కొత్త Kia Seltos X Line వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు

కొరియన్ కార్ బ్రాండ్ కియా ఇండియా (Kia India) భారతదేశంలో తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించే దిశలో భాగంగా, ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న Seltos మిడ్-సైజ్ ఎస్‌యూవీలో ఓ వేరియంట్ ను విడుదల చేసింది. దానికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

కొత్త Kia Seltos X Line వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు

Kia India తమ కొత్త Kia Seltos X Line ట్రిమ్ ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ ఈ కొత్త వేరియంట్ ను రూ. 17.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద విక్రయించనుంది. ఈ స్పెషల్ ఎడిషన్ వేరియంట్ లో కంపెనీ దాని ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ లలో పలు మార్పులు చేర్పులు చేసింది.

కొత్త Kia Seltos X Line వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు

కొత్త Kia Seltos X Line వేరియంట్ కోసం బుకింగ్ లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ కారును కంపెనీ వెబ్‌సైట్ లేదా అధీకృత డీలర్‌షిప్ నుండి బుక్ చేసుకోవచ్చు. ఈ వేరియంట్ ను ప్రత్యేక మ్యాట్ గ్రాఫైట్ గ్రే షేడ్ బాడీ కలర్ మరియు గ్లోస్ బ్లాక్ రూఫ్ పెయింట్ స్కీమ్ తో పరిచయం చేశారు.

కొత్త Kia Seltos X Line వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు

అంతేకాకుండా, ఇందులో చేసిన ఇతర మార్పులలో పియానో బ్లాక్ స్ట్రిప్‌తో కూడిన మ్యాట్ గ్రాఫైట్ గ్రిల్ మరియు ముందు భాగంలో ఆరెంజ్ యాక్సెంట్స్ కలిగిన బ్లాక్ స్కిడ్ ప్లేట్ వంటి ఉన్నాయి. కంపెనీ ఈ Kia Seltos X Line లో కొత్త 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ను కూడా ఆఫర్ చేస్తోంది. ఇవి ప్రస్తుతం స్టాండర్డ్ మోడల్ లో లభిస్తున్న 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ కంటే పెద్దవిగా ఉంటాయి. ఇంకా ఇందులో బ్లాక్ కలర్ సైడ్ మిర్రర్స్ మరియు ఆరెంజ్ కలర్ సైడ్ డోర్ గార్నిష్ కూడా ఉంటుంది.

కొత్త Kia Seltos X Line వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు

Kia Seltos X Line లో కొత్త ఏముంది?

  • ప్రత్యేకమైన పియానో బ్లాక్ అవుట్‌లైన్‌తో కూడిన మ్యాట్ గ్రాఫైట్ ఫ్రంట్ గ్రిల్
  • ప్రత్యేకమైన పియానో బ్లాక్ యాక్సెంట్స్ తో కూడిన ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్
  • సన్ ఆరెంజ్ యాక్సెంట్ తో కూడిన ప్రత్యేకమైన పియానో బ్లాక్ ఫ్రంట్ స్కిడ్ ప్లేట్
  • సన్ ఆరెంజ్ యాక్సెంట్ తో కూడిన ప్రత్యేకమైన పియానో బ్లాక్ రియర్ స్కిడ్ ప్లేట్
  • ప్రత్యేకమైన పియానో బ్లాక్ డ్యూయల్ మఫ్లర్ డిజైన్
  • ప్రత్యేకమైన పియానో బ్లాక్ టెయిల్‌గేట్ గార్నిష్
  • సైడ్ డోర్‌లో సన్ ఆరెంజ్ యాక్సెంట్ గార్నిష్
  • సన్ ఆరెంజ్ యాక్సెంట్ తో కూడిన సెంటర్ వీల్ క్యాప్
  • ప్రత్యేకమైన పియానో బ్లాక్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్
  • ప్రత్యేకమైన పియానో బ్లాక్ షార్క్ ఫిన్ యాంటెన్నా
  • ప్రత్యేకమైన X Line బ్యాడ్జింగ్
  • కొత్త Kia Seltos X Line వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు

    కొత్త Kia Seltos X Line వేరియంట్ వెనుక డిజైన్ ను గమనిస్తే, ఇందులో షార్క్ ఫిన్ యాంటెన్నా, టెయిల్ గేట్ గార్నిష్, ఎగ్జాస్ట్ మఫ్లర్ మరియు రియర్ స్కిడ్ ప్లేట్‌లకు గ్లోస్ బ్లాక్ ఫినిషింగ్ ఇవ్వబడింది. ఇది కాకుండా, బూట్ లోపల కూడా X Line బ్యాడ్జింగ్ ఉంటుంది.

    కొత్త Kia Seltos X Line వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు

    క్యాబిన్ లోపల వైపు హనీకోంబ్ ప్యాటర్న్ మరియు గ్రే కలర్ స్టిచింగ్ తో కూడిన కొత్త లెదర్ సీట్ అప్‌హోలెస్ట్రీ లభిస్తుంది. Kia India ఈ షేడ్ కు ఇండిగో పెరా అని పేరును పెట్టింది మరియు ఇది ముదురు నీలం మరియు మ్యాట్ గ్రే కలయికగా కనిపిస్తుంది. ఇవి కాకుండా, క్యాబిన్‌లో మరియు వెలుపల వేరే ఇతర మార్పులు ఏవీ లేవు.

    కొత్త Kia Seltos X Line వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు

    ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ Kia Seltos X Line వేరియంట్ ను Kia Seltos యొక్క ప్రస్తుత లైనప్ లోని టాప్-స్పెక్ GT- Line ట్రిమ్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేశారు. ఇది అన్ని స్టాండర్డ్ ఫీచర్లతో లభిస్తుంది. Kia India గత సంవత్సరం ఆటో ఎక్స్‌పో 2020 లో Seltos X Line ను కాన్సెప్ట్‌గా ప్రదర్శించింది.

    కొత్త Kia Seltos X Line వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు

    నిజానికి Seltos X Line కంపెనీ గతంలో ప్రదర్శించిన దాని కాన్సెప్ట్ వెర్షన్ రగ్గడ్ గా లేదా అగ్రెసివ్ గా కనిపించదు. ఇక Kia Seltos X Line లో లభించే ఫీచర్‌ల విషయానికి వస్తే, కంపెనీ ఇందులో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ని లేటెస్ట్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీతో అందిస్తోంది.

    కొత్త Kia Seltos X Line వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు

    ఇంకా ఇందులో 8 స్పీకర్లతో కూడిన ప్రీమియం బోస్ సౌండ్ సిస్టమ్, ఎల్ఈడి లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, హెడ్స్-అప్ డిస్‌ప్లే, క్యాబిన్ ప్రీ-కూలింగ్ మరియు రిమోట్ ఇంజన్ స్టార్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే, ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు మరియు ట్రాక్షన్ కంట్రోల్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

    కొత్త Kia Seltos X Line వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు

    ఇకపోతే, ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, కొత్త Kia Seltos X Line వేరియంట్ ను రెండు ఇంజిన్ ఆప్షన్‌లలో అందిస్తున్నారు. ఇందులో మొదటిది 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు రెండవది 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. దీని పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 140 బిహెచ్‌పి శక్తిని మరియు డీజిల్ ఇంజన్ 115 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఇంజన్ 7-స్పీడ్ డిసిటి మరియు డీజిల్ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

Most Read Articles

English summary
Kia seltos x line variant launched in india price specs features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X