జాగ్వార్ ఈ-పేస్‌లో కొత్త ఆర్-డైనమిక్ బ్లాక్ ఎడిషన్ విడుదల, వివరాలు

బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ విక్రయిస్తున్న చిన్న ఎస్‌యూవీ ఈ-పేస్‌లో కంపెనీ ఓ కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ఆర్-డైనమిక్ బ్లాక్ ఎడిషన్ పేరిట కంపెనీ ఓ కొత్త జాగ్వార్ ఈ-పేస్‌ను విడుదల చేసింది. ఇప్పుడు ఇది కొత్త డిజైన్ మరియు అప్‌డేటెడ్ టెక్నాలజీతో లభిస్తుంది.

జాగ్వార్ ఈ-పేస్‌లో కొత్త ఆర్-డైనమిక్ బ్లాక్ ఎడిషన్ విడుదల, వివరాలు

జాగ్వార్ ఈ-పేస్ లైనప్‌లో కంపెనీ ఇప్పటికే ఆర్-డైనమిక్ హెచ్‌ఎస్‌ఈ రేంజ్‌ను ఆఫర్ చేస్తోంది. కాగా, ఇప్పుడు ఇందులో ఆర్-డైనమిక్ బ్లాక్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టి, ఈ మోడల్ లైనప్‌ను విస్తరించారు. పేరుకు తగినట్లుగానే, కొత్త జాగ్వార్ ఈ-పేస్ ఆర్-డైనమిక్ బ్లాక్ ఎడిషన్ ప్రధానంగా బ్లాక్ డిజైన్ యాక్సెంట్స్‌తో స్టాండర్డ్ మోడల్ కన్నా భిన్నంగా ఉంటుంది.

జాగ్వార్ ఈ-పేస్‌లో కొత్త ఆర్-డైనమిక్ బ్లాక్ ఎడిషన్ విడుదల, వివరాలు

ఈ కొత్త జాగ్వార్ ఈ-పేస్ ఆర్-డైనమిక్ బ్లాక్ ఎడిషన్‌ను స్టాండర్డ్ ఆర్-డైనమిక్ ఎస్ వెర్షన్ ఆధారంగా చేసుకొని రూపొందించారు. ఇప్పుడు ఇది బ్లాక్ ప్యాక్‌ను స్టాండర్డ్‌గా కలిగి ఉంటుంది. స్టాండర్డ్ వెర్షన్‌లో క్రోమ్-కలర్‌లో ఫినిష్ చేయబడిన అనేక భాగాలను ఇందులో బ్లాక్ కలర్‌లో ఫినిష్ చేయబడి ఉంటాయి.

MOST READ:అలెర్ట్: 2.36 లక్షల రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు వెనక్కి.. కారణం ఏమంటే?

జాగ్వార్ ఈ-పేస్‌లో కొత్త ఆర్-డైనమిక్ బ్లాక్ ఎడిషన్ విడుదల, వివరాలు

ఇందులో ప్రధానంగా, క్రోమ్ విండో ఫ్రేమ్‌కు బదులుగా బ్లాక్ విండో ఫ్రేమ్, బ్లాక్ మిర్రర్ క్యాప్స్ మరియు ఫ్రంట్ స్క్రీన్‌లలో బ్లాక్ ఇన్సర్ట్‌లను కలిగి ఉంటుంది. వీటికి అదనంగా, జాగ్వార్ ఈ-పేస్ ఆర్-డైనమిక్ బ్లాక్ ఎడిషన్‌ను కొత్త 19 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌తో అందిస్తున్నారు. ఈ వీల్స్ స్టాండర్డ్ ఆర్-డైనమిక్ ఎస్ వెర్షన్ కంటే పెద్దవిగా ఉంటాయి.

జాగ్వార్ ఈ-పేస్‌లో కొత్త ఆర్-డైనమిక్ బ్లాక్ ఎడిషన్ విడుదల, వివరాలు

ఈ కొత్త వేరియంట్‌లో బ్రేక్ కాలిపర్లు రెడ్ కలర్‌లో ఉండి, శాటిన్ గ్రే కలర్ చక్రాల వెనుకన ఉంటాయి. ఇవి ఈ కొత్త వేరియంట్‌కు మరింత స్పోర్టీ రూపాన్ని ఇస్తాయి. ప్రైవసీ గ్లాస్ మరియు గ్లోసీ పానోరమిక్ సన్‌రూఫ్ కూడా ఆర్-డైనమిక్ బ్లాక్ ఎడిషన్ ప్యాక్‌లో భాగంగా ఉంటాయి.

