జీప్ కంపాస్ 7-సీటర్ ఎస్‌యూవీ కొత్త టీజర్ లాంచ్; త్వరలోనే విడుదల

అమెరికన్ ఐకానిక్ కార్ బ్రాండ్ జీప్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న కంపాస్ ఎస్‌యూవీలో ఓ 7-సీటర్ వెర్షన్‌ను ప్రవేశపెట్టబోతోందని తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజాగా, జీప్ ఇండియా ఇందుకు సంబంధించిన ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది.

జీప్ కంపాస్ 7-సీటర్ ఎస్‌యూవీ కొత్త టీజర్ లాంచ్; త్వరలోనే విడుదల

జీప్ కంపాస్ ప్రపంచ వ్యాప్తంగా 5-సీటర్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తోంది. కాగా, కంపెనీ ఇప్పుడు ఇందులో తొలిసారిగా ఓ 7-సీటర్ వెర్షన్‌ను తీసుకురాబోతోంది. జీప్ కంపాస్ ఆధారంగా తయారు చేయబోయే ఈ 7-సీటర్ మోడల్‌ని "జీప్ కమాండర్" అని పిలిచే ఆస్కారం ఉంది.

జీప్ కంపాస్ 7-సీటర్ ఎస్‌యూవీ కొత్త టీజర్ లాంచ్; త్వరలోనే విడుదల

ఈ టీజర్ వీడియోలో ఇది పాక్షికంగా స్పష్టమవుతుంది. ఇందులో ER బ్యాడ్జ్‌ని కంపెనీ హైలైట్ చేసింది. జీప్ కంపాస్ 7-సీటర్ (అలియాస్ జీప్ కమాండర్) ముందుగా బ్రెజిలియన్ మార్కెట్లో విడుదల కానుంది. ఆ తర్వాత, భారతదేశంలో కూడా విడుదల కానుంది.

జీప్ కంపాస్ 7-సీటర్ ఎస్‌యూవీ కొత్త టీజర్ లాంచ్; త్వరలోనే విడుదల

జీప్ కమాండర్ డిజైన్ అంశాలను చూపించే వీడియోను కంపెనీ టీజ్ చేసింది. తాజా నివేదికల ప్రకారం, కొత్త జీప్ 7-సీటర్ మోడల్ ఈ ఏడాది చివరినాటికి భారత మార్కెట్లోకి ప్రవేశించవచ్చని అంచనా. జీప్ యొక్క ఇతర మోడళ్లైన రెనెగేడ్, కంపాస్ మరియు ఫియట్ టోరోలతో పాటు బ్రెజిల్‌లోని గోయానాలో ఈ కమాండర్ ఎస్‌యూవీ ఉత్పత్తి చేయనున్నారు.

జీప్ కంపాస్ 7-సీటర్ ఎస్‌యూవీ కొత్త టీజర్ లాంచ్; త్వరలోనే విడుదల

జీప్‌ బ్రాండ్ 2000 ల ప్రారంభ కాలంలో కమాండర్ అనే ఏడు సీట్ల మోడల్‌ను విక్రయించేంది. కంపెనీ ఇప్పుడు ఆ పేరును తిరిగి ఉపయోగించుకోనుంది. ఈ కొత్త 7-సీటర్ ఎస్‌యూవీ, కంపాస్ ఆధారంగా తయారవుతున్నప్పటికీ, ఇందులో పూర్తిగా సరికొత్త ప్యాకేజీలు ఉంటాయని భావిస్తున్నారు.

జీప్ కంపాస్ 7-సీటర్ ఎస్‌యూవీ కొత్త టీజర్ లాంచ్; త్వరలోనే విడుదల

భారతదేశం కోసం జీప్ డెవలప్ చేస్తున్న మోడల్‌ని కమాండర్ అని పిలువకపోవచ్చు. ప్రస్తుతం కంపెనీ ఈ మోడల్‌ను హెచ్ 6 కోడ్‌నేమ్‌తో డెవలప్‌ చేస్తోంది. ఈ టీజర్ వీడియోలో కమాండర్ ఎస్‌యూవీ యొక్క గ్రిల్ మరియు హెడ్‌ల్యాంప్ డిజైన్‌ను చూడవచ్చు. ఇందులోని గ్రిల్ డిజైన్ స్టాండర్డ్ 7-స్లాట్ గ్రిల్ కన్నా భిన్నంగా కనిపిస్తుంది.

