హైడ్రోజన్‌తో నడిచే డిఫెండర్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్న ల్యాండ్ రోవర్

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ ఐకానిక్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ అందిస్తున్న పాపులర్ ఎస్‌యూవీ 'డిఫెండర్'లో కంపెనీ ఇప్పుడు కొత్తగా ఓ హైడ్రోజన్ పవర్డ్ వేరియంట్‌ను తయారు చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

హైడ్రోజన్‌తో నడిచే డిఫెండర్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్న ల్యాండ్ రోవర్

ఈ విషయాన్ని జాగ్వార్ ల్యాండ్ రోవర్ అధికారికంగా ప్రకటించింది. ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ ఆధారంగా ఓ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఎఫ్‌సిఇవి) కాన్సెప్ట్‌పై పనిచేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్‌తో నడిచే డిఫెండర్ ఎస్‌యూవీ ప్రోటోటైప్ టెస్టింగ్ ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభమవుతుంది.

హైడ్రోజన్‌తో నడిచే డిఫెండర్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్న ల్యాండ్ రోవర్

హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఇంధనాన్ని మండిచడం ద్వారా ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిస్తాయి. ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగానే ఇవి కూడా సున్నా ఉద్గారాలను విడుదల చేస్తాయి మరియు ఇవి పూర్తిగా ప్రకృతి సాన్నిహిత్యమైనవి. సాంప్రదాయ బ్యాటరీలతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలకు ఇవి ప్రత్యామ్నాయంగా ఉంటాయి.

హైడ్రోజన్‌తో నడిచే డిఫెండర్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్న ల్యాండ్ రోవర్

వచ్చే 2036 నాటికి సున్నా ఉద్గారాలను సాధించాలనే లక్ష్యంలో భాగంగానే, జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఈ ఎఫ్‌సిఈవీ (ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్) ప్రాజెక్టుపై దృష్టి పెట్టింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ యొక్క అధునాతన ఇంజనీరింగ్ ప్రాజెక్టును, ప్రాజెక్ట్ జ్యూస్ అని పిలుస్తారు, దీనికి యూకే ప్రభుత్వ-మద్దతుగల అడ్వాన్స్‌డ్ ప్రొపల్షన్ సెంటర్ నిధులను సమకూరుస్తుంది.

హైడ్రోజన్‌తో నడిచే డిఫెండర్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్న ల్యాండ్ రోవర్

ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎఫ్‌సిఈవీ ప్రోటోటైప్ టెస్టింగ్ ప్రధానంగా, దీని ఆఫ్-రోడ్ సామర్ధ్యం మరియు ఇంధన వినియోగం వంటి ముఖ్య లక్షణాలను ధృవీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు గానూ డెల్టా మోటార్‌స్పోర్ట్, ఏవిఎల్, మారెల్లి ఆటోమోటివ్ సిస్టమ్స్ మరియు యుకె బ్యాటరీ ఇండస్ట్రియలైజేషన్ సెంటర్ (యుకెబిఐసి) సంస్థలతో జాగ్వార్ ల్యాండ్ రోవర్ చేతులు కలిపింది.

హైడ్రోజన్‌తో నడిచే డిఫెండర్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్న ల్యాండ్ రోవర్

హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ద్వారా పనిచేసే డిఫెండర్ ప్రోటోటైప్ ఎస్‌యూవీని పరిశోధించడానికి, అభివృద్ధి చేయడానికి మరియు తయారు చేయడానికి ఈ సంస్థలు జాగ్వార్ ల్యాండ్ రోవర్‌కు తమ వంతు సహకారాన్ని అందించనున్నాయి. అన్నీ సజావుగా జరిగితే, మరో రెండు మూడేళ్లలో హైడ్రోజన్ పవర్డ్ డిఫెండర్ ఎస్‌యూవీ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

హైడ్రోజన్‌తో నడిచే డిఫెండర్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్న ల్యాండ్ రోవర్

హైడ్రోజన్-శక్తితో పనిచేసే ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనాలు సుదూర ప్రయాణాలు చేయడానికి మరియు నిత్యం వేడిగా లేదా చల్లగా ఉండే వాతావరణాలలో ఉపయోగించేందుకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ వాహనాలు అధిక శక్తి సాంద్రత, వేగవంతమైన రీఫ్యూయెలింగ్ మరియు తక్కువ ఉష్ణోగ్రతల వద్ద తక్కువ రేంజ్‌ను కోల్పోవడం చేస్తాయి.

హైడ్రోజన్‌తో నడిచే డిఫెండర్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్న ల్యాండ్ రోవర్

తాజా నివేదికల ప్రకారం, 2018 నుండి ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనాలు దాదాపు రెట్టింపు అయ్యాయి, హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ స్టేషన్లు 20 శాతానికి పైగా పెరిగాయి. రాబోయే తొమ్మిది సంవత్సరాలలో హైడ్రోజన్-శక్తితో పనిచేసే ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనాలు ప్రపంచవ్యాప్తంగా 10,000 రీఫ్యూయలింగ్ స్టేషన్లతో 10 మిలియన్లకు చేరుకొని అగ్రస్థానంలో ఉంటాయని అంచనా.

హైడ్రోజన్‌తో నడిచే డిఫెండర్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్న ల్యాండ్ రోవర్

ల్యాండ్ రోవర్ బ్రాండ్‌కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ తమ అప్‌డేటెడ్ 2021 డిస్కవరీ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు కంపెనీ తమ అఫీషియల్ ఇండియన్ వెబ్‌సైట్‌లో డిస్కవరీ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కూడా లిస్ట్ చేసింది. రాబోయే నెలల్లో ఇది భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

Most Read Articles

English summary
Jaguar Land Rover Developing Hydrogen Powered Defender SUV Prototype, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X