ఏప్రిల్ 2022 నాటికి భారత్‌లో విడుదల కానున్న Jeep Meridian 7-సీటర్ ఎస్‌యూవీ

అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ (Ford) భారత మార్కెట్ నుండి వెళ్లిపోతున్న నేపథ్యంలో, ఆ కంపెనీ నుండి లభిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ఫోర్డ్ ఎండీవర్ (Ford Endeavour) ఫుల్-సైజ్ కూడా భారత మార్కెట్ నుండి తొలగిపోనున్న సంగతి తెలిసినదే. అయితే, ఈ లోటు భర్తీ చేసేందుకు మరో అమెరికన్ కార్ బ్రాండ్ సిద్ధమైంది.

ఏప్రిల్ 2022 నాటికి భారత్‌లో విడుదల కానున్న Jeep Meridian 7-సీటర్ ఎస్‌యూవీ

అమెరికాకు చెందిన పాపులర్ కార్ బ్రాండ్ జీప్ (Jeep), ఇప్పుడు భారత మార్కెట్ కోసం ఓ కొత్త 7-సీటర్ ఎస్‌యూవీని సిద్ధం చేస్తోంది. జీప్ మెరీడియన్ (Jeep Meridian) పేరుతో రానున్న ఈ కొత్త ఎస్‌యూవీని కంపెనీ వచ్చే ఏడాది భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ మేరకు ఏప్రిల్ 2022లో కంపెనీ 7-సీటర్ ఎస్‌యూవీని ఉత్పత్తిని ప్రారంభించనుంది.

ఏప్రిల్ 2022 నాటికి భారత్‌లో విడుదల కానున్న Jeep Meridian 7-సీటర్ ఎస్‌యూవీ

జీప్ ఇండియాకు మహారాష్ట్రలోని రంజన్‌గావ్ లో ఉన్న ఫ్యాక్టరీలో ఈ ఎస్‌యూవీని తయారు చేయనున్నారు. జీప్ బ్రాండ్ లైనప్ లో మెరీడియన్ (Meridian) మూడవ ఉత్పత్తి కానుంది. జీప్ ఇప్పటికే దేశీయ మార్కెట్లో కంపాస్ (Compass) మరియు వ్రాంగ్లర్ (Wrangler) అనే ఎస్‌యూవీలను విక్రయిస్తోంది.

ఏప్రిల్ 2022 నాటికి భారత్‌లో విడుదల కానున్న Jeep Meridian 7-సీటర్ ఎస్‌యూవీ

మెరీడియన్ 7-సీటర్ ఎస్‌యూవీని ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న జీప్ కంపాస్ ఆధారంగా తయారు చేసే అవకాశం ఉంది. జీప్ కంపాస్ ఒక 5-సీటర్ ఎస్‌యూవీ. జీప్ బ్రాండ్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మోడల్ ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో జీప్ కమాండర్‌ (Jeep Commander) పేరుతో అరంగేట్రం చేసింది.

ఏప్రిల్ 2022 నాటికి భారత్‌లో విడుదల కానున్న Jeep Meridian 7-సీటర్ ఎస్‌యూవీ

కాగా, భారత మార్కెట్లో వచ్చే ఏడాది నాటికి ఈ కొత్త 7-సీటర్ ఎస్‌యూవీని జీప్ మెరీడియన్ పేరుతో తీసుకువస్తామని అమెరికన్ కార్ బ్రాండ్ ప్రకటించింది. మూడు వరసలు, 7-సీట్లతో అద్భుతమైన క్యాబిన్ స్పేస్‌ తో ఈ ఎస్‌యూవీ అందుబాటులోకి రానుంది. వచ్చే ఏడాది మధ్య నాటికి ఇది భారత రోడ్లపై సందడి చేసే అవకాశం ఉంది.

ఏప్రిల్ 2022 నాటికి భారత్‌లో విడుదల కానున్న Jeep Meridian 7-సీటర్ ఎస్‌యూవీ

ఈ నేపథ్యంలో, 2022 ఆరంభంలో కంపెనీ ఈ ఎస్‌యూవీని ఆవిష్కరించవచ్చని భావిస్తున్నారు. ఏప్రిల్ 2022 నాటికి FCA (ఫియట్ క్రైస్లర్ ఆటోమొబైల్స్) యొక్క రంజన్‌గావ్ ప్లాంట్‌లో దీని ఉత్పత్తి కూడా ప్రారంభమవుతుంది. భారతదేశంలో విస్తరణ ప్రణాళికల కోసం ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్ వచ్చే ఏడాది చివరి నాటికి 250 మిలియన్ డాలర్ల (రూ. 1870 కోట్ల) పెట్టుబడిని వెచ్చించనున్నట్లు ప్రకటించింది.

