జాగ్వార్ ఐ-పేస్ బ్లాక్ ఎడిషన్; డిజైన్, ఫీచర్స్ & వివరాలు

ప్రముఖ వాహనం తయారీ సంస్థ అయిన జాగ్వార్ యొక్క ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇటీవల జాగ్వార్ కంపెనీ తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఐ-పేస్‌ను కొత్త బ్లాక్ ఎడిషన్‌లో విడుదల చేసింది. జాగ్వార్ ఇప్పుడు బ్లాక్ ఎడిషన్ ఇప్పుడు ఐ-పేస్ ఎస్‌ఇ, హెచ్‌ఎస్‌ఇ అనే వేరియంట్లలో లభిస్తుంది.

కొత్త జాగ్వార్ ఐ-పేస్ బ్లాక్ ఎడిషన్ మోడల్‌లో డార్క్ గ్లోసీ ప్యాకేజీ ఉంది. ఇందులో ఫ్రంట్ గ్రిల్, మిర్రర్ క్యాప్, టెయిల్ సెక్షన్ మరియు అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి. ఈ మోడల్‌కి బ్లాక్ ఎడిషన్ బ్యాడ్జ్ కూడా ఇవ్వబడింది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

కొత్త జాగ్వార్ ఐ-పేస్ యొక్క లోపలి భాగంలోని సీట్లు బ్లాక్ లేదర్ కవర్ ఉంటాయి. అయితే కారు క్యాబిన్ మరియు డాష్‌బోర్డ్‌లో గ్లోస్ బ్లాక్ ఉంటుంది. ఇందులో ఉన్న పనోరమిక్ గ్లాస్‌కి ప్రైవసీ గ్లాస్ కూడా ఇవ్వబడింది. జాగ్వార్ ఐ-పేస్ బ్లాక్ ఎడిషన్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్స్ అన్ని కూడా దాని స్టాండ్ర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటాయి.

MOST READ:ఫ్యాన్సీ నెంబర్ కల్చర్‌కి బ్రేక్ వేసిన గవర్నమెంట్; ఎక్కడో తెలుసా?

జాగ్వార్ ఐ-పేస్ భారత మార్కెట్లో రూ. 1.05 కోట్ల ధరతో ప్రారంభించబడింది. ఈ కారు ఇప్పుడు ఎస్, ఎస్ఇ మరియు హెచ్ఎస్ఇ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో ఉన్న మిడ్‌-స్పెక్‌ వేరియంట్‌ ధర రూ. 1.88 కోట్లు కాగా, టాప్-స్పెక్‌ ఐ-పేస్‌ వేరియంట్‌ ధర రూ. 1.12 కోట్లు.

జాగ్వార్ ఐ-పేస్ పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ కార్ల బుకింగ్ ఇప్పటికే దేశీయ మార్కెట్లో ప్రారంభించబడింది. దీనిని భారతదేశంలోకి సిబియు మార్గం ద్వారా ప్రవేశపెడుతున్నారు. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఐ-పేస్ కంపెనీ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అని, ఇది 2018 లోనే అంతర్జాతీయ మార్కెట్లో ప్రారంభించబడింది.

MOST READ:మన హైదరాబాద్‌లో.. రెంట్ కట్టు నచ్చిన కారులో షికారు కొట్టు

జాగ్వార్ ఐ-పేస్‌లో స్లైడింగ్ రూఫ్, ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్, ఎల్‌ఇడి టైల్ లైట్, హానీకూంబ్ గ్రిల్, ఓఆర్‌విఎంపై టర్న్ లైట్ ఇండికేటర్, బిగ్ ఎయిర్ ఇంటెక్ డ్యామ్, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటాయి.

ఈ కొత్త కారు యొక్క కొలతల విషయానికి వస్తే, ఈ ఎస్‌యూవీ పొడవు 4,682 మిమీ, వెడల్పు 2,011 మిమీ, ఎత్తు 1,566 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 174 మిమీ మరియు వీల్ బేస్ 2990 మిమీవరకు ఉంటుంది.

MOST READ:చెక్కతో చేసిన టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్.. సూపర్, గురూ..!

ఈ కారు 8-వే అడ్జస్టబుల్ స్పోర్ట్స్ సీట్లను కలిగి ఉంటుంది. ఇందులో 380 వాట్ల మెరిడియన్ సౌండ్ సిస్టమ్, 3 డి సరౌండ్ కెమెరా, డ్రైవర్ కండిషన్ మానిటర్, యానిమేటెడ్ డైరెక్షనల్ ఇండికేటర్, హెడ్స్ అప్ డిస్ప్లే, క్రూయిజ్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్స్ కలిగి ఉంటుంది.

జాగ్వార్ ఐ-పేస్ యొక్క ఎలక్ట్రిక్ మోటారు 359 బిహెచ్‌పి పవర్ మరియు 696 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 4-వీల్ డ్రైవ్ సిస్టం స్టాండర్డ్ గా ఇవ్వబడింది. ఈ కారు కేవలం 4.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వేగవంతం అవుతుంది. ఇది ఒక పూర్తి ఛార్జీతో, దాదాపు 480 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.

MOST READ:సమంత మనసు ఆకాశమంత.. దీనికి ఇదే నిలువెత్తు నిదర్శనం

కొత్త జాగ్వార్ ఐ-పేస్‌ ఎలక్ట్రిక్ కార్ లో 90 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. దీనిని కేవలం 45 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ కారు యొక్క 200 ప్రోటోటైప్‌లను 10 లక్షల 50 వేల కిలోమీటర్లు నడపడం ద్వారా పరీక్షించామని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీనితో పాటు, ఐ-పేస్‌ను ప్రపంచ స్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా కూడా పేర్కొంది.

భారతమార్కెట్లో విడుదలైన జాగ్వార్ ఐ-పేస్, మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి, రాబోయే ఆడి ఇ-ట్రోన్ మరియు వోల్వో ఎక్స్‌సి 40 రీఛార్జ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అంతే కాకుండా టెస్లా తన ఎలక్ట్రిక్ కార్లను భారతదేశంలో విడుదల చేసిన తరువాత, జాగ్వార్ ఐ-పేస్ టెస్లా మోడల్ ఎస్ తో కూడా పోటీ పడగలదు.

Most Read Articles

English summary
Jaguar I-Pace Black Edition Unveiled Features Design Performance Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X