కియా మోటార్స్ నుండి వస్తున్న సరికొత్త ఎలక్ట్రిక్ కార్, టీజర్ లాంచ్

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆటోమొబైల్ కంపెనీలు సాంప్రదాయ్ పెట్రోల్, డీజిల్ వాహనాలతో పాటుగా ఎలక్ట్రిక్ వాహనాలను కూడా అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. అంతరించిపోతున్న శిలాజ ఇంధనాల సమస్యకు చెక్ పెట్టేందుకు ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పుడు ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలపై ఆసక్తి కనబరుస్తున్నారు.

కియా మోటార్స్ నుండి వస్తున్న సరికొత్త ఎలక్ట్రిక్ కార్, టీజర్ లాంచ్

ఈ నేపథ్యంలో, ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ కార్లకు గిరాకీ బాగా పెరిగింది. తాజాగా కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ కూడా భారత ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే కియా తమ సరికొత్త ఈవీ6 ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన మొదటి అధికారిక చిత్రాలను విడుదల చేసింది.

కియా మోటార్స్ నుండి వస్తున్న సరికొత్త ఎలక్ట్రిక్ కార్, టీజర్ లాంచ్

కియా ఈవీ6 ఈ బ్రాండ్ యొక్క మొట్టమొదటి డెడికేటెడ్ బిఈవీ (బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్)గా ఉంటుంది. ఇది పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫామ్‌గా ఉండనుంది. కియా మోటార్స్ ఇప్పటికే తమ గ్లోబల్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలను కలిగి ఉన్నప్పటికీ, ఈ కొత్త కియా ఈవీ6 మాత్రం పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మితం కానుంది.

MOST READ:ఢిల్లీలో భారీగా తగ్గిన రోడ్డు ప్రమాదాలు.. కారణం మాత్రం ఇదే

కియా మోటార్స్ నుండి వస్తున్న సరికొత్త ఎలక్ట్రిక్ కార్, టీజర్ లాంచ్

కియా మోటార్స్ ఇకపై భవిష్యత్తులో తాము తయారు చేయబోయే అన్ని ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఇదే బీఈవీ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించనుంది. కొత్త కియా ఈవీ6 బ్రాండ్ యొక్క నెక్స్ట్ జనరేషన్ బీఈవీ సమర్పణలలో భాగంగా ఉంటుంది. అంతేకాకుండా, ఇది కొత్త డిజైన్ ఫిలాసఫీని మరియు కొత్త ఇ-జిఎమ్‌పి (ఎలక్ట్రిక్-గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్)ను కూడా కలిగి ఉంటుంది.

కియా మోటార్స్ నుండి వస్తున్న సరికొత్త ఎలక్ట్రిక్ కార్, టీజర్ లాంచ్

కియా మోటార్స్ అనుబంధ సంస్థ అయిన హ్యుందాయ్ కూడా తమ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో కొత్త ఇ-జిఎమ్‌పి (ఎలక్ట్రిక్-గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్)ను ఉపయోగిస్తుంది. కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారును కంపెనీ ఈ నెలాఖరు నాటికి ఆవిష్కరించే అవకాశం ఉంది. తాజాగా, కంపెనీ ఇందుకు సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేసింది.

MOST READ:బెంగళూరులో మీకు నచ్చిన బైక్ డ్రైవ్ చేయాలంటే.. ఇలా బుక్ చేయండి

కియా మోటార్స్ నుండి వస్తున్న సరికొత్త ఎలక్ట్రిక్ కార్, టీజర్ లాంచ్

ఈ టీజర్ చిత్రాలను చూస్తుంటే, కియా నుండి రానున్న ఈ ఎలక్ట్రిక్ వాహనం క్రాస్ఓవర్ లేదా ఎస్‌యూవీ మోడల్‌గా రాబోతోందని స్పష్టమవుతోంది. ఈ కారు బోనెట్‌పై మజిక్యులర్ బాడీ లైన్స్‌ను మనం గమనించవచ్చు. ముందు భాగంలో డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ఆకర్షణీయమైన ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు మరియు వెనుక వైపు సన్నటి ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్‌ను ఇందులో గమనించవచ్చు.

కూప్ మోడల్ స్టైల్ రూఫ్, వెనుక భాగంలో స్పాయిలర్, రైజ్డ్ బూట్ డిజైన్ లిప్, స్మోక్డ్ టెయిల్ ల్యాంప్స్ వంటి మార్పులు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ కారులోని ఇంటీరియర్ వివరాలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. కియా మోటార్స్ ఈ కారులోని ఇంటీరియర్స్‌ను చాలా ఫ్యూచరిస్టిక్‌గా, ఫుల్లీ టెక్ లోడెడ్ ఫీచర్లతో డిజైన్ చేయవచ్చని తెలుస్తోంది.

MOST READ:కారులోపల అలంకరణ వస్తువులున్నాయా.. వెంటనే తీసెయ్యండి, లేకుంటే..

హ్యుందాయ్ కూడా తమ ఇ-జిఎమ్‌పి ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన మొట్టమొదటి మోడల్ అయానిక్-5 ఇటీవలే ఆవిష్కరించింది. ఈ కొత్త కియా ఈవీ6 కారును కూడా ఇదే ప్లాట్‌ఫామ్‌పై తయారు చేస్తున్న నేపథ్యంలో, హ్యుందాయ్ అయానిక్-5 కారులో కనిపించే అనేక సాంకేతిక ఫీచర్లు ఈ కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారులో కూడా కనిపిస్తాయని భావిస్తున్నారు.

హ్యుందాయ్ అయానిక్-5 కారులో ఉపయోగించిన 300 బిహెచ్‌పి పవర్ మరియు 600 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్, లాంగ్ రేంజ్ బ్యాటరీ ప్యాక్ వంటి ఫీచర్లను కియా ఈవీ6లో కూడా ఆశించవచ్చు. కియా మోటార్స్ ఈ కారును అతి త్వరలోనే ప్రజల దృష్టికి తీసుకువస్తున్న నేపథ్యంలో, దీని బ్యాటరీ, రేంజ్ పనితీరుతో సహా అనేక ముఖ్యమైన విషయాలు వెల్లడి కానున్నాయి.

MOST READ:మెర్సిడెస్ జి-వాగన్ ఎస్‌యూవీలో కనిపించిన బాలీవుడ్ భామ.. ఎవరో తెలుసా?

కియా మోటార్స్ నుండి వస్తున్న సరికొత్త ఎలక్ట్రిక్ కార్, టీజర్ లాంచ్

ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో సరికొత్త ఈవీ6 బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం యొక్క వరల్డ్ ప్రీమియర్ ఉంటుందని కియా ప్రకటించింది. ఈ కియా ఈవీ6 బోనెట్ మధ్యలో బ్రాండ్ యొక్క కొత్త లోగోను కూడా మనం ఈ టీజర్‌లో గమనించవచ్చు. కియా మోటార్స్ ఇటీవలే తమ బ్రాండ్ లోగోను మార్చుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. - ఈ కొత్త లోగోకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Kia Motors Next Generation BEV EV6 Teased Ahead Of Global Premier, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X