ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 5 కోట్లు విరాళం ప్రకటించిన కియా మోటార్స్

భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన కియా మోటార్స్ ఇటీవల కరోనా రక్కసి కోరల్లో నలిగిపోతున్న రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఇందులో భాగంగానే కియా ఇండియా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి రూ. 5 కోట్లు విరాళంగా అందిస్తామని ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 5 కోట్లు విరాళం ప్రకటించిన కియా మోటార్స్

కియా ఇండియా దీనికి సంబంధించిన పత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి అందజేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూడా కరోనా మహమ్మారి వల్ల భారీ నష్టాలను చవిచూస్తోంది. ఇప్పటికే ఆంధ్రరాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎంతోమంది ప్రజలు మరణించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 5 కోట్లు విరాళం ప్రకటించిన కియా మోటార్స్

ఇప్పటికి కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఈ మహమ్మారి వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే కరోనా లాక్ డౌన్ కూడా అమలుచేసింది. ప్రస్తుతం కూడా ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ అమలులో ఉంది.

MOST READ:అవసరమైన వారికి ఉచితంగా ఆక్సిజన్ అందిస్తున్న 26 ఏళ్ల యువతి.. నిజంగా గ్రేట్ కదా..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 5 కోట్లు విరాళం ప్రకటించిన కియా మోటార్స్

ఈ పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రానికి కొన్ని కొంతమంది వ్యక్తులు మరియు సంస్థలు తమవంతు సాయంగా ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే కియా మోటార్స్ సంస్థ ముందుకువచ్చింది. కియా సంస్థ ఇప్పుడు మాత్రమే కాదు, గత సంవత్సరం 2020 లోకూడా తన సిఎస్ఆర్ నిధులలో రూ. 2 కోట్ల రూపాయలు సిఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా అందించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 5 కోట్లు విరాళం ప్రకటించిన కియా మోటార్స్

ఆంధ్రప్రదేశ్ క్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలో నేనున్నానంటూ వస్తున్న సంస్థ కియా మోటార్స్. కియా మోటార్స్ ఈ నెల ప్రారంభంలో, కొత్త 2021 సెల్టోస్ మరియు సోనెట్ ఎస్‌యూవీని భారతదేశంలో విడుదల చేసింది. రెండు మోడళ్లు సఅప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండతంతో పాటు కొత్త లోగోను కూడా కలిగి ఉంది.

MOST READ:లాక్‌డౌన్ రూల్స్ గాలికొదిలేసిన ముఖ్యమంత్రి కొడుకు.. ఎవరో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 5 కోట్లు విరాళం ప్రకటించిన కియా మోటార్స్

వరించిన ఫీచర్ జాబితాతో పాటు బ్రాండ్ యొక్క కొత్త లోగోను కలిగి ఉంటాయి. భారత్‌లో విడుదలైన 2021 కియా సెల్టోస్ అండ్ సోనెట్ గురించి పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 5 కోట్లు విరాళం ప్రకటించిన కియా మోటార్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించిన సహకారం గురించి కియా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూఖ్యూన్ షిమ్ మాట్లాడుతూ కరోనా ఆంధ్ర రాష్టంలో చాలా వేగంగా పెరుగుతూ చాలా నష్టాలకు కారణమవుతోంది. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపించిన చొరవ చాలా ప్రశంసనీయం.

MOST READ:అలెర్ట్: 2.36 లక్షల రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు వెనక్కి.. కారణం ఏమంటే?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 5 కోట్లు విరాళం ప్రకటించిన కియా మోటార్స్

హాస్పిటల్స్ లో ఆక్సిజన్ లెవెల్స్, వెంటిలేటర్లు మరియు డి 4 టైప్ మెడికల్ గ్రేడ్ సిలిండర్లతో సహా అవసరమైన వైద్య పరికరాల అవసరాలను తీర్చడానికి కంపెనీ అందించిన నిధులను ఉపయోగపడతాయని ఆయన అన్నారు. అంతే కాకుండా ఈ కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ప్రభుత్వానికి ఏ సమయంలో అయినా పూర్తి మద్దతు మరియు సహకారం అందిస్తామని తెలిపారు.

Most Read Articles

English summary
Kia India Contributes Rs 5 Crore To the Andhra Pradesh Government. Read in Telugu.
Story first published: Friday, May 21, 2021, 11:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X