Just In
Don't Miss
- Movies
అఖిల్‌కు భారీ షాకిచ్చిన మోనాల్: తన అసలు లవర్ పేరు చెప్పి ఎమోషనల్.. మొత్తం రివీల్ చేసింది!
- Lifestyle
ప్రతి రాశిచక్రం వారి చింతలను ఎలా నిర్వహించాలో తెలుసా? భాదల నుండి ఇలా భయటపడాలి
- Sports
Brisbane Test: పాపం శుభమన్ గిల్.. తృటిలో సెంచరీ మిస్!!
- Finance
మారుతీ సుజుకీ కార్ల ధరల షాక్, కార్లపై రూ.34,000 వరకు పెంపు
- News
నెల్లూరు ఎస్పీపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న బూతుపురాణం- అట్రాసిటీ కేసు పెట్టలేదని- తీవ్రవ్యాఖ్యలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ మోటార్ ఇండియా, భారత మార్కెట్లో తయారు చేసిన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయటానికి కొత్త మార్గాన్ని ఎంచుకుంది. కార్ల ఎగుమతుల కోసం ఇప్పటివరకూ నౌకలను ఆశ్రయించిన హ్యుందాయ్, తొలిసారిగా రైలు మార్గం ద్వారా భారత్‌లో తయారైన తమ వాహనాలను విదేశాలకు ఎగుమతి చేస్తోంది.

హ్యుందాయ్‌కి చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్‌లో వాహన ఉత్పాదక కేంద్రం ఉంది. ఈ ప్లాంట్‌లో తయారైన హ్యుందాయ్ కార్లను కంపెనీ దేశంలోని అన్ని మూలలకు ఎగుమతి చేస్తుంది. కేవలం దేశంలోనే కాకుండా, పొరుగు దేశాలు మరియు వివిధ అంతర్జాతీయ మార్కెట్లకు కూడా తమ వాహనాలను ఎగుమతి చేస్తుంది.

తాజాగా మన పొరుగు దేశమైన నేపాల్‌కు హ్యుందాయ్ తమ కార్లను ఎగుమతి చేయటానికి రైలు మార్గాన్ని ఎంచుకుంది. ఈ దేశానికి ఇప్పటి వరకూ రోడ్డు మార్గం ద్వారా తమ కార్లను ఎగుమతి చేసిన హ్యుందాయ్, తొలిసారిగా దక్షిణ మధ్య రైల్వే సేవలను ఉపయోగించి తమ వాహనాలను ఎగుమతి చేయడం ప్రారంభించింది.

హ్యుందాయ్ తొలిసారిగా తమ కార్లను రైలు మార్గం ద్వారా నేపాల్ దేశానికి ఎగుమతి చేసి చరిత్ర సృష్టించింది. మొదటిసారిగా 125 హ్యుందాయ్ కార్లను కంపెనీ నేపాల్‌కు ఎగుమతి చేసింది. రైలు మార్గం ద్వారా ఈ కార్లు నేపాల్ చేరుకోవటానికి సుమారు 5 రోజుల సమయం పడుతుందని అంచనా.

హ్యుందాయ్ కార్ల తయారీ విభాగం డైరెక్టర్ గణేష్ మణి మరియు సదరన్ రైల్వే అదనపు మేనేజర్ ఎస్ సుబ్రమణ్యంలు పచ్చ జెండా ఊపి రైలును ప్రారంభించారు.

హ్యుందాయ్ కార్లను మొదట ఇరుంకట్టుకోట్టై నుండి వాలాజాబాద్ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి, అక్కడి నుండి రైలులో నేపాల్‌కు తీసుకువెళ్తారు. ఈ రైలు నేపాల్‌లోని సోనౌలీ వద్ద ఆగుతుంది. అక్కడే కార్లను అన్లోడ్ చేస్తారు. అక్కడి నుండి నేపాల్ దేశంలోని అన్ని ప్రాంతాలకు వీటిని పంపిణీ చేస్తారు.

రోడ్డు మార్గంతో పోల్చుకుంటే రైలు మార్గం ద్వారా కార్లను ఎగుమతి చేయటం ద్వారా డబ్బు, సమయం రెండూ ఆదా అవుతాయని హ్యుందాయ్ పేర్కొంది. రైలు మార్గం ద్వారా కేవలం 5 రోజుల లోపే ఈ షిప్మెంట్ నేపాల్‌కు చేరుతుందని, రైలు మార్గం ద్వారా రవాణా చేయటం వలన పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని హ్యుందాయ్ తెలిపింది.

హ్యుందాయ్ మోటార్ ఇండియా, భారతదేశంలో తయారు చేసిన తమ కార్లను ఇక్కడి నుండి 88 దేశాలకు ఎగుమతి చేస్తోంది. కంపెనీ ఇటీవలే భారత్ నుండి 3 మిలియన్ కార్ల ఎగుమతి చేసి, ఎగుమతుల్లో సరికొత్త మైలురాయిని కూడా చేరుకుంది.

5 నిమిషాల చార్జ్‌తో 100 కిలోమీటర్లు ప్రయాణించే హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కార్ 'అయానిక్ 5'
హ్యుందాయ్ బ్రాండ్‌కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, ఈ కొరియన్ కార్ బ్రాండ్ తాజాగా మరో సరికొత్త ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు 'హ్యుందాయ్ అయానిక్ 5' పేరుతో కంపెనీ ఓ కొత్త ఎలక్ట్రిక్ సియూవీ టీజర్‌ను కూడా ఆవిష్కరించింది.

హ్యుందాయ్ అయానిక్ 5 ఈ బ్రాండ్ నుండి వస్తున్న రెండవ ఆల్-ఎలక్ట్రిక్ కారు. ఈ కారు కేవలం 5 నిమిషాల చార్జ్‌తోనే 100 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ తమ టీజర్ వీడియోలో పేర్కొంది. - ఈ కారుకి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.