జీప్ ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నాయ్.. టీజర్ వీడియో లాంచ్..

అమెరికన్ కార్ కంపెనీ జీప్ విక్రయిస్తున్న ఐకానిక్ కార్ బ్రాండ్ 'వ్రాంగ్లర్' ఇకపై సరికొత్తగా ఎలక్ట్రిక్ వెర్షన్ రూపంలో కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. జీప్ తమ పాపులర్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ వ్రాంగ్లర్ ఓ ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తయారు చేస్తోంది. ఈ మేరకు కంపెనీ ఓ టీజర్ వీడియోని కూడా విడుదల చేసింది.

జీప్ ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నాయ్.. టీజర్ వీడియో లాంచ్..

ఈ టీజర్ వీడియోను "ది రోడ్ అహెడ్" అనే క్యాప్షన్‌తో విడుదల చేశారు. ఇందులో జీప్ తమ 80 ఏళ్ల చరిత్రను గుర్తు చేస్తూ, అధునాత ఎలక్ట్రిక్ వ్రాంగ్లర్ ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ ఫీచర్లను వెల్లడి చేసింది. అంతేకాకుండా, వీడియోలో కంపెనీ తమ వాగనర్ మరియు గ్రాండ్ చెరోకీ కాన్సెప్ట్‌లను కూడా ఈ వీడియోలో హైలైట్ చేసింది.

జీప్ ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నాయ్.. టీజర్ వీడియో లాంచ్..

దీన్నిబట్టి చూస్తుంటే, జీప్ ఇప్పుడు తమ సాధారణ పెట్రోల్ వాగనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి మరియు తయారీవైపు మొగ్గుచూపినట్లుగా తెలుస్తోంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలదే అగ్రస్థానంగా మారనున్న ప్రస్తుత పరిస్థితుల్లో జీప్ కూడా తమ లైనప్‌లో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ప్రవేశపెట్టాలని చూస్తోంది.

MOST READ:తనను తాను రిపేర్ చేసుకోగల కోమకి ఎలక్ట్రిక్ స్కూటర్ ; వివరాలు

జీప్ ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నాయ్.. టీజర్ వీడియో లాంచ్..

ప్రస్తుతానికి జీప్ ఎలక్ట్రిక్ వాహనాలన్నీ కాన్సెప్ట్ దశలోనే ఉన్నాయి. వీటికి తుదిరూపం రావటానికి మరికొంత సమయం పట్టే ఆస్కారం ఉంది. ఏదేమైనప్పటికీ, జీప్ ఎలక్ట్రిక్ వాహనాలు బయటివైపు నుండి చూడటానికి వాటి పెట్రోల్ వెర్షన్ మాదిరిగానే కనిపిస్తాయని తెలుస్తోంది.

MOST READ:ఈ బైక్ తినేయొచ్చు, మీరు విన్నది నిజమే.. ఓ లుక్కేయండి

జీప్ ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నాయ్.. టీజర్ వీడియో లాంచ్..

అయితే, ఇంటీరియర్ క్యాబిన్ మాత్రం వాటితో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రస్తుతం టెస్లా ఎలక్ట్రిక్ కార్లలో లభిస్తున్న ఆటో పైలట్ ఫీచర్ మాదిరిగానే జీప్ ఎలక్ట్రిక్ వాహనాలలో కూడా ఆటోమేటిక్ 'కో పైలట్' అనే ఫీచర్‌ను కంపెనీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

జీప్ ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నాయ్.. టీజర్ వీడియో లాంచ్..

ఈ టీజర్ వీడియోలో కూడా జీప్ తమ కో పైలట్ టెక్నాలజీని ప్రస్థావించింది. జీప్ వాహనాలకు నాలుగు వైపులా అమర్చిన కెమెరాలు మరియు సెన్సార్ల సాయంతో డ్రైవర్ ప్రమేయం లేకుండా రోడ్లపై జీప్ ఎలక్ట్రిక్ వాహనాలను నడపవచ్చని కంపెనీ ఈ వీడియోలో వివరించింది.

MOST READ:అలెర్ట్.. ఇప్పుడు ఆన్‌లైన్ డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి ఇది తప్పనిసరి

జీప్ ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నాయ్.. టీజర్ వీడియో లాంచ్..

ఇక సోలార్ ఎనర్జీ గురించి కూడా జీప్ తమ వీడియోలో పేర్కొంది. భవిష్యత్తులో సౌరశక్తి నుండి ఉద్భవించే విద్యుత్ సాయంతో కార్లను చార్జ్ చేసుకునేలా సోలార్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ తెలెపింది.

జీప్ ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నాయ్.. టీజర్ వీడియో లాంచ్..

జీప్ ఈ వీడియోలో చూపించినట్లుగా భవిష్యత్తు కోసం ఎలక్ట్రిక్ మరియు సోలార్ ఎనర్జీతో నడిచే వాహనాలను రూపొందించినట్లయితే, ప్రత్యామ్నాయ వనరులతో నడిచే జీప్ వాహనాలకు మరింత గిరాకీ పెరిగే అవకాశం ఉంది.

MOST READ:ఇలయదలపతి విజయ్ ఉపయోగించే లగ్జరీ కార్స్ ఇవే, చూసారా..?

జీప్ ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నాయ్.. టీజర్ వీడియో లాంచ్..

జీప్ ఇండియా న్యూస్ విషయానికి వస్తే, ఈ బ్రాండ్ ఇటీవలే భారత మార్కెట్లో తమ సరికొత్త అప్‌డేటెడ్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని విడుదల చేసింది. మార్కెట్లో ఈ కొత్త 2021 జీప్ కంపాస్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.16.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. - దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

Read more on: #జీప్ #jeep
English summary
Jeep Wrangler Electric SUV Teased In A Video; Launch Expected Soon; Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X