Just In
- 9 hrs ago
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!
- 12 hrs ago
విడుదలకు ముందే యమహా FZ-X స్పెసిఫికేషన్స్ లీక్
- 13 hrs ago
భారత్‌లో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టీల్‌బర్డ్; ధర & వివరాలు
- 14 hrs ago
మిస్టర్ మస్క్.. భారత్‌లో త్వరగా టెస్లా కార్లను ఉత్పత్తి చేయండి: నితిన్ గడ్కరీ
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులు అకస్మాత్తుగా ప్రయాణం చేయొచ్చు...!
- News
వైఎస్ షర్మిల నుంచి పిలుపు: కొండా సురేఖ దంపతులు ఏమన్నారంటే..?, జగన్‌పై సంచలనం
- Sports
PBKS vs CSK: 'సూపర్' జడేజా! కళ్లుచెదిరే రనౌట్.. స్టన్నింగ్ క్యాచ్!వీడియోలు
- Movies
పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్.. ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టిన రాంగోపాల్ వర్మ.. కోవిడ్ 19 హీరో అంటూ..
- Finance
మళ్లీ బంగారం ర్యాలీ ప్రారంభమైందా? 15 రోజుల్లో 6% జంప్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మార్చి 23వ తేదీన జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ కారు విడుదల: వివరాలు
బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ తమ మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ 'ఐ-పేస్' కారును భారత్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. మార్చి 23, 2021వ తేదీన జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ కారును దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

వాస్తవానికి ఈ ఎలక్ట్రిక్ కారును మార్చి 9, 2021వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే, కొన్ని అనివార్య కారణాల వలన అది మార్చి 23కి వాయిదా పడింది. జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కోసం కంపెనీ ఇప్పటికే అధికారికంగా బుకింగ్‌లను కూడా స్వీకరిస్తోంది.

ఆసక్తి గల కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆన్లైన్లో కానీ లేదా దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ డీలర్‌షిప్‌ల ద్వారా కానీ బుక్ చేసుకోవచ్చు. ఈ ఎస్యూవీ మార్కెట్లో విడుదల చేసిన వెంటనే డెలివరీలు కూడా ప్రారంభం కానున్నాయి. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, కంపెనీ ఇప్పటికే ఈ మోడల్‌ను భారత మార్కెట్లో డిమాండ్‌కు తగినట్లుగా స్టాక్ చేసినట్లు తెలుస్తోంది.

భారత్‌లో తమ తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేయడానికి జాగ్వార్ తమ రిటైల్ నెట్వర్క్ కూడా పూర్తిగా న్నద్ధం చేసినట్లు ప్రకటించింది. భారతదేశంలోని 19 నగరాల్లో ఉన్న 22 డీలర్‌షిప్‌లు ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కారును విక్రయించడానికి మరియు అందుకు తగిన సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది.

జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ కారు కోసం కావల్సిన మౌలిక సదుపాయాలను మరియు ఆఫ్టర్ సేల్స్ సేవలను అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని, మెట్రో నగరాలు మరియు ఇతర ముఖ్య పట్టణ కేంద్రాల్లో విస్తృతంగా చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని జాగ్వార్ తెలిపింది.

జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా 35కి పైగా స్వంత ఈవీ ఛార్జర్లను ఏర్పాటు చేసింది. జాగ్వార్ ఐ-పేస్‌ను టాటా పవర్ యొక్క ఈజీ ఛార్జ్ నెట్వర్క్ ఉపయోగించి ఛార్జ్ చేసుకోవచ్చు. టాటా పవర్ కూడా భారతదేశం అంతటా 200కి పైగా ఛార్జింగ్ పాయింట్లను కలిగి ఉంది. మాల్స్, రెస్టారెంట్లు, కార్యాలయాలు, నివాస ప్రాంతాలు మరియు హైవేలపై అనుకూలమైన ప్రదేశాలలో ఈ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.

ఇక జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ విషయానికి వస్తే, ఇది ఎస్, ఎస్ఈ, హెచ్ఎస్ఈ అనే మూడు వేరియంట్లలో లభ్యం కానుంది. ఇవి మూడు కూడా ఒకే రకమైన పవర్ట్రైన్ ఆప్షన్ (ఈవి400)తో లభ్యం కానున్నాయి. కాకపోతే, ఇందులో లభించే ఫీచర్లు మరియు వాటి రేంజ్ వేర్వేరుగా ఉంటుంది.

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో రెండు యాక్సిల్స్‌లో (ఫ్రంట్ అండ్ రియర్) ఒక్కొక్కటి చొప్పున మొత్తం రెండు సింక్రోనస్ పర్మినెంట్ మాగ్నెట్ ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇవి రెండూ కలిసి మొత్తంగా 400 బిహెచ్‌పిల శక్తిని మరియు 696 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ శక్తి అన్ని చక్రాలకు సమానంగా పంపిణీ అవుతుంది (ఆల్-వీల్ డ్రైవ్).

ఈ ఎలక్ట్రిక్ మోటార్ 90 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కేవలం 4.8 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 200 కిలోమీటర్లు. పూర్తి చార్జ్‌పై ఇది 470 కిలోమీటర్ల సర్టిఫైడ్ డ్రైవింగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది.

ఈ కారు స్టాండర్డ్ మరియు ఫాస్ట్ ఛార్జర్లను సపోర్ట్ చేస్తుంది. ఇందులోని బ్యాటరీలను 100 కిలోవాట్ ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించి 0-80 శాతం ఛార్జ్ చేయడానికి కేవలం 45 నిమిషాలు మాత్రమే పడుతుంది. అలాగే, 7 కిలోవాట్ ఏసి వాల్ బాక్స్ ఛార్జర్ ఉపయోగించి చార్జ్ చేసినట్లయితే 10 గంటల వ్యవధిలో బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.

ఈ కారులోని ఇతర ఫీచర్లలో పూర్తి గ్లాస్ రూఫ్, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, ఎల్ఇడి టెయిల్ లైట్స్, హనీకోంబ్ ప్యాటర్న్ గ్రిల్, సైడ్ మిర్రర్స్‌పై టర్న్ ఇండికేటర్, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్ డ్యామ్, 19 ఇంచ్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ వంటి ఎక్స్టీరియర్ ఫీచర్లు ఉన్నాయి.

అలాగే, ఇంటీరియర్ ఫీచర్లను గమనిస్తే, ఇందులో డ్యూయెల్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైయర్, 8-వే అడ్జస్టబల్ లుస్టెక్ స్పోర్ట్స్ సీట్లు, 380 వాట్ మెరీడియన్ సౌండ్ సిస్టమ్, 3డి సరౌండ్ కెమెరా, డ్రైవర్ కండిషన్ మానిటర్, యానిమేటెడ్ డైరెక్షనల్ ఇండికేటర్, హెడ్స్ అప్ డిస్ప్లే, క్రూయిజ్ కంట్రోల్ మొదలైన అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇది ఈ విభాగంలో, మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి మరియు త్వరలో రానున్న ఆడి ఈ-ట్రోన్ వంటి కార్లకు పోటీగా ఉంటుంది.