Just In
- 9 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 19 hrs ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 22 hrs ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 23 hrs ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
మోదీ దుకాణంలో మందులు అగ్గువ -శానిటరీ ప్యాడ్ రూ.2.50కే: ప్రధాని; 7500వ జన ఔషధి కేంద్రం ప్రారంభం
- Movies
రాజీవ్ కనకాల మా నాన్న.. చైల్డ్ ఆర్టిస్ట్ మాటలకు సుమ షాక్
- Sports
ఐపీఎల్ 2021 షెడ్యూల్ వచ్చేసింది.. వేదికల్లో హైదరాబాద్‌కు దక్కని చోటు !
- Finance
ట్విట్టర్ సీఈవో 15 ఏళ్ల క్రితం తొలి ట్వీట్‌కు రూ.కోట్లు
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
దేశంలోనే అతిపెద్ద మల్టీ-బ్రాండ్ కార్ సర్వీస్ సెంటర్‌ను ఓపెన్ చేసిన బాష్
ప్రముఖ ఆటోమోటివ్ ఉపకరణాల తయారీ సంస్థ బాష్ ఆటోమోటివ్ ఆఫ్టర్ మార్కెట్, హర్యానాలోని పంచకులాలో భారతదేశపు అతిపెద్ద మల్టీ-బ్రాండ్ కార్ సర్వీస్ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. భారతదేశంలో తమ బ్రాండ్ యొక్క వర్క్‌షాప్ చైన్ నెట్వర్క్ విస్తరణ డ్రైవ్‌లో భాగంగా ఈ కొత్త సర్వీస్ కేంద్రాన్ని ప్రారంభించింది.

ప్రస్తుతం, భాష్కు భారతదేశ వ్యాప్తంగా 250కి పైగా సేవా కేంద్రాల (సర్వీస్ సెంటర్లను) కలిగి ఉంది. స్పీడ్ లింక్స్ కంపెనీతో భాగస్వామ్యంగా ఏర్పడి బాష్ ఆటోమోటివ్ ఈ మల్టీ-బ్రాండ్ సర్వీస్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.
బాష్ ప్రపంచంలోనే అతిపెద్ద వర్క్‌షాప్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఈ బ్రాండ్ 150 కి పైగా దేశాల్లో 15,000 లకు పైగా వర్క్‌షాప్‌లను కలిగి ఉంది. ఆటోమొబైల్ విడిభాగాల తయారీలోనే కాకుండా గృహోపకరణాల తయారీలో కూడా బాష్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన బ్రాండ్‌గా నిలిచిన సంగతి తెలిసినదే.

బాష్ పేర్కొన్న ప్రకటన ప్రకారం, ఈ కొత్త వర్క్‌షాప్‌ను ఎంతో వ్యూహాత్మకంగా పంచకులలోని ఆటోమోటివ్ హబ్‌లో ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో అనేక ఇతర కార్ డీలర్‌షిప్‌లకు చెందిన వర్క్‌షాప్‌లు కూడా ఉన్నాయి. ఈ కొత్త బాష్ కార్ సర్వీస్ అవుట్లెట్ ప్రక్కనే ఉన్న చండీగడ్ మరియు మొహాలి నగరాల్లోని వినియోగదారుల అవసరాలను కూడా తీరుస్తుంది.
MOST READ:కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు

ఈ కొత్త వర్క్‌షాప్‌ను సుమారు 36,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఈ సర్వీస్ సెంటర్లో కారు బ్రాండ్‌తో సంబంధం లేకుండా అన్ని బ్రాండ్ల వాహనాలకు సర్వీస్ అందిస్తారు. ఇక్కడ సర్వీసింగ్ కోసం 40 కి పైగా బేలను ఏర్పాటు చేశారు.
ఈ వర్క్‌షాప్‌లలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు మరియు సరికొత్త బాష్ డయాగ్నొస్టిక్ పరికరాలు కూడా ఉన్నాయి. వాహన నిర్ధారణ కోసం ఈఎస్ఐ సాఫ్ట్‌వేర్‌తో ఈసియూ డయాగ్నొస్టిక్ స్కానర్ కూడా ఇక్కడ ఉంది. ఈ వర్క్‌షాప్‌లో 28 మంది మ్యాన్‌పవర్ సామర్థ్యంతో, రోజుకు 45 కి పైగా కార్లను సర్వీస్ చేసే సామర్థ్యం ఉంది.

వాహన సర్వీస్ మరియు మరమ్మత్తులను చేసే టెక్నీషియన్లు మంచి శిక్షణ పొందిన ప్రొఫెషనల్స్‌గా ఉంటారని కంపెనీ పేర్కొంది. ఈ వర్క్‌షాప్ అందించే సేవలలో రెగ్యులర్ మెయింటినెన్స్, ఈసియు డయాగ్నస్టిక్స్, బ్రేక్ సర్వీస్, క్లచ్ ఓవర్‌హాల్, సస్పెన్షన్ సిస్టమ్, ఏసి డయాగ్నస్టిక్స్ అండ్ సర్వీస్ మొదలైనవి ఉన్నాయి.
MOST READ:ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎవరో తెలుసా!

అంతేకాకుండా, టోటల్ రిపేర్స్, బాడీ రిపేర్స్ మరియు పెయింటింగ్, వీల్ బ్యాలెన్సింగ్, టైర్ సర్వీస్, కార్ వాష్ మరియు కార్ డీటేలింగ్కు సంబంధించిన సేవలు కూడా ఉన్నాయి. వీటికి అదనంగా, వర్క్‌షాప్‌లో రోడ్-సైడ్ అసిస్టెన్స్, పిక్ మరియు డ్రాప్ సేవలు, బాడీ షాపులో నగదు రహిత భీమా రిపేర్, ఇన్సూరెన్స్ రెన్యువల్ మరియు యాన్యువల్ సర్వీస్ మెయింటినెన్స్ ప్లాన్ వంటి ఇతర వ్యాల్యూ యాడెడ్ సేవలను కూడా కంపెనీ అందిస్తుంది.

ఈ సర్వీస్ సెంటర్లో అధిక సంఖ్యలో ఉన్న బేల కారణంగా వినియోగదారులు తక్షణమే తమ కారును సర్వీస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. బాష్ దేశంలో తయారయ్యే చాలా వాహనాల కోసం వివిధ రకాల విడి భాగాలను కూడా తయారు చేస్తున్న విషయం తెలిసినదే.
కాబట్టి, వాహన మరమ్మతులు చేసేటప్పుడు లేదా వాహనాలకు జనరల్ సర్వీస్ చేసేటప్పుడు ఏదైనా పార్ట్ అవసరమైతే అది బాష్ వద్ద అందుబాటులో ఉంటుంది. ఫలితంగా ఓఈఎమ్ విడిభాగాలను సోర్సింగ్ చేయడంలో ఎదురయ్యే జాప్యాన్ని కూడా నివారించే అవకాశం ఉంటుంది.
MOST READ:కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!