MOST READ:కరోనా రోగులకోసం తన టయోటా కారు విరాళంగా ఇచ్చేసిన ఎమ్మెల్యే

జాగ్వార్ ఈ-పేస్‌లో కొత్త ఆర్-డైనమిక్ బ్లాక్ ఎడిషన్ విడుదల, వివరాలు

జాగ్వార్ ఈ-పేస్ ఆర్-డైనమిక్ బ్లాక్ ఎడిషన్‌లోని ఇంజన్ ఆప్షన్లలో ఎలాంటి మార్పులు లేవు. ఇందులో తేలికపాటి హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 165హెచ్‌పి డి165 మరియు హైబ్రిడ్ టెక్నాలజీ లేని డి165, తేలికపాటి హైబ్రిడ్ డి200, పి160, పి200, పి250 మరియు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పి300ఈ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి.

జాగ్వార్ ఈ-పేస్‌లో కొత్త ఆర్-డైనమిక్ బ్లాక్ ఎడిషన్ విడుదల, వివరాలు

ఈ కారులోని ఇంటీరియర్ విషయానికొస్తే, పేరుకు తగినట్లుగానే ఇందులోని ఇంటీరియర్ క్యాబిన్ లేఅవుట్ మొత్తం కొత్త బ్లాక్ కలర్ ప్రీమియం లెథర్ అప్‌హోలెస్ట్రీని కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ సౌకర్యం, జాగ్వార్ ల్యాండ్ రోవర్ యొక్క లేటెస్ట్ పివి ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంటాయి.

MOST READ:ఈ మినీ క్యాంపర్‌తో మీ క్యాంపింగ్‌ను మరింత సరదాగా మార్చుకోండి!

జాగ్వార్ ఈ-పేస్‌లో కొత్త ఆర్-డైనమిక్ బ్లాక్ ఎడిషన్ విడుదల, వివరాలు

ఈ లేటెస్ట్ జాగ్వార్ ఈ-పేస్ వేరియంట్‌లో 12.3 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు 11.4 ఇంచ్ కర్వ్డ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లు ఉంటాయి. ఈ అప్‌డేట్స్‌తో పాటుగా, కొత్త జాగ్వార్ ఈ-పేస్ ఆర్-డైనమిక్ బ్లాక్ వెర్షన్ యొక్క అన్ని వేరియంట్లలో కంపెనీ కొత్తగా క్యాబిన్ ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్‌ను అందిస్తోంది. ఇది అల్ట్రా-ఫైన్ ఫిల్టర్లను ఉపయోగించి కారు లోపల ఉన్న కాలుష్య కారకాలను 2.5 మైక్రాన్ల పరిమాణంలో తగ్గించగలదని కంపెనీ చెబుతోంది.

జాగ్వార్ ఈ-పేస్‌లో కొత్త ఆర్-డైనమిక్ బ్లాక్ ఎడిషన్ విడుదల, వివరాలు

ఇంకా, ఈ కారులో హై బీమ్ అసిస్టెంట్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ ఫ్రంట్ సీట్స్ మరియు డోర్ మిర్రర్స్ కోసం మెమరీ ఫంక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఎస్ మోడళ్లలో స్టాండర్డ్‌గా లభిస్తాయి. అలాగే, కొత్త ఎస్ఈ వేరియంట్లు ఇప్పుడు మెరిడియన్ నుండి గ్రహించిన సరికొత్త సమగ్ర ఆడియో సిస్టమ్‌ను పొందుతాయి.

MOST READ:ఆ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆక్సిజన్ బస్ సౌకర్యం కూడా.. ఎక్కడంటే?

జాగ్వార్ ఈ-పేస్‌లో కొత్త ఆర్-డైనమిక్ బ్లాక్ ఎడిషన్ విడుదల, వివరాలు

ఈ ఏడాది తరువాత, అన్ని జాగ్వార్ ఈ-పేస్ వేరియంట్లకు కంపెనీ వైర్‌లెస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ టెక్నాలజీకి సంబంధించిన ఓటిఏ (ఓవర్ ది ఎయిర్) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను ప్రవేశపెట్టనుంది.

Most Read Articles

English summary
Jaguar E-Pace Gets An All New R-Dynamic Black Edition, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X