Kia Seltos HTX వేరియంట్‌లో iMT గేర్‌బాక్స్ ఆప్షన్.. త్వరలోనే విడుదల..

కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ Kia India (గతంలో కియా మోటార్స్), భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ మిడ్-సైడ్ ఎస్‌యూవీ కియా సెల్టోస్ (Kia Seltos) ఈ విభాగంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో ఒకటిగా ఉంది.

Kia Seltos HTX వేరియంట్‌లో iMT గేర్‌బాక్స్ ఆప్షన్.. త్వరలోనే విడుదల..

అయితే, ఈ విభాగంలో కొత్తగా వచ్చిన మరియు వస్తున్న మోడళ్ల (స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మొదలైనవి) కారణంగా పెరిగుతున్న పోటీ నేపథ్యంలో, కియా సెల్టోస్ అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీ ఇప్పుడు ఈ మోడల్ ను కొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది.

Kia Seltos HTX వేరియంట్‌లో iMT గేర్‌బాక్స్ ఆప్షన్.. త్వరలోనే విడుదల..

తాజా సమాచారం ప్రకారం, Kia India (కియా ఇండియా) ఇప్పుడు తమ సెల్టోస్ ఎస్‌యూవీ వేరియంట్ లైనప్‌ను మళ్లీ అప్‌డేట్ చేయడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం, Kia Seltos యొక్క 1.5 లీటర్ పెట్రోల్ వెర్షన్ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో HTE, HTK, HTK+ మరియు HTX ఉన్నాయి.

Kia Seltos HTX వేరియంట్‌లో iMT గేర్‌బాక్స్ ఆప్షన్.. త్వరలోనే విడుదల..

కాగా, Kia Seltos HTK+ వేరియంట్ లో లభిస్తున్న iMT (ఇంటెలిజెంట్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) గేర్‌బాక్స్ ఆప్షన్ ను ఇకపై Seltos HTK వేరియంట్ లో కూడా అందిచాలని కంపెనీ నిర్ణయించింది. ఇందులో iMT గేర్‌బాక్స్ అనేది ఆటోమేటిక్ గేర్‌బాక్స్ యొక్క సౌకర్యాన్ని మరియు మ్యాన్యువల్ గేర్‌బాక్స్ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

Kia Seltos HTX వేరియంట్‌లో iMT గేర్‌బాక్స్ ఆప్షన్.. త్వరలోనే విడుదల..

ఒక్కమాటలో చెప్పాలంటే, దీనిని క్లచ్ లేని మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ వ్యవస్థ అనొచ్చు. ఐఎమ్‌టి గేర్‌బాక్స్ 2-పెడల్ ట్రాన్స్‌మిషన్ సౌలభ్యంతో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ పనితీరును అందిస్తుంది. ఇందులోని సిక్స్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ యూనిట్‌లో ఎలక్ట్రో-మెకానికల్ యాక్చుయేటెడ్ క్లచ్ ఉంటుంది, ఇది కారు ప్రయాణించే వేగాన్ని బట్టి ఇ్బబందులు లేని గేర్‌షిఫ్ట్‌లను అందిస్తుంది.

Kia Seltos HTX వేరియంట్‌లో iMT గేర్‌బాక్స్ ఆప్షన్.. త్వరలోనే విడుదల..

గడచిన మే 2021 నెలలో Kia India తమ Seltos ఎస్‌యూవీని సరికొత్త లోగో మరియు కొత్త 6 స్పీడ్ iMT గేర్‌బాక్స్‌ తో అప్‌డేట్ చేసిన సంగతి తెలిసినదే. అయితే, ఆ సమయంలో ఈ క్లచ్‌లెస్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ ను కేవలం HTK+ యొక్క మిడ్-స్పెక్ వేరియంట్‌లో మాత్రమే అందించారు. కాగా, ఇప్పుడు దీనిని HTX వేరియంట్ కు విస్తరింపజేశారు.

Kia Seltos HTX వేరియంట్‌లో iMT గేర్‌బాక్స్ ఆప్షన్.. త్వరలోనే విడుదల..

ఈ వేరియంట్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ iMT గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. కాబట్టి, వినియోగదారులు తమకు నచ్చిన ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ ను ఎంచుకోవచ్చు. ఈ క్లచ్ రహిత ఇంటెలిజెంట్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఐఎమ్‌టి) ను తొలిసారిగా Kia అనుబంధ సంస్థ అయిన Hyundai తమ Venue కాంపాక్ట్ ఎస్‌యూవీలో పరిచయం చేసింది.

Kia Seltos HTX వేరియంట్‌లో iMT గేర్‌బాక్స్ ఆప్షన్.. త్వరలోనే విడుదల..