జీప్ కంపాస్ 7-సీటర్ ఎస్‌యూవీ కొత్త టీజర్ లాంచ్; త్వరలోనే విడుదల

భారత రోడ్లపై ఈ 7-సీటర్ కంపాస్ మోడల్‌ని కంపెనీ ఇప్పటికే విస్తృతంగా పరీక్షిస్తోంది. భారత మార్కెట్లో, ఈ కొత్త ఎస్‌యూవీని కంపాస్ మరియు గ్రాండ్ చెరోకీల మధ్యలో ఉంచనున్నారు. ఇది ఐదు సీట్ల కంపాస్ మోడల్ మాదిరిగానే మోనోకోక్ ప్లాట్‌ఫాంపై నిర్మించబడుతుందని భావిస్తున్నారు.

జీప్ కంపాస్ 7-సీటర్ ఎస్‌యూవీ కొత్త టీజర్ లాంచ్; త్వరలోనే విడుదల

స్టాండర్డ్ కంపాస్‌తో పోల్చుకుంటే, దీని ఇంటీరియర్ క్యాబిన్ చాలా విశాలంగా ఉండి, మూడవ వరుసలోని ప్రయాణీకులకు సైతం సౌకర్యవంతమైన సీటింగ్ అనుభవాన్ని అందించేలా ఉంటుందని సమాచారం. ఇందుకోసం కంపెనీ దీని వీల్‌బేస్ పెంచనుంది. కొత్త కంపాస్‌లో 6-సీటర్ మరియు 7-సీటర్ కాన్ఫిగేరేషన్స్ ఉండొచ్చని అంచనా.

జీప్ కంపాస్ 7-సీటర్ ఎస్‌యూవీ కొత్త టీజర్ లాంచ్; త్వరలోనే విడుదల

ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, దీని తయారీ ఖర్చును తగ్గించేందుకు కంపెనీ ప్రస్తుత 5-సీటర్ కంపాస్‌లో ఉపయోగిస్తున్న ఇంజన్లనే ఈ 7-సీటర్ మోడల్‌లోనూ కొనసాగించవచ్చని సమాచారం. ఇందులో అదే 2.0 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్ మరియు 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లను ఇవ్వవచ్చు.

జీప్ కంపాస్ 7-సీటర్ ఎస్‌యూవీ కొత్త టీజర్ లాంచ్; త్వరలోనే విడుదల

ఇందులోని పెట్రోల్ ఇంజన్‌ను వ్రాంగ్లర్ అన్‌లిమిటెడ్ నుండి మరియు డీజిల్ ఇంజన్‌ను 5 సీట్ల కంపాస్ మోడల్ నుండి తీసుకోవచ్చు. ఈ ఇంజన్ 172 బిహెచ్‌పి శక్తిని, 350 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

జీప్ కంపాస్ 7-సీటర్ ఎస్‌యూవీ కొత్త టీజర్ లాంచ్; త్వరలోనే విడుదల

గేర్‌బాక్స్ విషయానికి వస్తే, పెట్రోల్ వెర్షన్ 8-స్పీడ్ ఆటోమేటిక్‌తో మరియు డీజిల్ వెర్షన్ 6-స్పీడ్ మాన్యువల్ అలాగే 9-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్లతో లభ్యం కావచ్చు. ఈ ఎస్‌యూవీకి 4x4 తో పాటుగా 4x2 ఆప్షన్లను జోడించవచ్చు.

Most Read Articles

Read more on: #జీప్ #jeep
English summary
Jeep Compass 7 Seater SUV New Teaser Released, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X