టాటా మోటార్స్ ఒక్క కారు తయారీపై మారుతి సుజుకి కన్నా ఎక్కువ లాభం పొందుతుందా? అదెలా?

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో టాటా మోటార్స్ (Tata Motors) సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కాదు. పూర్తిగా స్వదేశీయ కంపెనీ అయిన టాటా మోటార్స్, ఇండికా కారుతో భారతదేశంలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఈ కంపెనీ తన విజయ యాత్ర కొనసాగిస్తూనే ఉంది. అయితే, ఈ ప్రయాణంలో కంపెనీ కొన్ని రకాల ఒడిదుడుకులను ఎదుర్కున్న సంగతి తెలిసినదే. కానీ, ఇప్పుడు మాత్రం టాటా అత్యంత డిమాండ్ ఉన్న కార్ బ్రాండ్‌లలో ఒకటిగా అవతరించింది.

టాటా మోటార్స్ ఒక్క కారు తయారీపై మారుతి సుజుకి కన్నా ఎక్కువ లాభం పొందుతుందా? అదెలా?

టాటా మోటార్స్ తమ కార్లను పూర్తిగా రీడిజైన్ చేసింది, కస్టమర్లల కొత్త విశ్వాసాన్ని పొందింది. ప్రస్తుతం భారతదేశంలో టాటా మోటార్స్ విక్రయిస్తున్న చాలా కార్లు 2016 సంవత్సరం తర్వాత పరిచయం చేయబడినవే. ఈ కార్లకు దాదాపు 5 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటికీ, కొత్త తరం నవీకరణలతో టాటా వీటిని ఎప్పటికప్పుడు రిఫ్రెష్‌గా ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. గత 2016 కి ముందు విక్రయించిన అన్ని మోడళ్లను కంపెనీ ఇప్పటికే పూర్తిగా నిలిపివేసింది.

టాటా మోటార్స్ ఒక్క కారు తయారీపై మారుతి సుజుకి కన్నా ఎక్కువ లాభం పొందుతుందా? అదెలా?

టాటా మోటార్స్ 2016 తర్వాత ప్రవేశపెట్టిన మోడళ్లలో టిగోర్, నెక్సాన్, హారియర్, సఫారి మరియు పంచ్ మోడళ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటి విభాగాల్లో ఉన్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కుంటూ, అత్యధికంగా అమ్ముడవుతున్న ఫ్లాగ్‌షిప్ మోడళ్లుగా నిలిచాయి. మోడ్రన్ డిజైన్, లేటెస్ట్ టెక్ ఫీచర్లతో పాటుగా అత్యంత సురక్షితమైన కార్లను టాటా మోటార్స్ అందిస్తోంది.

టాటా మోటార్స్ ఒక్క కారు తయారీపై మారుతి సుజుకి కన్నా ఎక్కువ లాభం పొందుతుందా? అదెలా?

ప్రధానంగా, కార్ల సేఫ్టీ విషయంలో టాటా మోటార్స్ ప్రత్యేక దృష్టి సారించింది. నాణ్యమైన వస్తువులు మరియు అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్లను ఉపయోగించి టాటా తమ కార్లను తయారు చేస్తోంది. అందుకే, గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో టాటా నెక్సాన్, అల్ట్రోజ్ మరియు పంచ్ వంటి కార్లు పూర్తి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకున్నాయి. ఈ సేఫ్టీ రేటింగ్ కారణంగా, కంపెనీ ఇప్పుడు కొత్త కస్టమర్లను ఆకర్షించగలుగుతోంది.

టాటా మోటార్స్ ఒక్క కారు తయారీపై మారుతి సుజుకి కన్నా ఎక్కువ లాభం పొందుతుందా? అదెలా?

సరే ఇదంతా అటుంచితే, ఈటి ఆటో లో పేర్కొన్న ఓ నివేదిక ప్రకారం, టాటా మోటార్స్ ఒక్క కారుపై ప్రస్తుతం భారతీయ ఆటోమొబైల్ కంపెనీలలో అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకి కంటే రెట్టింపు లాభాన్ని ఆర్జిస్తున్నట్లు తెలిసింది. టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22 రెండవ త్రైమాసికంలో విక్రయించిన ఒక్కో కారుపై సుమారు రూ. 45,810 లాభాన్ని ఆర్జించిందని, మారుతి సుజుకితో పోలిస్తే ఇది రెట్టింపు అని ఆ నివేదిక పేర్కొంది.

టాటా మోటార్స్ ఒక్క కారు తయారీపై మారుతి సుజుకి కన్నా ఎక్కువ లాభం పొందుతుందా? అదెలా?

