భారీగా పెరిగిన Kia Seltos మరియు Kia Sonet కార్ల ధరలు

కొరియన్ కార్ బ్రాండ్ Kia India (గతంలో కియా మోటార్స్) భారత మార్కెట్లో విక్రయిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ సోనెట్ (Sonet) మరియు మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెల్టోస్ (Seltos) ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్ ను బట్టి వీటి ధరలు రూ. 10,000 మరియు రూ. 20,000 మధ్యలో పెరిగాయి.

భారీగా పెరిగిన Kia Seltos మరియు Kia Sonet కార్ల ధరలు

కియా ఇండియా ప్రస్తుతం దేశీయ విపణిలో Kia Seltos, Kia Sonet మరియు Kia Carnival అనే మూడు మోడళ్లను విక్రయిస్తోంది. వీటిలో Seltos మరియు Sonet కార్లు అత్యధికంగా అమ్ముడవుతూ, కంపెనీకి లాభాలు తెచ్చిపెడుతున్నాయి. గత ఆగస్టు 2021 నెలలో కూడా ఈ రెండు కార్లు కంపెనీకి మెరుగైన అమ్మకాల సాధించి పెట్టాయి.

భారీగా పెరిగిన Kia Seltos మరియు Kia Sonet కార్ల ధరలు

ఈ ఏడాది (2021 ) ప్రారంభం నుండి కియా ఇండియా తమ Seltos మరియు Sonet కార్ల ధరలను పెంచడం వరుగా ఇది మూడోసారి. ఈ రెండు ఎస్‌యూవీల ధరల పెరుగుదలకు కారణం, పెరిగిన ఇన్‌పుట్ ఖర్చులు, ముడి సరుకుల ధరలు మరియు రవాణా ఖర్చులేనని కంపెనీ చెబుతోంది.

భారీగా పెరిగిన Kia Seltos మరియు Kia Sonet కార్ల ధరలు

ఇంతకుముందు, Kia India గడచిన జనవరి నెలలో మరియు ఆ తరువాత మే నెలలో ఈ కార్ల ధరలను పెంచింది. తాజా ధరల పెంపు అనంతరం, Kia Seltos పెట్రోల్ వేరియంట్ల రూ. 10,000 వరకు పెరగగా, ఇందులో డీజిల్ వేరియంట్ల ధరలు రూ. 20,000 వరకూ పెరిగాయి. పెరిగిన ధరల తర్వాత, Kia Seltos బేస్ పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర ఇప్పుడు రూ. 9.95 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరుకుంది. వేరియంట్ల వారీగా కియా సెల్టోస్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

Seltos P 1.5 New Price Old Price Difference
HTE ₹9.95 Lakh ₹9.95 Lakh 0
HTK ₹10.84 Lakh ₹10.74 Lakh ₹10,000
HTK+ ₹11.89 Lakh ₹11.79 Lakh ₹10,000
HTK + iMT ₹12.29 Lakh ₹12.19 Lakh ₹10,000
HTX ₹13.75 Lakh ₹13.65 Lakh ₹10,000
HTX IVT ₹14.75 Lakh ₹14.65 Lakh ₹10,000
Seltos P 1.4 New Price Old Price Difference
GTX NA ₹15.65 Lakh -
GTX (O) ₹15.45 Lakh ₹15.35 Lakh ₹10,000
GTX+ ₹16.75 Lakh ₹16.65 Lakh ₹10,000
GTX+ DCT ₹17.54 Lakh ₹17.44 Lakh ₹10,000
X-Line DCT ₹17.79 Lakh - -
Seltos D 1.5 New Price Old Price Difference
HTE ₹10.65 Lakh ₹10.45 Lakh ₹20,000
HTK ₹11.99 Lakh ₹11.79 Lakh ₹20,000
HTK+ ₹13.19 Lakh ₹12.99 Lakh ₹20,000
HTK+ AT ₹14.15 Lakh ₹13.95 Lakh ₹20,000
HTX ₹14.95 Lakh ₹14.75 Lakh ₹20,000
HTX+ ₹15.99 Lakh ₹15.79 Lakh ₹20,000
GTX+ AT ₹17.85 Lakh ₹17.65 Lakh ₹20,000
X-Line AT ₹18.10 Lakh - -
భారీగా పెరిగిన Kia Seltos మరియు Kia Sonet కార్ల ధరలు

ఇక Kia Sonet కాంపాక్ట్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, ఇందులో కూడా పెట్రోల్ వేరియంట్ల ధరలను రూ. 10,000 మేర పెంచారు. అయితే, ఈ SUV యొక్క టాప్-స్పెక్ GTX + DCT ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. అలాగే, ఇందులోని డీజిల్ వేరియంట్ల ధరలను కూడా రూ. 20,000 మేర పెంచారు.

