2040 నాటికి అన్నీ ఎలక్ట్రిక్ కార్లే తయారు చేస్తాం: Kia

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా (Kia) 2040 నాటికి అన్ని ప్రధాన మార్కెట్‌లలో పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే విక్రయించనున్నట్లు ప్రకటించింది. కియా ప్రపంచవ్యాప్తంగా 2045 నాటికి దాని సప్లయ్ చైన్ మరియు మ్యానుఫాక్చరింగ్ నెట్‌వర్క్‌ లో పూర్తిగా 100 శాతం కార్బన్ న్యూట్రాలిటీని (సున్నా కాలుష్య ఉద్ఘారాలను) సాధించాలనే ప్రణాళికలో భాగంగా ఈ ప్రకటన చేసింది.

2040 నాటికి అన్నీ ఎలక్ట్రిక్ కార్లే తయారు చేస్తాం: Kia

ఇకపై భవిష్యత్తులో కియా తయారు చేయబోయే కార్లలో ఎక్కువ శాతం ఎలక్ట్రిక్ వాహనాలు ఉండబోతున్నాయి. మరో ఇరవై ఏళ్లలో కియా పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే తయారు చేస్తుంది. భూమిలో శిలాజ ఇంధనాలు అంతరించపోతుండటమే ఇందుకు ప్రధాన కారణం. కియా కంపెనీయే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఇదే ప్రణాళికపై పనిచేస్తున్నాయి.

2040 నాటికి అన్నీ ఎలక్ట్రిక్ కార్లే తయారు చేస్తాం: Kia

ఎలక్ట్రిక్ కార్ల తయారీ తక్కువ ఖర్చుతో కూడుకున్నదే కాకుండా, పెట్రోల్ కార్లతో పోల్చుకుంటే వాటి రన్నింగ్ కాస్ట్ మరియు మెయింటినెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కియా 2040 నాటికి తమ ఉత్పత్తి శ్రేణి మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే కలిగి ఉంటుందని పేర్కొంది. అయితే, ఐరోపా (యూరప్) లో 2035 నాటికే పూర్తిగా ఎలక్ట్రిక్‌ మొబిలిటీకి మారాలని యోచిస్తున్నట్లు కియా తెలిపింది.

2040 నాటికి అన్నీ ఎలక్ట్రిక్ కార్లే తయారు చేస్తాం: Kia

అంతేకాకుండా, 2040 నాటికి కియా యొక్క ఉత్పత్తి సౌకర్యాలన్నీ కూడా పూర్తిగా పునరుత్పాదక శక్తితో నడుస్తాయని అలాగే, యూఎస్ఏ, కొరియా, చైనా మరియు భారతదేశంలోని కంపెనీ వ్యాపార విభాగాలు సౌరశక్తి విద్యుత్ ఉత్పత్తికి మారుతాయని కంపెనీ పేర్కొంది. ఇదిలా ఉంటే కియా తాజాగా మరో కొత్త ఎలక్ట్రిక్ కారును అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

2040 నాటికి అన్నీ ఎలక్ట్రిక్ కార్లే తయారు చేస్తాం: Kia

కియా ఈవీ6 విజయం తర్వాత కంపెనీ కియా ఈవీ9 (Kia EV9) పేరుతో ఓ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో, కంపెనీ తమ కొత్త ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్ టీజర్ చిత్రాలను కూడా విడుదల చేసింది. ఈ టీజర్ చిత్రాలను చూస్తుంటే, కియా ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బాక్సీ డిజైన్ సిల్హౌట్ ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి ఈవీ6 కన్నా పూర్తిగా భిన్నంగా ఉండే అవకాశం ఉంది.

2040 నాటికి అన్నీ ఎలక్ట్రిక్ కార్లే తయారు చేస్తాం: Kia

కియా నుండి రాబోయే ఈ సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రోగ్రెసివ్ డిజైన్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్ మరియు అధునాతన ఆల్-ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ కలయికను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. టీజర్ చిత్రాలలో చూసినట్లుగా, ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ చాలా షార్ప్ క్రీజ్‌లైన్లను కలిగి ఉంది. ముందు భాగంలో మిరుమిట్లు గొలిపే గ్రిల్‌తో పాటు సొగసైన Z-ఆకారపు డేటైమ్ రన్నింగ్ లైట్లు కూడా ఉన్నాయి.