భారతదేశపు అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ (మారుతి సుజుకి) కంటే టాటా మోటార్స్ ఒక్క కారు నుండి ఎక్కువ ఆదాయాన్ని పొందడం గత 10 సంవత్సరాలలో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో టాటా మోటార్స్ ప్యాసింజర్ కార్ ఆపరేటింగ్ సెగ్మెంట్ 5.2 శాతం పెరిగింది. మరోవైపు, మారుతికి ఇది 4.2 శాతం తగ్గింది.

టాటా మోటార్స్ ఒక్క కారు తయారీపై మారుతి సుజుకి కన్నా ఎక్కువ లాభం పొందుతుందా? అదెలా?

గత సెప్టెంబర్‌తో పోలిస్తే టాటా మోటార్స్ ప్యాసింజర్ కార్ల వ్యాపారం యొక్క నిర్వహణ లాభం మారుతి సుజుకి కంటే 45 శాతం పెరిగింది. అయితే, 2021-22 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మారుతి సుజుకీ విక్రయించిన మొత్తం కార్లలో 22 శాతం మాత్రమే టాటా మోటార్స్ విక్రయించింది. అంటే, టాటా మోటార్స్ తక్కువ సంఖ్యలో కార్లను విక్రయిస్తున్నప్పటికీ, లాభాల విషయంలో మాత్రం మారుతి సుజుకి కంటే ఓ మెట్టు ఎక్కువలోనే ఉందన్నమాట.

టాటా మోటార్స్ ఒక్క కారు తయారీపై మారుతి సుజుకి కన్నా ఎక్కువ లాభం పొందుతుందా? అదెలా?

లాభాలు మరియు అమ్మకాల పరిమాణం పెరుగుదల కంపెనీ విక్రయించే కార్ల సంఖ్య, కస్టమర్ డిమాండ్, లభ్యత, వేగవంతమైన ఉత్పత్తి మరియు సప్లయ్ చైన్ పై ఆధారపడి ఉంటుంది. ఆటోమోటివ్ కంపెనీల ఉత్పత్తి పనికి అంతరాయం లేని డెలివరీలు మరియు తక్కువ నిరీక్షణ కాలం (లో వెయిటింగ్ పీరియడ్) నిర్ధారించడానికి కంపెనీ యొక్క ఆర్ అండ్ డి బృందం మద్దతు ఇస్తుంది.

టాటా మోటార్స్ ఒక్క కారు తయారీపై మారుతి సుజుకి కన్నా ఎక్కువ లాభం పొందుతుందా? అదెలా?

ఈ విషయంలో ప్రత్యేకించి అనేక ఆటోమొబైల్ కంపెనీలు నేడు తమ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ బృందాలపై ఆధారపడుతున్నాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న సెమీకండక్టర్ల కొరత గురించి మనందరికీ తెలిసినదే. ఈ సమస్య కారణంగా, గత కొన్ని నెలల్లో వాహన ఉత్పత్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ చిప్ కొరత సమస్య కేవలం ఆటోమొబైల్ రంగాన్నే కాకుండా, అనేక ఇతర రంగాలను కూడా ప్రభావితం చేసింది.

టాటా మోటార్స్ ఒక్క కారు తయారీపై మారుతి సుజుకి కన్నా ఎక్కువ లాభం పొందుతుందా? అదెలా?

అయితే, మరికొద్ది నెలల్లోనే ఈ సంక్షోభం సద్దుమణుగుతుందని భావిస్తున్నారు. కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో సెమీ కండక్టర్ల చిప్స్ ఉత్పత్తిని వేగవంతం చేశారు. వీటి సరఫరా సాధారణ స్థాయికి చేరుకుంటే, కార్ల తయారీ కూడా వేగవంతం అవుతుంది. ఇదిలా ఉంటే, టాటా మోటార్స్ ఇటీవలే తమ సరికొత్త మైక్రో-ఎస్‌యూవీ టాటా పంచ్ (Tata Punch) ను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ కాంపాక్ట్ కారు సైజులో చిన్నగా ఉనప్పటికీ, దాని డిజైన్ మరియు ఫీచర్లతో ఇది కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

టాటా మోటార్స్ ఒక్క కారు తయారీపై మారుతి సుజుకి కన్నా ఎక్కువ లాభం పొందుతుందా? అదెలా?

టాటా పంచ్ కారును గత అక్టోబరులో మార్కెట్లో విడుదల చేసినప్పటి నుండి ఇప్పటి వరకూ 8,000 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. గత నెలలో ఇది దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితాలోకి ప్రవేశించింది. టాటా మోటార్స్ ఈ చిన్న కారును ప్యూర్, అడ్వెంచర్, అకాంప్లిష్డ్ మరియు క్రియేటివ్ అనే నాలుగు వేరియంట్లలో అందిస్తోంది. మార్కెట్లో వీటి ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 5.49 లక్షల నుంచి రూ. 9.09 లక్షల మధ్యలో ఉన్నాయి.

Most Read Articles

English summary
Is tata motors making more profits on single car compared to maruti suzuki
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X