అక్టోబర్ 2021 నెలలో Kia Sletos బెస్ట్.. ఆ తర్వాతనే Kia Sonet..

కొరియన్ కార్ బ్రాండ్ కియా ఇండియా (గతంలో కియా మోటార్స్), గడచిన అక్టోబర్ 2021 నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 2021 నెలలో కియా ఇండియా (Kia India) భారత మార్కెట్లో మొత్తం 16,331 కార్లను విక్రయించింది. కాగా, అక్టోబర్ 2020 నెలలో కియా మొత్తం 21,021 కార్లను విక్రయించింది. ఈ సమయంలో కియా ఇండియా అమ్మకాలు 22.3 శాతం క్షీణించాయి. గత నెలలో అత్యధికంగా అమ్ముడైన కియా కారుగా సెల్టోస్ మొదటి స్థానంలో ఉంది.

అక్టోబర్ 2021 నెలలో Kia Sletos బెస్ట్.. ఆ తర్వాతనే Kia Sonet..

ప్రపంచవ్యాప్తంగా, ఆటోమొబైల్ పరిశ్రమ సెమీకండక్టర్ చిప్స్ కొరతను ఎదుర్కుంటున్న నేపథ్యంలో భారతదేశంలోని కూడా ఆటోమొబైల్ కంపెనీలు వాహనాల ఉత్పత్తి మరియు అమ్మకాలలో తగ్గుదలను చూశాయి. అయితే, కియా ఇండియా మాత్రం ఈ సమస్యను చక్కగా అధిగమించేందుకు ప్రయత్నిస్తోంది. కియా బ్రాండ్ నుండి ప్రస్తుతం భారత మార్కెట్లో సెల్టోస్ (Seltos), సోనెట్ (Sonet) మరియు కార్నివాల్ (Carnival) అనే మొత్తం 3 కార్లు లభిస్తున్నాయి.

అక్టోబర్ 2021 నెలలో Kia Sletos బెస్ట్.. ఆ తర్వాతనే Kia Sonet..

గడచిన అక్టోబర్ 2021 లో కియా ఇండియా మొత్తం 10,488 సెల్టోస్ కార్లను విక్రయించింది. గత నెలలో సెల్టోస్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ కేవలం కియా బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడైన కారుగానే కాకుండా, ఈ విభాగంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో కియా సెల్టోస్ తర్వాత 6,455 యూనిట్ల అమ్మకాలతో హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. అక్టోబర్ 2020లో కియా మొత్తం 8,900 సెల్టోస్ కార్లను విక్రయించింది. ఈ సమయంలో సెల్టోస్ అమ్మకాలు 18 శాతం వృద్ధిని సాధించాయి.

అక్టోబర్ 2021 నెలలో Kia Sletos బెస్ట్.. ఆ తర్వాతనే Kia Sonet..

ఇకపోతే, కియా నుండి అత్యధికంగా అమ్ముడైన రెండవ కారు కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. గత అక్టోబర్ 2021 నెలలో మొత్తం 5,433 సోనెట్ కార్లు అమ్ముడయ్యాయి. అయితే, అక్టోబర్ 2020 నెలలో కంపెనీ విక్రయించిన 11,721 యూనిట్లతో పోలిస్తే, కియా సోనెట్ అమ్మకాలు భారీగా 53.56 శాతం క్షీణించాయి. దీన్నిబట్టి చూస్తుంటే, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీకి మొదట్లో లభించిన ఆదరణ క్రమంగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఈ విభాగంలో పెరిగిన పోటీ అని చెప్పవచ్చు.

అక్టోబర్ 2021 నెలలో Kia Sletos బెస్ట్.. ఆ తర్వాతనే Kia Sonet..

కియా ఇండియా విక్రయిస్తున్న ఇంపోర్టెడ్ ఎమ్‌పివి కార్నివాల్ విషయానికి వస్తే, ఈ మోడల్ అమ్మకాలలో ఎలాంటి మార్పు లేదు. అక్టోబర్ 2020 మరియు అక్టోబర్ 2021 నెలల్లో కంపెనీ ఒకేరకంగా 400 యూనిట్ల కార్నివాల్ ఎమ్‌పివిలను విక్రయించింది. గడచిన సెప్టెంబర్ 2021 నెలలో కియా భారత మార్కెట్లో తమ కొత్త '2021 కియా కార్నివాల్' (Kia Carnival) ఎమ్‌పివిని విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ఈ కారు ప్రారంభ ధర రూ. 24.95 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

అక్టోబర్ 2021 నెలలో Kia Sletos బెస్ట్.. ఆ తర్వాతనే Kia Sonet..