2040 నాటికి అన్నీ ఎలక్ట్రిక్ కార్లే తయారు చేస్తాం: Kia

ఈ కాన్సెప్ట్ ఎస్‌యూవీ ఫస్ట్ టీజర్ చిత్రాలు దాని అల్ట్రా మోడ్రన్ ఎక్స్‌టీరియర్ డిజైన్‌ను బహిర్గతం చేసేలా ఉన్నాయి. ఇది చూడటానికి నిటారుగా, మాచో స్టైల్ లో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి, ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇంటీరియర్ మరియు పవర్‌ట్రైన్ విషయాల గురించి ఎలాంటి సమాచారం లేదు. అయితే, మరిన్ని వివరాలను కంపెనీ నవంబర్ 17, 2021వ తేదీన వెల్లడించే అవకాశం ఉంది.

2040 నాటికి అన్నీ ఎలక్ట్రిక్ కార్లే తయారు చేస్తాం: Kia

Kia EV6 గురించి క్లుప్తంగా..

ఇదిలా ఉంటే, కియా మోటార్స్ విక్రయిస్తున్న ఈవీ6 ఎలక్ట్రిక్ కారు విషయానికి వస్తే, ఇటీవలే కొన్ని ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయానికి వచ్చిన ఈ నెక్స్ట్ జనరేషన్ బీఈవీ (బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్) 'కియా ఈవీ6' (Kia EV6) ఆయా మార్కెట్ల నుండి సానుకూల స్పందన పొందుతోంది. కియా ఈవీ6 ఈ బ్రాండ్ నుండి వచ్చిన మొట్టమొదటి డెడికేటెడ్ బిఈవీ. కంపెనీ ఈ ఎలక్టిక్ కారును పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసింది. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఇ-జిఎమ్‌పి (ఎలక్ట్రిక్-గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్) అని కూడా పిలుస్తారు.

2040 నాటికి అన్నీ ఎలక్ట్రిక్ కార్లే తయారు చేస్తాం: Kia

కియా ఈవీ6 ముందు భాగంలో సన్నటి ఫ్రంట్ గ్రిల్ మరియు ఇంటిగ్రేటెడ్ డిఆర్ఎల్స్‌తో కూడిన హెడ్‌ల్యాంప్స్, బోనెట్‌పై మజిక్యులర్ బాడీ లైన్స్, ఆల్ బ్లాక్ పిల్లర్స్, టర్న్ ఇండికేటర్లతో కూడిన బ్లాక్ కలర్ సైడ్ మిర్రర్స్, కారు, చుట్టూ సన్నటి బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్, పాప్ అప్ డోర్ హ్యండిల్స్, హుడ్‌పై కొత్త కియా బ్యాడ్జ్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇంకా ఇందులో స్టైలిష్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్, కూప్ మోడల్ స్టైల్ రూఫ్, వెనుక భాగంలో స్పాయిలర్, షార్క్ ఫిన్ యాంటెన్నా, రైజ్డ్ బూట్ డిజైన్ లిప్, బూట్ పొడవునా ఉండే పెద్ద టెయిల్ ల్యాంప్, సైడ్ బాడీ ప్యానెల్స్ మరియు రియర్ బంపర్‌పై సిల్వర్ గార్నిష్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

2040 నాటికి అన్నీ ఎలక్ట్రిక్ కార్లే తయారు చేస్తాం: Kia

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో ఇంటీరియర్ థీమ్ డ్యూయెల్ టోన్‌లో డిజైన్ చేయబడి ఉంటుంది. ఈ థీమ్‌కు తగినట్లుగానే స్టీరింగ్ వీల్‌ని కూడా డ్యూయెల్ టోన్‌లో ఫినిష్ చేయబడి ఉంటుంది. ఇంకా ఇందులో రెండు పెద్ద డిజిటల్ డిస్‌ప్లే స్క్రీన్‌లు ఉంటాయి. వాటిలో ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం మరొకటి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ఉపయోగిస్తారు.

2040 నాటికి అన్నీ ఎలక్ట్రిక్ కార్లే తయారు చేస్తాం: Kia

అంతేకాకుండా, ఈ ఎలక్ట్రిక్ కారులో పూర్తి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంజన్ పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్, ఎలక్ట్రిల్లీ అడ్జస్టబల్ ఫ్రంట్ సీట్స్, గుండ్రటి డయల్‌తో కూడిన గేర్ సెలక్టర్, ప్రీమియం ఆడియో సిస్టమ్ మరియు విశాలమైన లగేజ్ రూమ్ వంటి ఫీచర్లతో ఈ కియా ఈవీ6 కారును రూపొందించారు. దీని పవర్‌ట్రైన్ హ్యుందాయ్ అయానిక్ 5 మాదిరిగానే ఉంటుందని సమాచారం.

Most Read Articles

English summary
Kia motors previewed ev9 electric suv concept details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X