ఈ వ్యవస్థలో బ్రేక్, యాక్సిలరేటర్ పెడల్స్ మాత్రమే ఉంటాయి, క్లచ్ పెడల్ ఉండదు. గేరు మార్చాలనుకున్న ప్రతిసారి ఇందులోని క్లచ్ ఆటోమేటిక్‌గా దానంతటత అదే యాంత్రికంగా ఆపరేట్ అవుతూ ఉంటుంది. సిటీ రోడ్లపై తక్కువ వేగంతో నడిపేటప్పుడు తరచూ గేర్ మార్చాల్సి వచ్చినప్పుడు క్లచ్‌ను మ్యాన్యువల్‌గా నొక్కాల్సిన అవసరాన్ని ఇది నివారిస్తుంది.

Kia Seltos HTX వేరియంట్‌లో iMT గేర్‌బాక్స్ ఆప్షన్.. త్వరలోనే విడుదల..

ఇక Kia Seltos HTK వేరియంట్ విషయానికి వస్తే, ఈ కారులో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు లేటెట్ కార్క కనెక్టింగ్ టెక్నాలజీ OTA (ఓవర్ ది ఎయిర్) అప్‌డేట్స్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఎయిర్ ప్యూరిఫయర్, ఏఐ వాయిస్ కమాండ్స్, హిల్-స్టార్ట్ అసిస్ట్, బ్రేక్ అసిస్ట్, యాంబియంట్ లైటింగ్, క్రూయిజ్ కంట్రోల్ మరియు కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Kia Seltos HTX వేరియంట్‌లో iMT గేర్‌బాక్స్ ఆప్షన్.. త్వరలోనే విడుదల..

ఈ వేరియంట్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 113 బిహెచ్‌పి పవర్ ను మరియు 144 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ iMT గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

Kia Seltos HTX వేరియంట్‌లో iMT గేర్‌బాక్స్ ఆప్షన్.. త్వరలోనే విడుదల..

కొత్త Kia Seltos X Line వేరియంట్ విడుదల...

ఇదిలా ఉంటే, Kia India ఈ నెల (సెప్టెంబర్) ఆరంభంలో తమ కొత్త Kia Seltos X Line ట్రిమ్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ కొత్త వేరియంట్ ధర రూ. 17.99 లక్షల (ఎక్స్-షోరూమ్) గా ఉంది. స్టాండర్డ్ సెల్టోస్ తో పోల్చుకుంటే, ఈ స్పెషల్ ఎడిషన్ లో కంపెనీ దాని ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ లలో పలు మార్పులు చేర్పులు చేసింది.

Kia Seltos HTX వేరియంట్‌లో iMT గేర్‌బాక్స్ ఆప్షన్.. త్వరలోనే విడుదల..

కొత్త Kia Seltos X Line ఎక్స్-లైన్‌ వేరియంట్ ను ప్రత్యేక మ్యాట్ గ్రాఫైట్ గ్రే షేడ్‌లో గ్లోస్ బ్లాక్ రూఫ్‌తో ఫినిష్ చేశారు. ఇంకా ఇందులో పియానో బ్లాక్ స్ట్రిప్‌తో కూడిన మ్యాట్ గ్రాఫైట్ గ్రిల్ మరియు ముందు భాగంలో ఆరెంజ్ యాక్సెంట్స్ కలిగిన బ్లాక్ స్కిడ్ ప్లేట్ వంటి ఉన్నాయి.

Kia Seltos HTX వేరియంట్‌లో iMT గేర్‌బాక్స్ ఆప్షన్.. త్వరలోనే విడుదల..

కంపెనీ ఈ Kia Seltos X Line లో కొత్త 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ను కూడా ఆఫర్ చేస్తోంది. ఇవి ప్రస్తుతం స్టాండర్డ్ మోడల్ లో లభిస్తున్న 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ కంటే పెద్దవిగా ఉంటాయి. ఇంకా ఇందులో బ్లాక్ కలర్ సైడ్ మిర్రర్స్ మరియు ఆరెంజ్ కలర్ సైడ్ డోర్ గార్నిష్ కూడా ఉంటుంది.

Kia Seltos HTX వేరియంట్‌లో iMT గేర్‌బాక్స్ ఆప్షన్.. త్వరలోనే విడుదల..

ఇక Kia Seltos X-Line ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఇది రెండు ఇంజన్ ఆప్షన్‌లతో లభిస్తుంది. ఇందులో 1.4 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లు ఉన్నాయి. దీని పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 140 బిహెచ్‌పి శక్తిని మరియు డీజిల్ ఇంజన్ 115 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఇంజన్ 7-స్పీడ్ డిసిటి మరియు డీజిల్ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

Most Read Articles

English summary
Kia seltos htx variant to get imt gearbox soon details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X