స్కొడా కుషాక్ రాకతో అటకెక్కిన స్కొడా కరోక్ ఎస్‌యూవీ; వెబ్‌సైట్ నుండి తొలగింపు!

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కొడా ఆటో, ఇటీవలే తమ సరికొత్త కుషాక్ మిడ్-సైజ్ ఎస్‌యూవీని ప్రపంచానికి పరిచయం చేసిన సంగతి తెలిసినదే. జూలై 2021లో ఈ మోడల్ భారత రోడ్లపై పరుగులు తీయనుంది. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి మిడ్-సైజ్ సెడాన్లకు పోటీగా ఉంటుంది.

స్కొడా కుషాక్ రాకతో అటకెక్కిన స్కొడా కరోక్ ఎస్‌యూవీ; వెబ్‌సైట్ నుండి తొలగింపు!

సరే ఆ విషయం అటుంచితే, స్కొడా కుషాక్ ఎస్‌యూవీ రాకతో స్కొడా కరోక్ ఎస్‌యూవీ ఇప్పుడు అటక్కెక్కి కూర్చోనుంది. స్కొడా కుషాక్ ఆవిష్కరణతో, ఈ కంపెనీ కొన్ని ప్రపంచ పరిస్థితుల కారణంగా తమ కరోక్ ఎస్‌యూవీని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్కొడా ఇండియా అధికారిక వెబ్‌సైట్ నుండి కూడా కరోక్ మోడల్‌ను తొలగించారు.

స్కొడా కుషాక్ రాకతో అటకెక్కిన స్కొడా కరోక్ ఎస్‌యూవీ; వెబ్‌సైట్ నుండి తొలగింపు!

స్కొడా తమ కరోక్ ఎస్‌యూవీని సిబియు (కంప్లీట్లీ బిల్ట్ అప్) రూట్ ద్వారా పూర్తిగా విదేశాల్లో తయారు చేసిన మోడల్‌ను ఇక్కడికి దిగుమతి చేసుకొని విక్రయించేందు. గతంలో స్కొడా కరోక్ కేవలం ఒకే ఒక వేరియంట్‌లో, ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో లభ్యమయ్యేది. భారత మార్కెట్లో ఈ ఇంపోర్టెడ్ కారు ధర రూ.24.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా ఉండేది.

స్కొడా కుషాక్ రాకతో అటకెక్కిన స్కొడా కరోక్ ఎస్‌యూవీ; వెబ్‌సైట్ నుండి తొలగింపు!

భారత మార్కెట్లో స్కొడా కరోక్ ఎస్‌యూవీ ఈ విభాగంలో జీప్ కంపాస్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. అధిక దిగుమతి సుంఖాల కారణంగా భారతదేశంలో స్కొడా కరోక్ ఎస్‌యూవీ ధర, దాని కాంపిటీటర్లతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉండేది.

స్కొడా కుషాక్ రాకతో అటకెక్కిన స్కొడా కరోక్ ఎస్‌యూవీ; వెబ్‌సైట్ నుండి తొలగింపు!

స్కోడా కరోక్ ఎస్‌యూవీలో 1.5-ఎల్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభ్యమయ్యేది.

స్కొడా కుషాక్ రాకతో అటకెక్కిన స్కొడా కరోక్ ఎస్‌యూవీ; వెబ్‌సైట్ నుండి తొలగింపు!

కంపెనీ సర్టిఫై చేసిన దాని ప్రకారం, స్కొడా కరోక్ ఎస్‌యూవీ లీటరుకు 14.49 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. దీని గరిష్ట వేగాన్ని గంటకు 202 కిలోమీటర్లకు పరిమితం చేశారు.

స్కొడా కుషాక్ రాకతో అటకెక్కిన స్కొడా కరోక్ ఎస్‌యూవీ; వెబ్‌సైట్ నుండి తొలగింపు!

పైన చెప్పినట్లుగా, స్కొడా కరోక్ ఒకే వేరియంట్‌లో ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో లభిస్తుంది. ఇందులో పూర్తి ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, పానరోమిక్ సన్‌రూఫ్, 8.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వర్చువల్ కాక్‌పిట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

స్కొడా కుషాక్ రాకతో అటకెక్కిన స్కొడా కరోక్ ఎస్‌యూవీ; వెబ్‌సైట్ నుండి తొలగింపు!

ఇంకా ఇందులో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కాన్ఫిగర్ యాంబియంట్ లైటింగ్, 9 ఎయిర్‌బ్యాగులు, బ్రేక్ అసిస్ట్, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, హిల్ స్టార్ట్ అసిస్ట్ మరియు రియర్ పార్కింగ్ కెమెరాను వంటి మరెన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

స్కొడా కుషాక్ రాకతో అటకెక్కిన స్కొడా కరోక్ ఎస్‌యూవీ; వెబ్‌సైట్ నుండి తొలగింపు!

తాజా నివేదికల ప్రకారం, స్కొడా తమ కరోక్ ఎస్‌యూవీని స్థానికంగా భారతదేశంలోనే తయారు చేయవచ్చని తెలుస్తోంది. అందుకే, తాత్కాలికంగా ఈ ఇంపోర్టెడ్ మోడల్‌ని నిలిపివేసినట్లు సమాచారం. కరోక్‌ను దేశంలోనే తయారు చేయటం వలన తక్కువ ధరకే ఈ మోడల్‌ను అందించే అవకాశం ఉంటుంది.

స్కొడా కుషాక్ రాకతో అటకెక్కిన స్కొడా కరోక్ ఎస్‌యూవీ; వెబ్‌సైట్ నుండి తొలగింపు!

ఇక స్కొడా కుషాక్ విషయానికి వస్తే, గతంలో కంపెనీ ప్రదర్శించిన విజన్ ఇన్ కాన్సెప్ట్ ఆధారంగా దీనిని తయారు చేశారు. ఉత్పత్తి-సిద్ధంగా ఉన్న ఈ మోడల్‌ను ఫోక్స్‌వ్యాగన్-స్కొడా కంపెనీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎమ్‌క్యూబి ఏ0 ఇన్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించనున్నారు. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

Read more on: #స్కొడా #skoda
English summary
Karoq SUV Removed From Skoda India Official Website, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X