కారులోపల అలంకరణ వస్తువులున్నాయా.. వెంటనే తీసెయ్యండి, లేకుంటే..

భారతదేశంలో రోజురోజుకి వాహనచట్టం మరింత కఠినంగా మారుతోంది. ఇందులో భాగంగానే వాహనాలపై స్టిక్కర్లు నిషేదించబడ్డాయి. ఇప్పుడు కొత్తగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇంకో చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

కారులోపల అలంకరణ వస్తువులున్నాయా.. వెంటనే తీసెయ్యండి, లేకుంటే..

ఇటీవల కేరళ ప్రభుత్వం కారు లోపల ఎలాంటి అలంకార వస్తువులను ఉంచకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, అలంకార వస్తువులను కారులో ఉంచడం నిషేధం. ఈ రకమైన వస్తువులను కలిగి ఉన్న కార్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం రవాణా కమిషనర్‌కు సూచించింది.

కారులోపల అలంకరణ వస్తువులున్నాయా.. వెంటనే తీసెయ్యండి, లేకుంటే..

చాలా కార్లలో ఇప్పుడు వెనుక అద్దానికి ఆటంకం కలిగించే కళాఖండాలు మరియు దండలు వంటివి ఉన్నాయి. ఇవి డ్రైవర్ యొక్క దృష్టికి అంతరాయం కలిగించే అవకాశం ఉంటుంది. కావున ఇది ప్రమాదాలకు కారణమవుతుందని, కేరళ ప్రభుత్వం తెలిపింది.

MOST READ:మెర్సిడెస్ జి-వాగన్ ఎస్‌యూవీలో కనిపించిన బాలీవుడ్ భామ.. ఎవరో తెలుసా?

కారులోపల అలంకరణ వస్తువులున్నాయా.. వెంటనే తీసెయ్యండి, లేకుంటే..

బొమ్మలు, కుషన్లు మరియు ఇతర అలంకరణ వస్తువులను కారు వెనుక భాగంలో ఉంచడం ఇకపై చట్టవిరుద్ధం. కేరళ రవాణా శాఖ ఇప్పటికే హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం సన్ ఫిల్మ్ వాడకంపై చర్యలు తీసుకుంటోంది. ఏ కారులోనైనా ఏర్పాటు చేసిన స్క్రీన్, శాన్ ఫిల్మ్‌లను తొలగించాలని కేరళ హైకోర్టు ఆదేశించింది.

కారులోపల అలంకరణ వస్తువులున్నాయా.. వెంటనే తీసెయ్యండి, లేకుంటే..

కారులోపల ఉండే అలంకరణ వస్తువులు డ్రైవర్ డ్రైవింగ్ చేయడానికి కొంత ఆటంకం కలిగిస్తాయి. కావున ఇప్పుడు అవి నిషేదించబడ్డాయి. ఇందులో ముఖ్యంగా చిన్న బొమ్మలు, ప్రమాదం జరిగినప్పుడు పేలుడు పదార్థాలుగా మారతాయి. దీనివల్ల కారులోని డ్రైవర్ లేదా ప్రయాణీకుడికి గాయాలు కావచ్చు. మొబైల్ ఫోన్లు మరియు పర్సులు కూడా కారులో భద్రంగా ఉండాలి. వీటన్నింటిని డాష్‌బోర్డ్‌లో ఉంచడం మంచిది.

MOST READ:మీరు చూసారా.. ఓలా కంపెనీ నుంచి రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే

కారులోపల అలంకరణ వస్తువులున్నాయా.. వెంటనే తీసెయ్యండి, లేకుంటే..

కారు లోపలి భాగాన్ని అలంకరించాలనుకునే వారు డ్రైవర్ యొక్క డ్రైవింగ్ కి అంతరాయం కలిగించని వస్తువులను ఉంచవచ్చు. చిన్న అలంకరణలను కారు డాష్‌బోర్డ్‌లో ఉంచుకోవచ్చని కేరళ గవర్నమెంట్ తెలిపింది.

కారులోపల అలంకరణ వస్తువులున్నాయా.. వెంటనే తీసెయ్యండి, లేకుంటే..

సీట్లు కవర్లు స్టిక్కర్లు మరియు కాగితపు అలంకరణలను ఉపయోగించి అలంకరించవచ్చు. దీనివల్ల ఎలాంటి సమస్యలు రావు. అలంకరణ వస్తువులను తొలగించడానికి కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్య నిజంగా ప్రశంసనీయం. దీని వాహనదారులు తప్పకుండా పాటించాలి. అపుడే వీటి వల్ల జరిగే ప్రమాదాలు తగ్గుతాయి.

MOST READ:అద్భుతంగా ఉన్న శ్రీమంతుడు 'మహేష్ బాబు' కారావ్యాన్.. మీరూ ఓ లుక్కేయండి

Most Read Articles

English summary
Kerala Government Bans Interior Decoration In Cars. Read in Telugu.
Story first published: Tuesday, March 9, 2021, 11:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X