Just In
- 9 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 20 hrs ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 22 hrs ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 23 hrs ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
మోదీ దుకాణంలో మందులు అగ్గువ -శానిటరీ ప్యాడ్ రూ.2.50కే: ప్రధాని; 7500వ జన ఔషధి కేంద్రం ప్రారంభం
- Movies
రాజీవ్ కనకాల మా నాన్న.. చైల్డ్ ఆర్టిస్ట్ మాటలకు సుమ షాక్
- Sports
ఐపీఎల్ 2021 షెడ్యూల్ వచ్చేసింది.. వేదికల్లో హైదరాబాద్‌కు దక్కని చోటు !
- Finance
ట్విట్టర్ సీఈవో 15 ఏళ్ల క్రితం తొలి ట్వీట్‌కు రూ.కోట్లు
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత్‌లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ భారతదేశంలో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించి అరుదైన రికార్డు సృష్టించింది. భారతదేశంలో కార్యకాలాపాలు ప్రారంభించి 17 నెలల్లోనే 2 లక్షలకు పైగా కార్లను విక్రయించినట్లు కియా మో టార్స్ ప్రకటించింది.

భారతదేశంలోనే ఈ అరుదైన మైలురాయిని చేరుకున్న కియా మోటార్స్, ఇప్పుడు దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న కార్ కంపెనీగా మారింది. కియా మోటార్స్ ఆగస్ట్ 2019లో తమ సెల్టోస్ వాహనంతో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ మోడల్ మార్కెట్లో విడుదలైన అతికొద్ది సమంయలోనే అశేష ప్రజాదరణను పొందింది.

ఆ తర్వాత, గతేడాది చివర్లో కియా మోటార్స్ తమ సరికొత్త సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసింది. కియా సోనెట్ కూడా సెల్టోస్ మాదిరిగానే ఘన విజయాన్ని సాధించడంతో ఈ బ్రాండ్ అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఈ రెండు కార్లు కాకుండా కియా కార్నివాల్ అనే లగ్జరీ వ్యాన్‌ను కూడా కంపెనీ విక్రయిస్తోంది.
MOST READ:ప్రజలపై 'గ్రీన్ టాక్స్' మోతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్; ఏప్రిల్ 1 నుండి..

కియా మోటార్స్ గడచిన జూలై 2020లోనే 1 లక్ష యూనిట్ అమ్మకాల మైలురాయిని చేరుకుంది. కాగా, ఈ బ్రాండ్ తన రెండవ 1,00,000 యూనిట్ల అమ్మకాలను కేవలం 6 నెలల వ్యవధిలో నమోదు చేసి రికార్డు సృష్టించింది. అంతేకాకుండా, భారతదేశంలో కియా మోటార్స్ విక్రయించిన కార్లలో లక్షకు పైగా కనెక్టెడ్ కార్లే (యూవీఓ కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన కార్లు) ఉన్నాయి.

దేశంలో కియా మొత్తం అమ్మకాలలో 53 శాతం అమ్మకాలు ఈ కనెక్టింగ్ టెక్నాలజీతో కూడినవే కావటం విశేషం. అంటే, కియా మోటార్స్ విక్రయించే ప్రతి రెండు కార్లలో ఒకటి యూవీఓ కనెక్ట్ టెక్నాలజీతో కూడిన కారుగా ఉంటోంది. కేవలం మూడు ఉత్పత్తులతోనే కియా మోటార్స్, అతి తక్కువ సమయంలో భారతదేశపు టాప్-5 ఆటోమొబైల్ కంపెనీల్లో ఒకటిగా చేరిపోయింది.
MOST READ:బైక్‌నే బస్సుపైకి తలపై మోసిన రియల్ బాహుబలి [వీడియో]

కియా మోటార్స్ ఇప్పటి వరకూ విక్రయించిన మొత్తం కార్లలో 149,428 యూనిట్లు కేవలం సెల్టోస్ నుండే వచ్చాయంటే ఈ మోడల్ పట్ల మార్కెట్లో ఉన్న ఆదరణ ఏంటో ఇట్టే అర్థమవుతుంది. ఆ తర్వాతి స్థానంలో కియా లేటెస్ట్‌గా ప్రవేశపెట్టిన సోనెట్ ఉంది. ఈ మోడల్ అమ్మకాలు 45,195 యూనిట్లుగా ఉంటే, కార్నివాల్ ఎమ్‌పివి అమ్మకాలు 5409 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

కియా మోటార్స్‌కి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఓ తయారీ కేంద్రం ఉంది. ఈ ప్లాంట్‌లో కంపెనీ రెండు-షిఫ్టులను నిర్వహిస్తూ, కార్లను ఉత్పత్తి చేస్తోంది. అయితే, దేశంలో కియా కార్లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా, వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కంపెనీ మూడవ షిఫ్టును కూడా ప్రారంభించాలని యోచిస్తోంది.
MOST READ:ఎలక్ట్రిక్ కారుగా మారిన మారుతి డిజైర్ ; వివరాలు

వచ్చే ఏడాది (2022) నాటికి కియా మోటార్స్ భారతదేశంలో ఏటా 3,00,000 వాహనాలను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఉంది. అంతేకాకుండా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 300కి పైగా ఉన్న తమ టచ్‌పాయింట్‌లను మరింత పెంచుకోవాలని చూస్తోంది. ఈసారి టైర్ 3 మరియు టైర్ 4 మార్కెట్లపై కియా మోటార్స్ ప్రత్యేక దృష్టి సారించింది.

కియా మోటార్స్ భారత మార్కెట్లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోవటానికి, ఇక్కడి మార్కెట్ కోసం అనేక ఉత్పత్తులను కూడా ప్లాన్ చేసింది. ఇందులో ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే, సెల్టోస్ ఎస్‌యూవీని భారతదేశంలో విడుదల చేసి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో, కంపెనీ ఇందులో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కూడా విడుదల చేయాలని భావిస్తోంది.
MOST READ:కారు ఎక్కువ కాలం ఉపయోగించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ తప్పక పాటించాలి

కొత్తగా మార్కెట్లోకి రానున్న 2021 కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా ఫీచర్ అప్‌గ్రేడ్స్ ఉండనున్నాయి. ఇందులో టైగర్ నోస్ ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్డ్ హెడ్‌లైట్స్, టెయిల్ లైట్స్ మరియు ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్ ఉంటాయి. అలాగే, ఇందులో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, పానరోమిక్ సన్‌రూఫ్ వంటి కొత్త ఫీచర్లను కూడా జోడించే అవకాశం ఉంది.