ఏప్రిల్ 2022 నాటికి భారత్‌లో విడుదల కానున్న Jeep Meridian 7-సీటర్ ఎస్‌యూవీ

పూణేలోని రంజన్‌గావ్‌లోని ఉమ్మడి తయారీ కేంద్రంలో కొత్త మోడళ్ల ఉత్పత్తికి ఈ పెట్టుబడిని ఉపయోగించనున్నారు. భారతదేశంలో తయారు చేసే జీప్ మెరీడియన్ 7-సీటర్ ఎస్‌యూవీని ప్రపంచంలోని ఇతర రైట్ హ్యాండ్ డ్రైవ్ మార్కెట్ లకు కూడా ఎగుమతి చేయడానికి రంజన్‌గావ్‌లోని ప్లాంట్ ఒక హబ్‌గా ఉపయోగపడుతుంది.

ఏప్రిల్ 2022 నాటికి భారత్‌లో విడుదల కానున్న Jeep Meridian 7-సీటర్ ఎస్‌యూవీ

ఇదివరకు చెప్పినట్లుగా, జీప్ మెరిడియన్ అనేది ప్రాథమికంగా పేరు మార్చబడిన జీప్ కమాండర్ మూడు వరుసల ఎస్‌యూవీ. ఇది బ్రాండ్ యొక్క కంపాస్ మరియు రెనెగేడ్ మోడళ్లకు మద్దతు ఇచ్చే సవరించిన స్మాల్-వైడ్ 4×4 ప్లాట్‌ఫామ్ పై ఆధారపడి ఉంటుంది. ఇది కంపాస్, వ్యాగనీర్ మరియు గ్రాండ్ చెరోకీ మోడళ్ల నుండి స్టైలింగ్ సూచికలతో సహా పెద్ద జీప్‌ల నుండి కొన్ని డిజైన్ బిట్‌లను పంచుకుంటుంది.

ఏప్రిల్ 2022 నాటికి భారత్‌లో విడుదల కానున్న Jeep Meridian 7-సీటర్ ఎస్‌యూవీ

గ్లోబల్ మార్కెట్లలో లభిస్తున్న జీప్ మెరిడియన్ (కమాండర్) కొలతలను గమనిస్తే, ఇది 4,769 మిమీ పొడవు, 1,859 మిమీ వెడల్పు, 1,682 మిమీ ఎత్తు మరియు 2,794 మిమీ వీల్‌బేస్ కలిగి ఉంటుంది. కంపాస్ తో పోలిస్తే, పొడవైన బాడీ డిజైన్ కోసం దీని వీల్‌బేస్ ను 158 మిమీకి పెంచబడింది.

ఏప్రిల్ 2022 నాటికి భారత్‌లో విడుదల కానున్న Jeep Meridian 7-సీటర్ ఎస్‌యూవీ

జీప్ మెరీడియన్ కొలతలను ప్రస్తుత జీప్ కంపాస్ మోడల్ తో పోల్చి చూసినప్పుడు, కంపాస్ కన్నా కొత్త మెరీడియన్ 364 మిమీ ఎక్కువ పొడవు, 41 మిమీ ఎక్కువ వెడల్పు మరియు 42 మిమీ ఎక్కువ ఎత్తును కలిగి ఉంటుంది. దీన్నిబట్టి చూస్తుంటే, జీప్ కంపాస్ ఎస్‌యూవీ కన్నా మెరీడియన్ చాలా విశాలమైన మరియు ప్రీమియం క్యాబిన్ ను కలిగి ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ఏప్రిల్ 2022 నాటికి భారత్‌లో విడుదల కానున్న Jeep Meridian 7-సీటర్ ఎస్‌యూవీ

ఈ ఎస్‌యూవీ డిజైన్ ముఖ్యాంశాలలో సిగ్నేచర్ 7-స్లాట్ గ్రిల్, దీర్ఘచతురస్రాకారపు ఫుల్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ ల్యాంప్‌లు, కొత్తగా డిజైన్ చేయబడిన బంపర్లు, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, పెద్ద కృత్రిమ వెంట్‌లు మరియు క్రోమ్ స్ట్రిప్‌తో కూడిన ఫాగ్ ల్యాంప్‌లు మొదలైన వాటిని ఇందులో ఆశించవచ్చు.

ఏప్రిల్ 2022 నాటికి భారత్‌లో విడుదల కానున్న Jeep Meridian 7-సీటర్ ఎస్‌యూవీ

జీప్ మెరీడియన్ తయారీ ఖర్చును తక్కువగా ఉంచేందుకు కంపెనీ దీని క్యాబిన్ లేఅవుట్ ను ప్రస్తుత కంపాస్ మోడల్‌తోనే షేర్ చేయబడుతుంది. అయితే, ఇది కంపాస్ కన్నా మరింత ప్రీమియం మరియు మెరుగైన ఫిట్ అండ్ ఫినిషింగ్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. జీప్ మెరీడియన్ ఎస్‌యూవీని కంపెనీ 6 సీటర్ మరియు 7 సీటర్ కాన్ఫిగరేషన్లలో అందించే అవకాశం ఉంది.