భారీగా పెరిగిన Kia Seltos మరియు Kia Sonet కార్ల ధరలు

ఇకపోతే, కంపెనీ ఇందులోని HTK + 6MT డీజిల్ వేరియంట్ ధరను మాత్రం కేవలం రూ. 10,000 మాత్రమే పెంచింది. ఈ ధరల పెరుగుదల తరువాత, Kia Sonet యొక్క బేస్ పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 6.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు బేస్ డీజిల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 8.55 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా మారింది. వేరియంట్ల వారీగా కియా సోనెట్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

Soent P 1.2 New Price Old Price Difference
HTE 5MT ₹6.89 Lakh ₹6.79 Lakh ₹10,000
HTK 5MT ₹7.89 Lakh ₹7.79 Lakh ₹10,000
HTK+ 5MT ₹8.75 Lakh ₹8.65 Lakh ₹10,000
Soent P 1.0 New Price Old Price Difference
HTK+ iMT ₹9.89 Lakh ₹9.79 Lakh ₹10,000
HTX iMT ₹10.39 Lakh ₹10.29 Lakh ₹10,000
HTX 7 DCT ₹11.09 Lakh ₹10.99 Lakh ₹10,000
HTX+ iMT ₹11.85 Lakh ₹11.75 Lakh ₹10,000
GTX+ iMT ₹12.29 Lakh ₹12.19 Lakh ₹10,000
GTX+ 7DCT ₹12.99 Lakh ₹12.99 Lakh 0
Sonet D 1.5 New Price Old Price Difference
HTE 6MT ₹8.55 Lakh ₹8.35 Lakh ₹20,000
HTK 6MT ₹9.49 Lakh ₹9.29 Lakh ₹20,000
HTK+ 6MT ₹9.99 Lakh ₹9.89 Lakh ₹20,000
HTX 6MT ₹10.69 Lakh ₹10.49 Lakh ₹20,000
HTX 6AT ₹11.49 Lakh ₹11.29 Lakh ₹20,000
HTX+ 6MT ₹12.19 Lakh ₹11.99 Lakh ₹20,000
GTX+ 6MT ₹12.65 Lakh ₹12.45 Lakh ₹20,000
GTX+ 6AT ₹13.45 Lakh ₹13.25 Lakh ₹20,000
భారీగా పెరిగిన Kia Seltos మరియు Kia Sonet కార్ల ధరలు

గడచిన జూన్ 2021 నెలాఖరులో Kia India తమ Seltos మరియు Sonet మోడళ్లలో అప్‌డేటెడ్ 2021 వెర్షన్లను మార్కెట్లో విడుదల చేసింది. కొత్త అప్‌డేట్స్ తో విడుదలైన ఈ మోడళ్లలోని ఎంపిక చేసిన వేరియంట్లలో కంపెనీ పాడిల్ షిఫ్టర్ ఫీచర్ ను జోడించింది. ఈ పాడిల్ షిఫ్టర్ లు కారు స్టీరింగ్ క్రింది భాగంలో అమర్చబడి ఉంటాయి.

భారీగా పెరిగిన Kia Seltos మరియు Kia Sonet కార్ల ధరలు

ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగిన కార్లలో మాత్రమే ఈ పాడిల్ షిఫ్టర్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్ సాయంతో డ్రైవర్లు ఆటోమేటిక్ కార్లను మ్యాన్యువల్ కార్ల మాదిరిగా ఉపయోగించుకోవచ్చు మరియు పాడిల్ షిఫ్టర్ల సాయంతో గేర్లను పెంచడం తగ్గించడం చేయవచ్చు.

భారీగా పెరిగిన Kia Seltos మరియు Kia Sonet కార్ల ధరలు

Kia Seltos GTX + 1.5 D 6AT మరియు 1.4 T-GDi 7 DCT వేరియంట్లలో మరియు Kia Sonet యొక్క అన్ని ఆటోమేటిక్ వేరియంట్లలో ఈ పాడిల్ షిఫ్టర్స్ ఫీచర్స్ లభిస్తాయి. ఇవి డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సరదాగా చేయడంలో సహకరిస్తాయి. - ఈ కొత్త వేరియంట్లకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

భారీగా పెరిగిన Kia Seltos మరియు Kia Sonet కార్ల ధరలు

Kia India ఆగస్టు 2021 సేల్స్ రిపోర్ట్..

తాజాగా Kia India తమ ఆగస్టు 2021 అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం, కంపెనీ గడచిన నెలలో మొత్తం 16,750 యూనిట్ల కార్లను భారత మార్కెట్లో విక్రయించింది. ఇందులో, Kia Seltos కార్లే అత్యధికంగా 8,619 యూనిట్లు ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

Most Read Articles

English summary
Kia seltos and sonet prices increased again new price list details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X