టీ రేటింగా..? ఇక దీనిని ఎవరైనా కొంటారా?

వాస్తవానికి, యూరో ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ చేసిన హ్యుందాయ్ టక్సన్ మోడల్ పూర్తిగా కొత్త తరానికి చెందినది, ఇది ఇంకా మార్కెట్లలో వినియోగదారులకు అందుబాటులోకి రాలేదు. కాగా, లాటిన్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ నిర్వహించిన హ్యుందాయ్ టక్సన్ ప్రస్తుత తరానికి చెందిన 2021 మోడల్, ఇది భారతదేశం సహా పలు ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. తాజా నివేదికల ప్రకారం, కొత్త తరం (ఫైవ్-స్టార్) టక్సన్‌ను వివిధ మార్కెట్లలో విక్రయించడానికి కంపెనీకి మరికొన్ని సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది.

హవ్వ..! ఇంత ఖరీదైన కారుకి జీరో స్టార్ సేఫ్టీ రేటింగా..? ఇక దీనిని ఎవరైనా కొంటారా?

లాటిన్ అమెరికా మార్కెట్లో కోసం ఈ కొత్త తరం టక్సన్ ఎస్‌యూవీ అందుబాటులోకి రావడానికి కనీసం రెండు సంవత్సరాల సమయం పడుతుందని హ్యుందాయ్ అధికారిక ప్రతినిధులు ధృవీకరించడంతో ఫిబ్రవరి 2021లో తయారు చేయబడిన హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యూవీని క్రాష్ టెస్ట్ కోసం ఉపయోగించినట్లు లాటిన్ ఎన్‌క్యాప్ వెల్లడించింది. లాటిన్ ఎన్‌క్యాప్ నిర్విహంచిన 2021 మోడల్ హ్యుందాయ్ టక్సన్ ఫ్రంటల్ క్రాష్ టెస్ట్ లో ప్రయాణీకుల ఛాతీ ప్రాంతం, తల మరియు మెడ భాగాలలో మంచి రక్షణ లభించినట్లు ఏజెన్సీ తెలిపింది.

ఫ్రంటల్ ఇంపాక్ట్ టెస్ట్‌ కోసం ఉపయోగించిన హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యూవీలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు మరియు ఫ్రంట్ కంపార్ట్‌మెంట్ కోసం బెల్ట్ ప్రిటెన్షనర్‌లు స్టాండర్డ్ ఫిట్‌మెంట్‌లుగా అమర్చబడి ఉన్నాయి. అయినప్పటికీ, ఈ క్రాష్ టెస్టులో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతినింది. ఈ క్రాష్ టెస్టుకు సంబంధించిన పూర్తి ఫలితాలను లాటిన్ ఎన్‌క్యాప్ త్వరలోనే అధికారికంగా వెల్లడి చేయనుంది.

హవ్వ..! ఇంత ఖరీదైన కారుకి జీరో స్టార్ సేఫ్టీ రేటింగా..? ఇక దీనిని ఎవరైనా కొంటారా?

ఇదిలా ఉంటే, హ్యుందాయ్ తమ కొత్త తరం టక్సన్ ఎస్‌యూవీని వచ్చే ఏడాది ఆరంభంలో పలు అంతర్జాతీయ మార్కెట్‌లలో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికితోడు, పాత టక్సన్ మోడల్ విషయంలో వచ్చిన జీరో స్టార్ ఫలితాల కారణంగా, ఇప్పుడు ఈ కొత్త తరం ఎస్‌యూవీ రాక మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది. జీరో స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన పాత తరం టక్సన్ ఎస్‌యూవీ భారతదేశంలో కూడా అమ్మకానికి అందుబాటులో ఉంది. మార్కెట్లో దీని ధర సుమారు రూ. 22.69 లక్షల నుండి రూ. 27.47 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో అందుబాటులో ఉంటుంది.

హవ్వ..! ఇంత ఖరీదైన కారుకి జీరో స్టార్ సేఫ్టీ రేటింగా..? ఇక దీనిని ఎవరైనా కొంటారా?

కొత్త తరం హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, ఇందులో ప్రయాణీకుల భద్రత కోసం, బహుళ ఎయిర్‌బ్యాగ్‌లు, లేన్ కీప్ అసిస్ట్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్ మరియు బ్లైండ్ స్పాట్ మానిటర్ వంటి అధునాతన డ్రైవర్ అసిస్ట్‌ సిస్టమ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. హ్యుందాయ్ టక్సన్ యొక్క కొత్త తరం మోడల్‌ను వచ్చే ఏడాది మధ్య నాటికి భారతదేశానికి తీసుకువచ్చే అవకాశం ఉంది. ధర పరంగా చూస్తే, దాని పాత మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త తరం మోడల్ ధరలో స్వల్ప పెరుగుదల ఉంటుందని అంచనా. లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ను గమనిస్తూ ఉండండి..!

Most Read Articles

English summary
Hyundai tucson 2021 model scores 0 star safety rating in latin ncap crash test details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X