ఓవరాల్‌గా చూస్తే, 2021 క్యాలెండర్ ఇయర్‌లో కియా ఇండియా దేశీయ మార్కెట్లో 1.50 లక్షలకు పైగా కార్లను విక్రయించింది. ఈ ఏడాది జనవరి-అక్టోబర్ 2021 మధ్యకాలంలో కియా భారత మార్కెట్లో 1,59,641 కార్లను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో (2020లో) కియా 1,07,657 కార్లను విక్రయించింది. ఈ సమయంలో కియా ఇండియా మొత్తం అమ్మకాలు 48 శాతం వృద్ధిని నమోదు చేశాయి. సెల్టోస్ మరియు సోనెట్ కార్ల వృద్ధితోనే కియా ఇండియా ఈ విజయాన్ని సాధించగలిగింది.

అక్టోబర్ 2021 నెలలో Kia Sletos బెస్ట్.. ఆ తర్వాతనే Kia Sonet..

భారత మార్కెట్లో చాలా కాలంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫోర్డ్ వంటి కంపెనీలు మార్కెట్ నుండి వైదొలగడంతో కియా వృద్ధికి ప్రాధాన్యత పెరుగుతోంది. కియా సమీప భవిష్యత్తులో మరిన్ని కార్లను భారతదేశంలో విడుదల చేయాలని యోచిస్తోంది. ఇందులో ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉన్నాయి. కియా నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న సెల్టోస్ కారులో కంపెనీ ఓ ఎలక్ట్రిక్ వెర్షన్‌ ను కూడా విడుదల చేయాలని చూస్తోంది. కియా సెల్టోస్ ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, స్కోడా కుషాక్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి కార్లతో పోటీపడుతుంది.

అక్టోబర్ 2021 నెలలో Kia Sletos బెస్ట్.. ఆ తర్వాతనే Kia Sonet..

Kia Carnival లో 6-సీటర్ వెర్షన్

ఇక కియా కార్నివాల్ ప్రీమియం ఎమ్‌పివి విషయానికి వస్తే, ఇది కస్టమర్ల అవసరాలకు తగినట్లుగా ఏడు, ఎనిమిది మరియు తొమ్మిది సీట్ల కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది. అయితే, 9-సీటర్ వెర్షన్ కు తక్కువ డిమాండ్ ఉన్న కారణంగా, కంపెనీ ఇందులో ఈ వేరియంట్ ను తొలగించి వేసింది. అంతేకాకుండా, కార్నివాల్ ఎమ్‌పివిలో కంపెనీ ఓ కొత్త 6-సీటర్ వేరియంట్ ను కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సమాచారం ప్రకారం, కంపెనీ ఈ 6 సీటర్ కియా కార్నివాల్ ఎమ్‌పివిని రూ. 28.95 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో ప్రారంభించవచ్చని అంచనా.

అక్టోబర్ 2021 నెలలో Kia Sletos బెస్ట్.. ఆ తర్వాతనే Kia Sonet..

కొత్తగా రాబోయే 6-సీటర్ వెర్షన్ కియా కార్నివాల్ ఎమ్‌పివిలో రెండవ మరియు మూడవ వరుసల కోసం వ్యక్తిగత కెప్టెన్ సీట్లు ఉండే అవకాశం ఉంది. ఈ మార్పు వలన ఈ ఎమ్‌పిలో ఇప్పుడు మరింత విశాలమైన 540 లీటర్ల బూట్‌ స్పేస్ లభించనుంది. మరింత ఎక్కువ బూట్ స్పేస్ కావాలనుకునే వారు మధ్య మరియు మూడవ వరుసలలోని సీట్లను మడచినట్లయితే, ఇందులో 2,759 లీటర్ల బూటి స్పేస్ లభిస్తుంది. కొత్తగా రాబోయే కియా కార్నివాల్ 6 సీటర్ వెర్షన్ ను మిడ్-స్పెక్ ప్రెస్టీజ్ ట్రిమ్‌ లో మాత్రమే అందించబడుతుందని సమాచారం.

అక్టోబర్ 2021 నెలలో Kia Sletos బెస్ట్.. ఆ తర్వాతనే Kia Sonet..

కియా కార్నివాల్ ప్రెస్టీజ్ ట్రిమ్ లో ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్, 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 18 ఇంచ్ క్రిస్టల్ కట్ అల్లాయ్ వీల్స్, ట్రిపుల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్ మొదలైన ఫీచర్లు లభ్యం కానున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Kia india model wise sales report in october 2021 seltos tops the list
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X