ఏప్రిల్ 2022 నాటికి భారత్‌లో విడుదల కానున్న Jeep Meridian 7-సీటర్ ఎస్‌యూవీ

కొత్త 6 సీటర్ వెర్షన్ జీప్ మెరీడియన్ ఎస్‌యూవీలో ముందు వరుసలో రెండు సీట్లు, మధ్య వరుసలో రెండు వ్యక్తిగత కెప్టెన్ సీట్లు మరియు మూడువ వరుసలో రెండు సీట్లను అందించనున్నారు. అలాగే, 7 సీటర్ జీప్ మెరీడియన్ లో ప్రస్తుత కంపాస్ మాదిరిగా ముందు వరుసలో రెండు సీట్లు మధ్య వరుసలో బెంచ్ సీటు మరియు చివరి వరుసలో రెండు సీట్ల చొప్పున మొత్తం 7 సీట్లను అందించే అవకాశం ఉంది.

ఏప్రిల్ 2022 నాటికి భారత్‌లో విడుదల కానున్న Jeep Meridian 7-సీటర్ ఎస్‌యూవీ

ఈ కారులో లభించబోయే ఇతర ప్రధాన ఫీచర్లలో 10.21 ఇంచ్ పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ మరియు 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ లభ్యం కానున్నాయి. ఇందులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో పాటుగా బ్రాండ్ యొక్క లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది.

ఏప్రిల్ 2022 నాటికి భారత్‌లో విడుదల కానున్న Jeep Meridian 7-సీటర్ ఎస్‌యూవీ

ఇది అడ్వెంచర్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌కు మద్దతు ఇస్తుంది, దీని సాయంతో కస్టమర్‌ తన స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించి కారును లాక్ చేయడానికి మరియు అన్‌లాక్ చేయడానికి అలాగే ఇంజన్ ను స్టార్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ఇంజన్ విషయంలో కూడా కొత్త 7-సీటర్ జీప్ మెరీడియన్ దాని స్మాల్ బ్రదర్ కంపాస్ ఇంజన్లే కొనసాగించే అవకాశం ఉంది.

ఏప్రిల్ 2022 నాటికి భారత్‌లో విడుదల కానున్న Jeep Meridian 7-సీటర్ ఎస్‌యూవీ

ఇందులో అదే 2.0 లీటర్ 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ ను ఉపయోగించనున్నారు. అయితే, ఈ ఎస్‌యూవీ లోడ్ సామర్థ్యానికి తగినట్లుగా ఈ ఇంజన్ ను రీట్యూన్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం, కంపాస్ ఎస్‌యూవీలోని ఇదే ఇంజన్ గరిష్టంగా 173 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కాగా, 7-సీటర్ మెరీడియన్ ఎస్‌యూవీలోని ఇంజన్ ను గరిష్టంగా 200 బిహెచ్‌పి వరకూ శక్తిని ఉత్పత్తి చేసేలా రీట్యూన్ చేయవచ్చని అంచనా.

ఏప్రిల్ 2022 నాటికి భారత్‌లో విడుదల కానున్న Jeep Meridian 7-సీటర్ ఎస్‌యూవీ

అంతేకాకుండా, కంపెనీ ఈ ఇంజన్ ను 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ తో అవకాశం ఉంది. ఇది వాహనం యొక్క ఇంధన సామర్థ్యాన్ని (మైలేజ్) మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ ఇంజన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్టాండర్డ్ గా లభిస్తుంది. కొత్త జీప్ మెరిడియన్ ఎస్‌యూవీ కూడా 4X4 వ్యవస్థను కలిగి ఉంటుందని సమాచారం.

ఏప్రిల్ 2022 నాటికి భారత్‌లో విడుదల కానున్న Jeep Meridian 7-సీటర్ ఎస్‌యూవీ

ఇక ధర విషయానికి వస్తే, భారతదేశంలో, జీప్ మెరీడియన్ 7-సీటర్ ఎస్‌యూవీని కంపెనీ రూ. 20 లక్షల నుండి రూ. 30 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. ఇది ఈ విభాగంలో ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పేస్, ఎమ్‌జి గ్లోస్టర్, టొయోటా ఫార్చ్యూనర్ మరియు రాబోయే స్కోడా కోడియాక్ పెట్రోల్ వంటి మోడళ్లతో పోటీపడుతుంది.

Most Read Articles

Read more on: #జీప్ #jeep
English summary
Jeep meridian 7 seater suv production to start in india by april 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X