భారత్‌లో విక్రయిస్తున్న కియా కార్లపై కొత్త లోగో

కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్, భారతదేశంలో తమ డీలర్షిప్ అనుభవాన్ని పునరుద్ధరించాలని ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం కంపెనీ ఓ సరికొత్త వ్యూహాన్ని కూడా సిద్ధం చేసుకుంటోంది. ఈ మేరకు కియా మోటార్స్ తమ కొత్త బ్రాండ్ స్ట్రాటజీని ప్రకటించింది.

కియా తమ కస్టమర్ల కోసం స్థిరమైన చలనశీలత పరిష్కారాలను (సస్టైనబల్ మొబిలిటీ సొల్యూషన్స్) అందించాలని చూస్తుంది. కొద్ది రోజుల క్రితమే కంపెనీ తమ సరికొత్త లోగోను ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించింది. దక్షిణ కొరియాలో జరిగిన ఓ వేడుకలో కియా మోటార్స్ తమ కొత్త లోగోను ఆవిష్కరించింది.

భారత్‌లో విక్రయిస్తున్న కియా కార్లపై కొత్త లోగో

అంతేకాకుండా, కంపెనీ పేరును 'కియా మోటార్స్' నుండి 'కియా' గా మార్చడం ద్వారా తన కార్పొరేట్ గుర్తింపును కూడా మార్చింది. ప్రపంచవ్యాప్తంగా విక్రయించే కియా కార్లపై ఈ కొత్త లోగోను ఉపయోగించడం జరుగుతుంది. ఆ మాటకొస్తే, భారతదేశంలో విక్రయించే కియా కార్లపై కూడా ఈ కొత్త లోగోను ఉపయోగించనున్నారు.

భారత్‌లో విక్రయిస్తున్న కియా కార్లపై కొత్త లోగో

ఈ ఏడాది మధ్య భాగం నాటికి కియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న సోనెట్ మరియు సెల్టోస్ ఎస్‌యూవీలపై ఈ కొత్త లోగోను ఉపయోగించనున్నారు. ఈ విషయాన్ని కియా కార్పొరేషన్ సిఈఓ హో చుంగ్-సాంగ్ ధృవీకరించారు.

"కొత్త లోగోను త్వరలో భారతదేశంలో విక్రయించే కార్లకు చేర్చనున్నారు. ఈ ఏడాది మధ్యలో సెల్టోస్ మరియు సొనెట్ కార్లపై కొత్త లోగోను ఉపయోగించే అవకాశం ఉంద"ని ఆయన చెప్పారు.

MOST READ:భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ రోజు పెట్రోల్ ధర ఎంతంటే?

భారత్‌లో విక్రయిస్తున్న కియా కార్లపై కొత్త లోగో

అంతేకాకుండా, డీలర్‌షిప్ కేంద్రాలలో కూడా ఈ లోగోను మార్చేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. కేవలం లోగో మార్పులే కాకుండా, కస్టమర్లకు అందించే సేవల్లో కూడా గణనీయమైన మార్పులు చేయాలని కంపెనీ కృషి చేస్తోంది.

కియా మోటార్ కంపెనీ భారతదేశంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న కార్ బ్రాండ్. ప్రస్తుతం ఈ కంపెనీ నుండి మూడు మోడళ్లు (సోనెట్, సెల్టోల్ మరియు కార్నివాల్) లభిస్తున్నాయి. ప్రత్యేకించి, సోనెట్ మరియు సెల్టోస్ మోడళ్లకు మార్కెట్ నుండి భారీ డిమాండ్ ఏర్పడింది.

భారత్‌లో విక్రయిస్తున్న కియా కార్లపై కొత్త లోగో

అనతికాలంలోనే కియా సంపాధించుకున్న బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుకునేందుకు, భారత కార్ మార్కెట్లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకునేందుకు కంపెనీ గట్టిగా కృషి చేస్తోంది. ఈ మేరకు భారత మార్కెట్లో మరిన్ని కొత్త కార్లను కూడా విడుదల చేయాలని కియా ప్లాన్ చేస్తోంది.

MOST READ:ఈ ఏడాది భారత్‌లో లాంచ్ కానున్న టాప్ 5 కార్లు : వివరాలు

భారత్‌లో విక్రయిస్తున్న కియా కార్లపై కొత్త లోగో

పెరిగిన సోనెట్ మరియు సెల్టోస్ కార్ల ధరలు

కియా మోటార్స్‌కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ తమ పాపులర్ సోనెట్ మరియు సెల్టోస్ కార్ల ధరలను పెంచింది. కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్‌ను కియా సొనెట్, సెల్టోస్ వాహనాల ఎక్స్-షోరూమ్ ధరలు రూ.20,000 వరకూ పెరిగాయి. దీనిని ఆన్-రోడ్ ధరకు కన్వర్ట్ చేసుకుంటే సుమారు రూ.70,000 వరకూ పెరుగుతుంది. - కొత్త ధరల జాబితా కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

మూలం - సిఎన్‌బి

Most Read Articles

English summary
Kia Cars In India Will Get New Logo By Mid 2021. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X